1 నుంచి 10 తరగతుల వరకు 27 వారాలతో సవరించిన అకడమిక్ క్యాలెండర్ 2021 -22,తరగతుల వారీగా పాఠ్య ప్రణాళికలు,నిర్వహించవలసిన కార్యక్రాలు అన్నీ విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ.
Nadu Nedu - 1st phase ,2nd phase diffrences
నాడు నేడు - మొదటి ఫేజ్, రెండో ఫేజ్ లలో మార్పులు
ఈసారి సిమెంటు , గ్రీన్ బోర్డు మొదలైన వాటితో పాటుగా కరెంటు సామాన్లు , స్విచ్ బోర్డు, ఫ్యాన్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, బాత్రూం టైల్స్ ,బాత్ రూమ్ డోర్స్ , విండోస్ మొదలైన ఇతర సామాన్లు అన్నీ నేరుగా ప్రభుత్వం సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేస్తారు....ఈ సారి విండోస్, డోర్స్ తుప్పు పట్టని stain less steel వి ఇస్తారు.
నాడు నేడు మొదటి విడతలో లాగా అమౌంట్ చాల నట్లయితే మరో విడత విడుదల చేయు విధానం ఫేస్ -2 నందు ఉండదు.
కావున ప్రధానోపాధ్యాయులు పాఠశాల కమిటీ వారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహాయంతో ముందుగానే జాగ్రత్తగా అవసరమైన అన్ని పనులకు ఎస్టిమేషన్ తయారుచేసుకుని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్నటువంటి స్టేషనరీ కి సంబంధించి గాని రిపేరు చేస్తే ఉపయోగపడే వస్తువులకు సంబంధించి requirement పెట్టకపోవడం మంచిది.
ముందస్తుగా మనం సబ్మిట్ చేసే input data వివరాలు అత్యంత జాగ్రత్తగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఇవ్వబడే నిధులు పూర్తిగా input data పై ఆధారపడి ఉంటాయి.
విద్యార్థులకు సంబంధించిన డ్యూయల్ డెస్క్ లు మరియు క్లాస్ రూమ్ కు అవసరమైన టేబుల్స్, ఫ్యాన్లు ,ట్యూబ్ లైట్లు , ఇతర సామాగ్రిని కూడా మనకున్న తరగతి గదులు, విద్యార్థుల సంఖ్య వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇండెంట్ రాయాలి. అదనంగా రాయడం వల్ల ఇబ్బంది పడవలసి వస్తుంది.
ఈసారి STMS app లాగిన్ ప్రధానోపాధ్యాయులు తో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఇవ్వబడుతుంది.
నాడు నేడు కమిటీలో నియమింపబడిన పీసీ కమిటీలోని ఐదుగురు సభ్యులు ఈ వర్క్ పూర్తయ్యేవరకు తప్పనిసరిగా వారే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యులను మార్చకూడదు.
నాడు నేడు సంబంధించి స్కూల్ infrastructure అన్ని ఫోటోలను తీసి జాగ్రత్త చేసుకోవాలి . ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉంది అని కంపేర్ చేస్తూ ఆ ఫోటోలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
ఈసారి నాడు నేడు పనుల పరిశీలన ప్రధానోపాధ్యాయుల తోపాటు ఆ పాఠశాలలోని అందరు ఉపాధ్యాయులకు బాధ్యత కల్పించడం అయినది . ప్రతి ఒక ఉపాధ్యాయుడు కూడా ఒక్కొక్క పనులకు సంబంధించి బాధ్యత వహించవలసి ఉంటుంది.
మరిన్ని అంశాలు రేపటి ఆన్లైన్ శిక్షణ అనంతరం తెలియజేయబడతాయి.
మీ ఊరిలోని పాఠశాలలో జరిగే నాడు-నేడు పనుల పూర్తిడేటా
ఏవిధమైన కోడ్ లేకుండా జిల్లా , మండలము , గ్రామము , పాఠశాల పేరును సెలెక్ట్ చేసుకుని నాడు-నేడు పనులలో వాడిన మెటీరియల్ , పనివారు , మొదలైనవి క్రింది లింకుపై క్లిక్ చేసి పరిశీలించవచ్చును.
http://nadunedu.se.ap.gov.in
వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు.విద్యార్థుల ప్రయోజనం కోసమే పరీక్షల నిర్వహణ: వచ్చే నెల చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం: సురేశ్
సీఎంతో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం: మంత్రి సురేశ్.జులైలో ఇంటర్ పరీక్షలు.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందన్నారు. సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే పరీక్షలు నిర్వహణ అని తెలిపారు. 1998 డీఎస్సీ అభ్యర్థుల సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సురేశ్ వెల్లడించారు. 36 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.ఇంటర్ పరీక్షలకు 10లక్షల మంది.
ఇంటర్ పరీక్షలకు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారు. పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందు షెడ్యూలు ప్రకటించాలి. ఈ నెల 20 వరకూ కర్ఫ్యూ ఉంది. ఆ తర్వాత వైద్యశాఖ అధికారుల సూచనలతో పరీక్షల సమయాన్ని ప్రకటించాలని భావిస్తున్నారు. వచ్చే నెల ఇంటర్ పరీక్షలు పూర్తయితే ఆగస్టులో ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ, ఇతర ఉమ్మడి పోటీ పరీక్షలు ఉంటాయి. సెప్టెంబరులో తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది.
కరోనా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష:
రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించకుండానే కరోనాకట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. అందరికీ కొవిడ్ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. లక్షణాలు ఉన్న అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో 62శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం కొవిడ్ కేసులు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా మరణాలు నమోదవుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆలస్యంగా ఆసుత్రులను ఆశ్రయించడమే మరణాలకు కారణంగా గుర్తించారు.
వాలంటీర్, ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలతో ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇంటింటి సర్వే చేయడంపై కసరత్తు చేయాలన్నారు. సీసీటీవీల ద్వారా ఆసుపత్రుల పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాణ్యమైన భోజనం, శానిటైజేషన్‌పై దృష్టి సారించాలన్నారు
ఉద్యోగ ఖాళీల వివరాల సేకరణ.12లోగా సమర్పించాలని సీఎస్ ఆదేశం.వివిధ శాఖల్లో కసరత్తు
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల వివరాల సేకరణ కొనసాగుతోంది. వివిధ శాఖల్లో గ్రూపు-1, 2 3, 4, ఇతర కేటగిరీల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12లోపు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఇటీవల ఆదేశించారు. ఖాళీల వివరాల సేకరణకు ప్రత్యేకంగా ఓ నమూనాను ఆయన వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు పంపారు. మరో రెండు రోజుల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను ఆన్‌లైన్ ద్వారా సీఎస్‌కు పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీపై ఉగాదినాడు అధికారిక ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ కసరత్తు ప్రాధాన్యం సంతరించుకుంది.
అవసరమైతేనే భర్తీ
క్యారీఫార్వర్డ్, నాన్-జాయినింగ్ పోస్టుల వివరాలనూ సేకరిస్తున్నారు. గుర్తించిన ఖాళీలను ఒకేసారి కాకుండా.. దశల వారీగా భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాల కిందట మంజూరైన పోస్టులను యథాతథంగా కొనసాగించకుండా ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు అవసరమైతేనే భర్తీ చేయాలని ఉన్నతస్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి.
SSC June 2021 Fee Payment due date extended upto 15-04-2021.Rc.No.149/J- 2/2021 Dated: 31-03-2021
AP 10 వ తరగతి జూన్ 2021 పబ్లిక్ పరీక్షలకు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పెంపు తేదీలలతో ఉత్తర్వులు జారీ.
10th Class Exams Fee Last Date April 5th
టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 5
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ అభ్య ర్థులు, అలాగే గతంలో ఫెయిలైన విద్యార్థులు మార్చి 20 నుంచి ఏప్రిల్ 5 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ ఎ.సుబ్బారెడ్డి బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రూ.50 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 12 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
Open and click on any book and the voice over can be heard with ease. Let the children access this clickable pdf
DISTRICT COMMON EXAMINATIONS BOARD PRAKASAM DSITRICT 103 DAYS ACTION PLAN FOR SSC STUDENTS 2020-2021
జిల్లా ఉమ్మడి పరీక్ష బోర్డ్, ప్రకాశం జిల్లా వారు 10 వ తరగతి విద్యార్థుల కొరకు 103 రోజుల వార్షిక ప్రణాళిక ను విడుదల చేయడం జరిగింది. రోజువారీ చెప్పవలసిన పాఠ్యాంశంలను వివరంగా పోందుపరచడం జరిగింది.