APTF VIZAG: Govt
Showing posts with label Govt. Show all posts
Showing posts with label Govt. Show all posts

ఇక నుంచి ప్రభుత్వ GO లు ఆఫ్ లైన్ లొనే ఆన్లైన్ లో పెట్టకూడదు అని ప్రభుత్వం నిర్ణయం.

ప్రభుత్వ ఉత్తర్వులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో ఉంచకూడదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సమాచారం ఇస్తూ మెమో జారీ చేసింది. ఇకపై ఆఫ్‌లైన్‌లో మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటాయని సాధారణ పరిపాలన శాఖ  స్పష్టం చేసింది. ఇటీవల బ్లాంక్‌ జీవోల జారీ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  కాగా, 2002 నుంచి జీవోలను ఆన్‌లైన్‌ ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఉంచుతోంది.

Ap Cabinet Meeing Decissions

✫ఆగస్టు లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు 

 ✫జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్‌ ప్లస్ ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చ 

✫ఈ నెల 10న అమలు చేయనున్న 'వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం' పథకంపై చర్చ

 ✫పోలవరం నిర్వాసితుల ఆర్‌అండ్ఆర్‌ చెల్లింపులను కేబినెట్‌ ఆమోదించనుంది. రూ.10లక్షల పరిహారం చెల్లింపునకు రూ.550 కోట్ల విడుదల

✫అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పానికి కేబినెట్ ఆమోదం 

ధార్మిక పరిషత్ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటుపై చట్ట సవరణకు ఆమోదం తెలపనున్న కేబినెట్ ఆమోదం తెలపనుంది. 

✫రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి పాలసీని కేబినెట్ ఆమోదించనుంది. 

➪ మచిలీపట్నం, భావనపాడు పోర్టుల రివైజ్డ్‌ అంచనాలను ఆమోదించనున్న కేబినెట్

 ➪ బడగట్లపాలెం, పూడిమడక, ఓడలేరు, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మంత్రి వర్గం ఆమోదం

 ➪ లోకాయుక్త కర్నూల్‌కు తరలించే ప్రతిపాదనకు, హెచ్‌ఆర్‌సీ కార్యాలయం కర్నూలులో ఏర్పాటుకు  కేబినెట్ ఆమోదం.

ఒక కిలోమీటర్ దూరంలోపే ఫౌండేషన్ స్కూళ్లు.3 కిలోమీటర్ల దూరంలోపే హైస్కూల్ ప్రీప్రైమరీ , ప్రైమరీలో ఉత్తమ బోధన లక్ష్యాలు అందుకే ఫౌండేషన్ స్కూళ్లు : సీఎం జగన్

పిల్లల్లో ఆరేళ్ల వయ సులోపే 80 శాతం మేధో వికాసం చెందుతుంది . అందుకే ఈ ఆలోచన . నిరుపేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించాలని నా తపన , ఆరాటం . ఆ ఆలోచనల నుంచి పుట్టు కొచ్చినవే ఈ వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లు , ఫౌండేషన్ స్కూళ్లు . ఇది కాకుండా ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లలో 11 , 12 తరగతులను పెట్టడమా ? లేక మండలానికి ఒక జూనియర్ కాలేజీ పెట్టాలా ? అన్నదానిపై పూర్తిస్థాయి పరిశీలన చేయండి .

ఈనిర్ణయం వల్ల 11 , 12 తరగతులకు ప్రభుత్వ రంగంలోనే మంచి విద్య అందించే అవ కాశం ఉంటుంది ' అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు . ప్రీప్రైమరీ , ప్రైమరీ విద్యాబోధనపై విద్యాశాఖ , మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో గురువారం సీఎం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు . ఇప్పుడు ఏర్పాటు చేయదలచిన ఫౌండేషన్ స్కూళ్లు అన్నీ పిల్లలకు ఒక కిలోమీటర్ దూరంలోపే ఉండాలి . అలాగే అన్ని హైస్కూళ్లు ( 8 వ తరగతి నుంచి 10 లేదా 12 వ తరగతి ) 3 కిలోమీటర్ల దూరం లోపు ఉండాలి . వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లు పిల్లలకు చాలా దగ్గరగా ఉండాలి . టీచర్లలోని బోధనా సామర్థ్యాన్ని మరింత వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలి . తద్వారా పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించవచ్చు ' అని సీఎం పేర్కొన్నారు . డిజిటల్ బోధన ప్రక్రియపై దృష్టి పెట్టండి . మనం బ్లాక్ బోర్డు నుంచి గ్రీన్ బోర్డులకు మారాం . ఇక ముందు డిజిటల్ బోర్డులకు వెళ్లే పరిస్థితి వస్తుంది . డిజిటల్ బోర్డులు దీర్ఘకాలం మన్నికగా ఉండేలా చూసుకోండి ' అని సీఎం జగన్ నిర్దేశించారు

AP Budget 2021: ఏపీ బడ్జెట్‌ హైలైట్స్‌ ఇవే.2021-22 రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లు


బీసీ సబ్‌ ప్లాన్‌కి రూ.28,237 కోట్లు

కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు

ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు

బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు

ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు

ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు

మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు

చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు

మహిళల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు

వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు

విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు

వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.17 వేల కోట్లు

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కోసం రూ.3,845 కోట్లు

జగనన్న విద్యా దీవెనకు రూ.2,500 కోట్లు

జగనన్న వసతి దీవెన కోసం రూ.2,223.15 కోట్లు

వైఎస్‌ఆర్‌-పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1802 కోట్లు

డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు

పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు

రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు

వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు

వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు

వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు

మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు

అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు

రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు

లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు

ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు

అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు

వైఎస్‌ఆర్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు

రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు

వైఎస్‌ఆర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు

వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు

వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు

వైఎస్‌ఆర్‌ పశువుల నష్టపరిహారానికి రూ.50 కోట్లు

విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు

స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు

జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు

జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు

ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు

ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు

ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు

ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు

Ap Cabinet Decissions

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే!

బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ, సహా ప్రైవేటు వాహనాల రాకపోకలపై నిషేధం. అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు, దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల సేవలు కూడా రద్దు.

ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి ఆక్సిజన్‌ రప్పించేందుకు చర్యలు.

బీసీల రిజర్వేషన్లు మరో పదేళ్లు పెంపు.

ఈనెల 13న రైతు భరోసా తొలి విడత జమ. 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4వేల 40 కోట్లు జమ. మే 25న 38లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,805 కోట్లు జమ.

వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద కుటుంబానికి రూ.10వేలు పరిహారం. 2021 మే 18న మరో 1లక్షా 460మందికి అందజేత.

రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేశాం. గత ప్రభుత్వ బకాయిలు పెట్టిన ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందజేత.

ప్రభుత్వ పాఠశాలల్లో 7వ నుంచి సీబీఎస్‌ఈ ద్వారా విద్యా బోధన. 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలో చదువుకుని, పరీక్ష రాస్తారు. రాష్ట్రంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం అమలు.

2018-19 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 52,23,000 విద్యార్థులు ఉంటే, 2020-21 సంవత్సరానికి ఆ సంఖ్య 59,30,000 చేరింది.

నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.

 ఏపీలో మూసేసిన సహకార డెయిరీలను అమూల్‌కు లీజుకిస్తున్నాం. మొత్తం  708 గ్రామాల్లో అమూల్‌ సేవలు

అర్చకులకు రూ.10వేల నుంచి రూ.15వేల గౌరవ వేతనం పెంపు. బి కేటగిరి ఆలయాల్లో రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం

ఇమామ్‌లకు రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం పెంపు. మౌజమ్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేల గౌరవ వేతనం

ఏపీలో రేపటి నుంచి ఆటోలు, సిటీ బస్సులూ 12 వరకే- ఆ తర్వాత తిరిగితే సీజ్‌

ఏపీలో కరోనా కేసుల విజృంభణ దృష్ట్యా రాకపోకల నియంత్రణకు రేపటి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచేందుకు అనుమతిస్తామని  ప్రకటించింది. దీంతో పాటు ప్రజా రవాణాపైనా ఆంక్షలు విధించనున్నారు.

ఏపీలో కరోనా కేసుల కల్లోలం దృష్ట్యా రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజా రవాణాను కూడా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ఆటోలను సీజ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీటితో పాటు సిటీ బస్సుల రాకపోకలను కూడా నియంత్రించేందుకు వీలుగా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. నిర్ణీత సమయాలను మించి రాకపోకల్ని నియంత్రించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మద్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవల వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతించనున్నారు. ఉదయం షాపులు తెరిచే సమయంలోనే ప్రజా రవాణాకు కూడా అనుమతించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ సమయంలోనూ 144 సెక్షన్‌ అమలు చేయబోతోంది. అంటే గుంపులు గుంపులుగా షాపింగ్‌లు చేయడం, ప్రయాణాలు చేయడాన్ని నిషేధిస్తున్నారు. రేపటి నుంచి మొదలయ్యే ఈ ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Featured post

Ap open school 10th Class and intermediate results