రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,69,729 పాజిటివ్ కేసు లకు గాను 20,53,151 మంది డిశ్చార్జ్ కాగా14,438 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,140
AP COVID Latest health bulitten for daily cases
Compassinative appointment for the family members of employees who lost their lives with covid
ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కోవిడ్ 19 కారణంగా మృతిచెందినట్లయితే వారి కుటుంబ సభ్యులకు ఏ.పి గ్రామ - వార్డు సచివాలయాలలో ఉద్యోగాలు కల్పించాలని G.O.Rt.No.91 Dated: 18.01.2022 విడుదల.
ఐసీఎంఆర్ నూతన మార్గన దర్శకాలు..ఈ లక్షణాలు
కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కీలక మార్గదర్శకాలు జారీచేసింది. లక్షణాలు లేని వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దగ్గు, జ్వరం, గొంతులో సమస్య, రుచి, వాసన కోల్పోయినవారు మాత్రం తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టంచేసింది. దాంతోపాటు వయసు రీత్యా, అనారోగ్య సమస్యల పరంగా హై రిస్క్ కేటగిరీలోకి రాకపోతే.. కోవిడ్ క్లోజ్ కాంటాక్ట్స్‌కు కూడా పరీక్షలు అవసరం లేదని పేర్కొంది.
హోం ఐసోలేషన్ మార్గదర్శకాల ప్రకారం డిశ్చార్జి అయిన పేషెంట్లు, రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు... కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ ప్రకటించింది. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, మళ్లీ పరీక్ష చేయించాల్సిన అవసరం లేదని పేర్కొంది. నెగెటివ్ వచ్చినప్పటికీ కోవిడ్ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది.
Covid vaccine registration link for 5 to 18 years
5-18 సంవత్సరాల పిల్లలు నేటి నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్ కొరకు రిజిస్టర్ చేసుకోవచ్చు.
File No.ESE02-15/56/2021-EST 5-CSE Memo.No.ESE02-15/56/2021-EST 5-CSE Dt:29/10/2021 .Employment to the dependents of deceased Government employees who succumbed due to Covid-19 - Certain instructions - Communicated - Issued. Ref: Govt Circular Memo.No.1512950/Ser.A/2021, Dt:21.10.2021.
Covi తో మృతిచెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇచ్చేలా చూడాలని పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు.
While enclosing a copy of the Govt Circular in the reference read above, to all the Regional loint Directors of School Education and District Educational Officers in the state and they are requested to take necessary action accordingly.
Encis: As above
Chinaveerabhadrudu Vadrevu Director of School Education,
To
All the Regional Joint Directors in the state.
All the District Educational Officers in the state.
Signed by
Chinaveerathadrudu
Date: 29-10-2021 07:39:40 Reason: Approved
Employment to the dependents of deceased Government employees who Succumbed due to Covid -19-certain instructions issued
కోవిడ్ -19 కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు 30-11-2021 లోపు పూర్తి చేయాలని సూచనలతో ఉత్తర్వులు Circular Memo No.1512950/Ser.A/2021 Dated: 21.10.2021 విడుదల.
పాఠశాలల్లోనే టెస్టింగ్ కేంద్రాలు.కర్ఫ్యూ గంట కుదింపు.కోవిడ్ సమీక్షలో సిఎం
పాఠశాలల్లోనే కరోనా టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, అవసరమైన విద్యార్థులకు అక్కడే పరీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలు వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు పాటించేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూర౦ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు. కర్ఫ్యూ సమయాన్ని గంట కుదిస్తున్నట్లు చెప్పారు. ఇక నుండి రాత్రి 11 గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు. తెల్లవారుజామున పెళ్లిళు అంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, 150 మందికే అవకాశ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం వద్ద ఔషధ కంపెనీల రిజిస్ట్రేషన్ అంశాన్ని కూడా పరిశీలించాలని ఆదేశించారు. నిర్దేశించిన 90 రోజుల్లో ప్రభుత్వాస్పత్రులు, బోధానాస్పత్రుల్లో రిక్రూట్మెంట్పూ ర్తిచేయాలన్నారు.
స్కూళ్ల మూసివేతతో విపరిణామాలు.అవి విస్మరించలేనంత తీవ్రమైనవి.పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం.సాధ్యమైనంత త్వరగా పాఠశాలలు పునఃప్రారంభించాలి. పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక.రెండు షిఫ్టుల్లో క్లాసులు
పాఠశాలలు ఏడాదికిపైగా మూతపడడం వల్ల చదువులు ఆగిపోవడమే కాదు, దేశంలో బాల్య వివాహాల సంఖ్య కూడా పెరిగినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గుర్తించింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా స్కూళ్లను తెరిచే ఆలోచన చేయాలని ఉద్ఘాటించింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలల సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ వేగంగా పూర్తిచేసి, పాఠశాలలు తెరవొచ్చని సూచించింది. స్కూళ్లలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం వంటి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని వెల్లడించింది. తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి రెండు షిఫ్టుల్లో క్లాసులు నిర్వహించాలని తెలిపింది. పిల్లలను సెక్షన్లుగా విభజించి, రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించవచ్చని సూచించింది.
స్కూళ్లలో తరచుగా తనిఖీలు
విద్యార్థుల నుంచి హాజరు తీసుకొనేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్‌తోపాటు తరచుగా ఆర్‌టీ–పీసీఆర్ టెస్టులు నిర్వహించాలని స్థాయీ సంఘం కోరింది. ప్రతి పాఠశాలలో కనీసం రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేయాలని, పిల్లలకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వైద్య సాయం అందించడానికి శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. స్కూళ్లలో కోవిడ్–19 ప్రోటోకాల్స్ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం హెల్త్ ఇన్‌స్పెక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తరచుగా తనిఖీలు చేయాలని తెలిపింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పాఠశాలలను పునఃప్రారంభించారని, అక్కడ పాటిస్తున్న ఉత్తమమైన విధానాలను మన దేశంలోనూ అమలు చేయవచ్చని తెలియజేసింది.
కొవిడ్ రోగులంతా టీబీ పరీక్షలు చేయించుకోవాలి.కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు
కరోనా సోకిన రోగుల్లో కొంతమంది ట్యూబర్‌కులోసిస్(టీబీ) బారినపడుతున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ తరహా కేసులు నిత్యం డజన్ల కొద్దీ వెలుగుచూస్తుండటం వైద్యులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ బారినపడివారు టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అలాగే టీబీ రోగులు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచనలు చేసింది. అయితే కొవిడ్ కారణంగా టీబీ కేసులు పెరుగుతున్నాయడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక, కరోనా సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్‌తో బాధపడుతున్నారని గతంలో బ్రిటన్‌లో జరిగిన అధ్యయనంలో వెల్లడైన సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక కొవిడ్ బారిన పడ్డవారిలో దాదాపు 200లక్షణాలు ఉంటాయని గుర్తించారు. కనీసం ఆరు నెలల వరకు తీవ్రమైన ఇబ్బందులు రోగులను వెంటాడుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.
COVID fine 100 RS for not wearing mask
కోవిడ్ నియంత్రణ - పోలీసు చర్యలు - జరిమానా బహిరంగ స్థలాల్లో మాస్క్ ధరించకున్నా, కోవిడ్ నిబంధనలు ఉల్లఘించినా రూ. 100/- జరిమానా విధించే అధికారం SI, ఆపై అధికారులకు ఇస్తూ ఉత్తర్వులు
COVID Vaccine for All Govt and private Teachers in Ap before July 31
అందరు ఉపాధ్యాయులు కు 31.07.2021 లోపు కోవిడ్ వేక్సిన్ వేయాలని ఆరోగ్యశాఖ ఉత్తర్వులు. below 45years కూడా వేయించుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
◆గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపులు ఉంటాయని తెలిపింది.సాయంత్రం ఆరు గంటలకే దుకాణాలు మూసేయాలని ఆదేశించింది.
వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
◆మిగతా జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపులు ఉండనున్నాయి.
◆గోదావరి జిల్లాలు మినహా మిగతా చోట్ల రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసేయనున్నారు.
ఉభయ గోదావరిలో పాజిటివిటీ రేటు 5 శాతం లోపు వచ్చే వరకు అక్కడ ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.
◆ఈ సడలింపులు ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి.అదే విధంగా.. రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చింది.
◆అయితే, సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండాలని ఆంక్షలు విధించింది.
ఇక కోవిడ్ ప్రొటోకాల్స్‌తో రెస్టారెంట్లు, జిమ్స్, కల్యాణ మండపాలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం...శానిటైజర్, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పని సరి అని పునరుద్ఘాటించింది.
Curfew timings extended in 8 districts upto night 9pm
రాష్ట్రంలో 8 జిల్లాలో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు...
ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు కర్ఫ్యూ సడలింపు...
ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో యథావిధిగా ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు కర్ఫ్యూ ఆంక్షలుకొనసాగింపు.
కొవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో సడలింపు
8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు కర్ఫ్యూ సడలింపు
రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత
రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కొనసాగనున్న కర్ఫ్యూ
ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో సా. 6 గంటల వరకే సడలింపు
చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 వరకే సడలింపు.
జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6వరకూ కర్ఫ్యూ
ఈజిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున నిర్ణయం
జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తింపు
పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈజిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం
Andhrapradesh COVID 19 Health Buliten Daily Cases
10-7-2021 @10 am రాష్ట్రం లో ఈ రోజు నమోదైన పాజిటివ్ కేసులు :: 2925
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,17,283 పాజిటివ్ కేసు లకు గాను 18,75,035 మంది డిశ్చార్జ్ కాగా12,986 మంది మరణించారు.ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 29,262
Extension of curfew up to 30.06.2021 with modified timings from 6.00 PM to 6.00 AM with effect from 21.06.2021 in the State except East Godavari District - Continuation of existing curfew timings i.e. 2.00 PM to 6.00 AM in East Godavari District up to 30.06.2021
రాష్ట్రంలో 21.06.2021 నుండి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మార్పు చేసిన సమయాలతో 30.06.2021 వరకు కర్ఫ్యూ పొడిగింపు
ఏపీ లో రాష్ట్రంలో కర్ఫ్యూ వేళల సడలింపు
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ వేళలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది.
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈనెల 21 నుంచి కర్ఫ్యూ సడలింపు అమలులోకి రానుందని తెలిపింది. జూన్ 30వరకు అమలులో ఉండనుందని ప్రభుత్వం వివరించింది.
సాయంత్రం 5గంటలకల్లా దుకాణాలు మూసివేయాలని ప్రజలకు సూచించింది.
సాయంత్రం 6 నుంచి మర్నాడు ఉదయం 6వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
Extension of Curfew in ap
రాష్ట్రంలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.రేపటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది.
శుక్రవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది.
నిత్యం మధ్యాహ్నం 2 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ వేళల్లో నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
Krishnapatnam ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( సీసీఆర్‌ఏఎస్) కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
పంపిణీ వద్దకు కొవిడ్ రోగులు వెళ్లొద్దు.
కంట్లో వేసే డ్రాప్స్‌కు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. అవి రావడానికి 2- 3 వారాలు సమయం పడుతుందని వివరించింది. కె అనే మందును కమిటీ ముందు ప్రదర్శించనందున సీసీఆర్‌ఏఎస్ దీనికి నిరాకరించింది. ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనడానికి నిర్ధారణలు లేవని నివేదికలు తేల్చాయి.
ఈ మందు వాడినంత మాత్రాన మిగతా మందులు వాడకుండా ఉండొద్దని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఆనందయ్య ఇచ్చే పి,ఎల్,ఎఫ్ మందులు వాడొచ్చని స్పష్టం చేసింది. ఆనందయ్య ఔషధం కోసం పంపిణీ కేంద్రం వద్దకు కొవిడ్ రోగులు వెళ్లొద్దని.. వారి బంధువులే వెళ్లాలని సూచించింది. మందు పంపిణీ వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఏపీలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్‌కు 17 ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని నిర్ణయం
దీనికి చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగా చికిత్స అందించేందుకు ఉత్తర్వులు జారీ.ఆ ఆస్పత్రుల జాబితా ఇదే.
★ 1. జీజీహెచ్ అనంతపురం (ప్రభుత్వ వైద్య కళాశాల)
★ 2. ఎస్వీఆర్‌ఆర్‌జీజీహెచ్, తిరుపతి
★ 3. స్విమ్స్, తిరుపతి
★ 4. జీజీహెచ్, కాకినాడ (రంగరాయ మెడికల్ కళాశాల)
★ 5. జీజీహెచ్ గుంటూరు (ప్రభుత్వ వైద్య కళాశాల)
★ 6. జీజీహెచ్ (రిమ్స్) కడప
★ 7. జీజీహెచ్, విజయవాడ
★ 8. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు
★ 9.జీజీహెచ్, కర్నూలు
★ 10. జీజీహెచ్ (రిమ్స్) ఒంగోలు
★ 11. జీజీహెచ్, నెల్లూరు (ఎసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల)
★ 12. జీజీహెచ్ శ్రీకాకుళం (ప్రభుత్వ వైద్య కళాశాల)
★ 13. ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి, విశాఖపట్నం
★ 14. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విశాఖపట్నం
★ 15. ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆస్పత్రి (ఆంధ్రా వైద్య కళాశాల)
★ 16. కేజీహెచ్, విశాఖపట్నం
★ 17. విమ్స్, విశాఖపట్నం