292 హై స్కూల్ లో 2022-23 సంవత్సరం నుండి బాలికల హై స్కూల్ ప్లస్ కాలేజి లను ఏర్పాటు చేస్తూ జీవో జారీ .
Child Adoption Leave / Child Care Leave / Special Causal Leave to orthopedically challenged / Ex-gratia on EOL for certain deceases
ఏపి ఉద్యోగులకు 11వ PRC 2022 ప్రకారం సమగ్ర సెలవు ప్రయోజనాలకు సంభందించి ఉత్తర్వులు G.O.Ms.No.33 Date: 08.03.2022 విడుదల.
Child Adoption Leave / Child Care Leave / Special Causal Leave to orthopedically challenged / Ex-gratia on EOL for certain deceases లపై ఉత్తర్వులు.
చైల్డ్ కేర్ లీవ్ 60 రోజుల నుంచి 180 రోజులకు పెంపు.
చైల్డ్ కేర్ లీవ్ ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా వర్తింపు.
11వ పీఆర్సీ సిఫార్సులతో ప్రభుత్వం ఆదేశాలు
11వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సుల ఆధారంగా పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్ క్యాజువల్ సెలవులు, పలు వ్యాధులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షమీర్ సింగ్ రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ జీఓ ప్రకారం ఉద్యోగులకు లభించే ప్రయోజనాలివీ.
► పిల్లలను దత్తత తీసుకున్న ఉద్యోగి 180 రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చు. సెలవు రోజులకు కూడా పూర్తి జీతం పొందొచ్చు. అలాగే, ఈ సెలవులను ఇతర సెలవులతో కలిపి కూడా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. దత్తత శిశువు వయసు నెలరోజుల్లోపు ఉంటే ఏడాది వరకూ కూడా సెలవు ఇస్తారు. బిడ్డ వయసు ఆరు నెలల నుంచి ఏడు నెలలలోపు ఉంటే ఆరు నెలలు సెలవు తీసుకోవచ్చు. తొమ్మిది నెలలు, ఆ పైన వయస్సుంటే మూడు నెలలు సెలవు దొరుకుతుంది. ఇవన్నీ ఇతర సెలవులకు అదనంగా వస్తాయి. అయితే, దత్తత తీసుకునే వారికి అప్పటికే ఇద్దరు పిల్లలుంటే ఇవేవీ వర్తించవు.
► పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ పీఆర్సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను వినియోగించుకోవచ్చు. ఈ అవకాశం ఒంటరి (అవివాహితుడు, విడాకులు పొందిన వారు, భార్య చనిపోయిన వారు) పురుషులకూ వర్తిస్తుంది.
► వికలాంగులైన ఉద్యోగులు తమ కృత్రిమ అవయవాలను మార్చుకునేందుకు ఏటా ఏడు రోజుల పాటు స్పెషల్ క్యాజువల్ సెలవులను పొందవచ్చు. హైరిస్క్ వార్డుల్లో పనిచేసే నర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ సెలవులు తీసుకోవచ్చు.
► ఇక ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బేసిక్ పే లిమిట్ రూ.35,570గా ఉన్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు రూ.11,560 నుంచి, రూ.17,780 వరకూ, లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయిస్ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ప్రతినెలా పొందవచ్చు. అలాగే, ఆర్జిత సెలవులు, సగం జీతం సెలవులు ముగిసిన తరువాత కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ సెలవులు తీసుకోవచ్చు.
“SUPPORTING ANDHRA’S LEARNING TRANSFORMATION (SALT)” PROJECT WITH THE LOAN ASSISTANCE OF USD 250 MILLION FROM THE WORLD BANK FOR SUPPORTING VARIOUS INITIATIVES IN SCHOOL EDUCATION
250 మిలియన్ డాలర్ల (సుమారు 1850 కోట్లు) ప్రపంచ బ్యాంక్ ఆర్ధిక సహాయంతో పాఠశాల విద్యాశాఖలో Supporting Andhra’s Learning Transformation (SALT) ప్రాజెక్ట్ అమలును నోటిఫై చేస్తూ G.O.MS.No. 4 Dated: 30-01-2022 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
G.O.Ms.No.12 Dated: 29/01/2022 Revised Pay Scales 2022 – House Rent Allowance - Further Orders – Issued
HOD(Head of the departments)లలో పని చేస్తున్న ఉద్యోగులందరికి ఇంటి అద్దె 8% నుంచి 16%కి పెంచుతూ తాజాగా ఆదేశాలు జారీ.
HM&FW Department - guidelines for transfer of regular employees in HM&FW department with effect from01-02-2022 to 28-02-2022
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట వైద్య,ఆరోగ్య శాఖ.
Model School Teachers Retirement Age Enhanced from 58 yrs to 60yrs as per G.O Ms No: 83
Economically Weaker Sections Reservation candidates age extended 5 years
Economically Weaker Sections వారికి ప్రభుత్వ నియామకాలలో గరిష్టవయోపరిమితికి 5 సంవత్సరాలు సడలింపు ఉండేలా ప్రభుత్వ ఉత్తర్వులు.
Ap Egazette website for availability of GO 's
AP ప్రభుత్వం Public Interest దృష్ట్యా అవసరమైన G.O లు Digital Sign తోఈ క్రింది web portal లో లభిస్తాయని CS గారు G.O No 100 ద్వారా తెలియచేశారు.
https://apegazette.cgg.gov.in/eGazetteSearch.do?mode=unspecified
SC, ST Candidates age Relaxation extended u0to 31-5-2026
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో SC / ST లకు గరిష్ట వయో పరిమితి (ఈ ఏడాది మే 31 తో ముగిసిన) ని 31.05.2026 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు G.O.Ms.No. 95 Dt : 02.09.2021 విడుదల.
General Administration Department - Implementation of 10% Reservation to the Economically Weaker Sections (EWS) for initial appointments in the Posts and Services under the State Government
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో EWS Economically Weaker Sections కు 10% రిజర్వేషన్స్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ.విద్యా సంస్థలలో ప్రవేశాలకు ఆర్ధికంగా బలహీనవర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలుకు ఉత్తర్వులు జారీ
Electric 2 Wheelers (Bikes/Scooters) to AP Govt Employees on EMI Basis - Norms GO 4 Zero Down Payment,EMI Amount – ₹.2000 - ₹ Rs.2500,EMI – 24 to 60 Months
Providing Electric 2-Wheelers to Govt Employees on EMI Basis GO.4 Dt:06.07.21
వాయిదా పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రికల్ టూవీలర్లు ఇవ్వడం గురించి,డౌన్ పేమెంట్ లేదు, వాయిదాలు 20 నెలలు నుండి 60 వరకు పూర్తి వివరాలు GO నందు కలవు.
EVNREDCAP Android App
వాయిదా పద్ధతిలో ఎలక్ట్రికల్ బైకులు కావలసినవారు e 2 wheeler Evnredcap ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ఈ క్రింది లింక్ ద్వారా Android App డౌన్లోడ్ చేసుకోండి
AP Contract Employees -Remuneration & Other Benefits- Comprehensive orders G.O.NO. 40 Dt.18.06.2021 Released
ఆంధ్ర ప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు PRC 2015 ప్రకారం మినిమ్ టైం స్కేల్, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, మరణించిన ఒప్పంద ఉద్యోగులకు ఎక్స్-గ్రేషియా చెల్లించుటపై G.O.NO. 40 Dt.18.06.2021 ఉత్తర్వులు విడుదల.
Payment of Minimum of Time Scale(MTS) in Revised Pay Scales 2015 to the Contractual employees
Maternity Leave for women employees engaged on contractual basis
Sanction of Ex-gratia to the contract employees Complete G.O 40
AP Samagra Shiksha - Supporting Andhra’s Learning Transformation (SALT)” Project with the loan assistance of USD 250 million from the World Bank for supporting various initiatives in School Education G.O.MS.No. 30 Dated: 11-05-2021
250 మిలియన్ డాలర్ల ప్రపంచ బ్యాంక్ ఆర్ధిక సహాయంతో పాఠశాల విద్యాశాఖలో Supporting Andhra’s Learning Transformation (SALT) ప్రాజెక్ట్ కు అనుమతిస్తూ G.O.MS.No. 30 Dated: 11-05-2021 విడుదల చేసిన విద్యాశాఖ
Ap Curfew Go released by ap govt
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి (5.5.2021) నుండి అమలు కానున్న పాక్షిక కర్ఫ్యూకి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసిన వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ
Annual Calendar for the year 2021-22 of Navaratnalu & other programmes - Communication
ఎపి లో నవరత్నాలు మరియు ఇతర పధకాలకు వార్షిక కేలండర్ 2021-22 విడుదల.
విద్యా, వసతి దీవెనలు ఏప్రిల్,డిసెంబర్ లలో, విద్యాకానుక జూన్ లో, అమ్మ ఒడి జనవరిలో విడుదల చేయడం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమైనది.
2021-22 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించు జగనన్న విద్యా కానుక కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల విడుదల
జగనన్న విద్యా కానుక.ఒకటో తరగతి నుంచి టెన్త్ విద్యార్థులకు కిట్స్.2021-22 విద్యా సంవత్సరం ప్రారంభ రోజునే పంపిణీ. రూ 736 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం . వచ్చే విద్యా సంవత్సరం 2021-22 ప్రారంభ రోజున వివిధ ప్రాథమిక, మాధ్యమిక , ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే కిట్స్‌తో పాటు ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిక్షనరీని అందించనున్నారు.
2. అందుకోసం రూ 736 కోట్ల మేర నిధులను వెచ్చిస్తున్నారు. ఒక్కో కిట్‌లో మూడు జతల దుస్తులు., బెల్ట్, స్కూలు బ్యాగు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, రెండు జతల షూస్, రెండు జతల సాక్స్, బెల్టు, బ్యాగుంటాయి.
3. ఈ పర్యాయం ఉన్నత పాఠశాల చదువులు చదివే విద్యార్థులకు ఒక డిక్షనరీని కూడా అందించనున్నారు. కిట్స్ వస్తువులను కొనుగోలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, తగిన కాంట్రాక్టు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
4. కిట్స్‌ను ప్రభుత్వ, ఎంపీపీ, మునిసిపల్, రెసిడెన్షియల్, సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, ఎయిడెడ్, మోడల్ పాఠశాలల, కేజీవీవీ, రిజిస్టర్డు మదరసాస్ విద్యార్థులందరికీ పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
5. జగనన్న విద్యా కానుక పథకం కింద వీటి పంపిణీకి కిట్స్ వస్తువులను సేకరించాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది.
Public Services-A.P. Fundamental Rules – Extension of five (5) days additional casual leave facility to all the Women employees working in the State Government – Orders
మహిళా ఉద్యోగులు అందరికీ సంవత్సరానికి 5 రోజుల స్పెషల్ CL మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.పూర్తి వివరాలు.
ANDHRAPRADESH STATE LEAVE RULES WITH GO NUMBERS
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాద్యాయులకు కల్పించిన సెలవులు మరియు ఇతర బెనిఫిట్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం జీవోలతో సహా పోందుపరచడం జరిగింది.
ఏ అవసరాలకు ఎన్ని సెలవులు వాడుకోవాలి, వాటికి సంబంధించి జీతభత్యాలు ఏ విధంగా వస్తాయి వంటి పూర్తి వివరాలు క్రింద పైల్ లో కలవు.