APTF VIZAG: SSC
Showing posts with label SSC. Show all posts
Showing posts with label SSC. Show all posts

AP 10th class public exams result released today

పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలను 11 గం లకు విడుదల చేయడం జరుగుతుంది. కింది వెబ్సైట్ ద్వారా వేగంగా ఫలితాలను చూసుకోవచ్చు.

పదో తరగతి పరీక్ష ఫలితాలను కింది వెబ్సైట్ ద్వారా చూడవచ్చు.

 https://results.bse.ap.gov.in/

https://results.eenadu.net/ap-tenth-2024/ap-10th-ssc-results-2024.aspx

www.eenadu.net

www.Eenadupratibha.net/

 www.sakshieducation.com/

AP Open School Society Intermediate examinations are scheduled from 18.04.2024 to 27.03.2024. Hall Tickets are Now available for downloading using link given below.

 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. 

ఈ పరీక్షలు మార్చి 18 నుంచి 27వ తేదీ వరకు జరుగ నున్నాయి. ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రయోగ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించ నున్నారు.


1) ఎ.పి ఓపెన్ స్కూల్ 10th పరీక్షల హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్:

http://portal.apopenschool.org/APOSSHT/SiteContent/HALLTICKETSSC


2) ఎ.పి ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్

AP Open Inter 2024 Practical Hall Ticket

 http://portal.apopenschool.org/APOSSHT/SiteContent/HALLTICKETSINTERPRAC


AP Open Inter 2024 Hall Tickets 

http://portal.apopenschool.org/APOSSHT/SiteContent/HALLTICKETSINTERTH

The SSC Advanced Supplementary Examinations, 2023 are scheduled to be conducted from 02-06-2023 to 10-06-2023 INSTRUCTIONS ON RECOUNTING & REVERIFICATION

 రీకౌంటింగ్ & రివెరిఫికేషన్ పై సూచనలు:

తమ జవాబు పత్రాల "రికౌంటింగ్" కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 13.05.2023న లేదా అంతకు ముందు CFMS సిటిజన్ చలాన్ (www.cfms.ap.gov.in) ద్వారా ఒక్కో సబ్జెక్టుకు రూ.500/- మొత్తాన్ని చెల్లించాలి.

Click Here press note

Click Here To Download re verification application

Click Here To Download re counting application 

b. జవాబు పత్రాల ఫోటోకాపీ యొక్క పునః ధృవీకరణ (Re Verification) మరియు సరఫరా" కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్ధులు CFMS సిటిజన్ చలాన్ (www.cfms.ap.gov.in) ద్వారా ప్రతి సబ్జెక్టుకు రూ.1000/మొత్తాన్ని 13-05-2023న లేదా అంతకు ముందు చెల్లించాలి.


C. ఒక నిర్దిష్ట సబ్జెక్ట్ యొక్క "రివెరిఫికేషన్ కమ్ సప్లై ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్" కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆ సబ్జెక్ట్ యొక్క "రీకౌంటింగ్" కోసం దరఖాస్తు చేయనవసరం లేదు.


d. నగదు, డిమాండ్ డ్రాఫ్ట్ లు వంటి మరే ఇతర పద్ధతి లో చేసిన చెల్లింపులు ఆమోదించబడవు. CFMS సిటిజన్ చలాన్లు మాత్రమే ఆమోదించబడతాయి. ప్రతి అభ్యర్థికి ప్రత్యేక చలాన్ తీసుకోవలసి ఉంటుంది.


e. CFMS చలాన్ ద్వారా అవసరమైన రుసుమును చెల్లించిన అభ్యర్థులు ఈ క్రింది పత్రాలను జిల్లా విద్యా అధికారి యొక్క సంబంధిత జిల్లా కార్యాలయంలో సమర్పించాలి.


i. అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉన్న పూర్తిగా పూరించి, సంతకం చేసిన రీ-వెరిఫికేషన్/ రీకౌంటింగ్ దరఖాస్తు ను సంబంధిత జిల్లా లోని DEO గారి కార్యలయము లోని కౌంటర్లో సమర్పించాలి. రీ-వెరిఫికేషన్/ రీకౌంటింగ్ దరఖాస్తు కౌంటర్లో కూడా అందుబాటులో ఉంటుంది.


ii. సంబంధిత HM ద్వారా తగిన విధంగా కౌంటర్ సంతకం చేసిన హాల్ టిక్కెట్ ఫోటోకాపీ.


iii. అభ్యర్థి పేరుపై పొందిన అవసరమైన మొత్తానికి CFMS సిటిజన్ చలాన్.


f. పైన పేర్కొన్న పత్రాలతో పాటు పూరించిన దరఖాస్తు ఫారాలు ఆయా జిల్లాల్లోని O/o DEOల వద్ద మాత్రమే నియమించబడిన కౌంటర్లలో మాత్రమే సమర్పించాలి.


g. O/o DGE, A.P (బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, A.P.)కి పోస్ట్ ద్వారా పంపిన దరఖాస్తులు అంగీకరించ బడవు.


h. మార్కులలో ఏదైనా సవరణలు ఉన్నపుడు మాత్రమే సవరించిన మార్కుల జాబితా జారీచేయబడుతుంది.

AP SSC Apr 2023 public Exams Hall Tickets Student wise and School Wise Released

 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు ఎలాంటి పాస్వర్డ్ లేకుండా జిల్లా, స్కూలు సెలెక్ట్ చేసుకుని Individual హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

https://bse.ap.gov.in/APSSCHTTHREE/HallTicketsSel.aspx

 https://www.bse.ap.gov.in/


SSC PUBLIC EXAMINATIONS - 2023 SUBJECT WISE MODEL QUESTION PAPERS & BLUE PRINTS

2022-23 విద్యా సంవత్సరం కి 10వ తరగతి పరీక్షల్లో 6 పేపర్లు. ఈ పేపర్ల కి సంబంధించిన బ్లూ ప్రింట్, మోడల్ ప్రశ్న పత్రాలు, ప్రశ్నలు వారిగా వెయిటేజ్ టేబుల్ ఈ క్రింది లింకు లో అందుబాటులో కలవు.

https://www.bse.ap.gov.in/SUBJECT_WISE_MODEL_PAPER_2023.htm

SSC Advanced supplamentary Exams 2022 Results Released

పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం జరిగింది. క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను పొందవచ్చు.



Ap Tenth class exams Marks memos Released

వెబ్‌సైటులో టెన్త్ మార్క్స్ మెమోలు ను అందుబాటులో ఉంచడం జరిగింది. https://bse.ap.gov.in/RESULTSTWT/

10th Class Public Examinations latest time table.

10 వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్.ఏప్రిల్ 27 నుండి మే 9 వరకు పదవ తరగతి పరీక్షలు. 

పరీక్షల షెడ్యూల్ విడుదల

AP: మారిన షెడ్యూల్ ప్రకారం పదోతరగతి పరీక్షల తేదీలను సెకండరీ బోర్డు విడుదల చేసింది. ఏప్రిల్ 27 నుంచి మే9 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఏప్రిల్ 27- తెలుగు, ఏప్రిల్ 28- సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 29- ఇంగ్లిష్, మే 2- గణితం. మే 4 సైన్స్ పేపర్ 1, మే 5- సైన్స్ పేపర్-2, మే 6న సాంఘిక శాస్త్రం.

Circular.No.ESE02/206/2022-SCERT,Dated:08/03/2022 SSC Public Examinatiof ns, May 2022 – Certain guidelines

SSC Public Examinations, May 2022 - Certain guidelines issued : పదో తరగతి పరీక్షలు - 2022 నిర్వహణకై పలు సూచనలు జారీ చేసిన విద్యా శాఖ.
Click Here To Download proceedings
a. Preparing the 10th class students for exams
b. Revision and remedial classes for slow learners:
c. Do's and Dont’s (Teachers)
d. Tips for last-minute preparation (Students)

AP 10th class and intermediate exam shedule

Andhra Pradesh  టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు.మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ గురువారం విడుదలైంది. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూలను మంత్రులు ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు.

ఇంటర్మీడియట్ పరిక్షల షెడ్యూల్‌:

మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరిక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరిక్షలు జరుగుతాయని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరిక్షలు రాయనున్నారని తెలిపారు.

పదో తరగతి పరిక్షల షెడ్యూల్‌:

టెన్త్‌ పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. 2022 సంవత్సరం మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరిక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరిక్షలు రాయనున్నారని తెలిపారు.

SSC Public Examinations - April 2022 Exemptions and Concessions to the Children with Special needs

SSC పబ్లిక్ పరీక్షలు - ఏప్రిల్ 2022 ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మినహాయింపులు మరియు రాయితీలు

AP SSC Class 10 Public Exams 2022 Blue Prints & Model Question Papers for 100 Marks All Subjects TM & EM by BSE AP

10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2022 కొరకు APSCERT వారు అన్ని సబ్జెక్ట్ లు, పేపర్స్ యెక్క బ్లూప్రింట్స్ మరియు మోడల్ పేపర్స్ ను విడుదల చేయటం జరిగింది. మీకు కావలసిన పేపర్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

PUBLIC EXAMINATIONS - 2022

SUBJECT WISE MODEL QUESTION PAPERS & BLUE PRINTS
S.NoSUBJECTSPAPER CODESDOWNLOAD
11ST LANGUAGE (TELUGU)01T & 02TCLICK HERE
21ST LANGUAGE (COMPOSITE TELUGU)03TCLICK HERE
32ND LANGUAGE ( HINDI)09HCLICK HERE
42ND LANGUAGE ( ENGLISH)11ECLICK HERE
53RD LANGUAGE ( ENGLISH)13E & 14ECLICK HERE
6MATHEMATICS (ENGLISH - MEDIUM)15E & 16ECLICK HERE
7MATHEMATICS (TELUGU - MEDIUM)15T & 16ECLICK HERE
8PHY SCIENCE (ENGLISH - MEDIUM)19ECLICK HERE
9PHY SCIENCE (TELUGU - MEDIUM)19TCLICK HERE
10BIO SCIENCE (ENGLISH - MEDIUM)20ECLICK HERE
11BIO SCIENCE (TELUGU - MEDIUM)20TCLICK HERE
12SOCIAL (ENGLISH - MEDIUM)21E & 22ECLICK HERE
13SOCIAL (TELUGU - MEDIUM)21T & 22TCLICK HERE

AP 10th class exams 7 papers

ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి పత్రికా ప్రకటన (2021-22కు సంబంధించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు..7 పేపర్ల గురించి


"

SSC PUBLIC EXAMINATIONS - 2022

SUBJECT WISE MODEL QUESTION PAPERS & BLUE PRINTS

S.No SUBJECTS PAPER CODES DOWNLOAD

1 1ST LANGUAGE (TELUGU) 01T & 02T CLICK HERE

2 1ST LANGUAGE (COMPOSITE TELUGU) 03T CLICK HERE

3 2ND LANGUAGE ( HINDI) 09H CLICK HERE

4 2ND LANGUAGE ( ENGLISH) 11E CLICK HERE

5 3RD LANGUAGE ( ENGLISH) 13E & 14E CLICK HERE

6 MATHEMATICS (ENGLISH - MEDIUM) 15E & 16E CLICK HERE

7 MATHEMATICS (TELUGU - MEDIUM) 15T & 16E CLICK HERE

8 PHY SCIENCE (ENGLISH - MEDIUM) 19E CLICK HERE

9 PHY SCIENCE (TELUGU - MEDIUM) 19T CLICK HERE

10 BIO SCIENCE (ENGLISH - MEDIUM) 20E CLICK HERE

11 BIO SCIENCE (TELUGU - MEDIUM) 20T CLICK HERE

12 SOCIAL (ENGLISH - MEDIUM) 21E & 22E CLICK HERE

13 SOCIAL (TELUGU - MEDIUM) 21T & 22T CLICK HERE

GO 55, for awarding of marks to class 10 students from March 2020 onwards. ఇకపై 10వ తరగతి లో గ్రేడ్ లకు బదులు మార్కులే.

పదో తరగతిలో మళ్లీ మార్కులు.గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్ల తొలగింపు .గతేడాది నుంచి అమలు.ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల కోసం ప్రస్తుత విధానం రద్దు

పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకొస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో తీసుకొచ్చిన గ్రేడింగ్‌ విధానానికి స్వస్తి పలికారు. ప్రవేశాలు, నియామకాల్లో ప్రతిభను గుర్తించేందుకు గతేడాది నుంచి మార్కులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎక్కువమంది విద్యార్థులకు ఒకే గ్రేడ్‌ వచ్చినప్పుడు ప్రవేశాలు, నియామకాల్లో సమస్యలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాలని సంచాలకులు ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించారు. 2019 మార్చి వరకు విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఇస్తారు. 2020 మార్చి నుంచి మార్కులు కేటాయిస్తారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలను నిర్వహించలేదు.

ఇంటర్‌ ప్రవేశాల కోసమే.
ఈ ఏడాది ఇంటర్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఉన్నందున సీట్ల కేటాయింపు కష్టంగా మారింది. అంతర్గతంగా ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి మార్కులను తీసుకొని, ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించాలని మొదట భావించారు. విద్యార్థులకు మార్కులు ఇవ్వకుండా ఇంటర్‌ విద్యామండలికి ఇస్తే న్యాయ వివాదాలు వస్తాయని పరీక్షల విభాగం వెల్లడించింది. దీంతో ప్రభుత్వం గ్రేడింగ్‌ వ్యవస్థనే రద్దుచేసింది. దాని స్థానంలో మార్కుల విధానాన్ని తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా విద్యార్థులో ఒత్తిడి తగ్గించేందుకు, ఆత్మహత్యల నివారణకు గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేశారు. 10 మార్కుల వ్యత్యాసం ఉన్నా విద్యార్థులకు ఒకే గ్రేడ్‌ వస్తుంది.

10th Class Results No need to provide DOB in this link to know the result. Total school students details can be obtained

10 వ తరగతి ఫలితాలను పుట్టిన తేది లేకుండా మొత్తం పాఠశాల లో ఉన్న విద్యార్థుల అందరి యొక్క ఫలితాలను జిల్లా, మండలం, పాఠశాల వివరాలు ఇచ్చి రిజల్ట్స్  డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

Click Here To Get Total School Results మీ పాఠశాల మొత్తం పిల్లల రిజల్ట్స్ కి ఇక్కడ నోక్కండి.


SSC All Students pass &Awarding Grades Criteria Declaration G.O No 46 St 2.8.2021 High lights .

SSC public Exams 2020   లో Grades Award చేయుటకు  SA1 లో మార్కులు 50 కు ,3FA లలో కలిపి మొత్తము మార్కుల 50 కు పరిగణన లోకి తీసుకొని మొత్తము  100 కు ఎన్ని మార్కులు వచ్చిన వో దానిని బట్టి గ్రేఢులు నిర్ణయిస్తారు

SSC Public Exams 2021 లో గ్రేడులు:

 రెండు FA లలో Slip test (20Marks) లో 70%, CCE Marks for Other components(10+10+10) లో 30% మార్కులను కలిపి మొత్తము 100 మార్కులకు పొందిన మార్కుల ఆధారంగా గ్రేడులు ఇస్తారు

No fail .Last Grade ఇవ్వబడును

FA లు వ్రాయని వారికి,లేక ఆ మార్కులు Online చేయని Students కు Last grade ఇచ్చి Pass చేస్తారు

 2020 కు ముందు SSC చదివి 2017,2018,2019  పరీక్షల్లో కొన్ని Subjects Fail అయిన వారికి ఆ Subjects లో Internal marks   ను బట్టి లేక 20 అంతర్గత  మార్కులకు  ఎన్ని వచ్చినా వో వాటిని 5 చే గుణించి 100 కు వచ్చిన మార్కులను బట్టి గ్రేడులు లేక  Last grade  ఇస్తారు.

10 వ తరగతి గ్రేడ్లు పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఫార్మాటివ్ మార్కులే ప్రాతిపదిక గా ఛాయారతన్ కమిటీ నివేదిక!

ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు చివరి క్షణం రద్దు చేయక తప్పలేదు. 

అయితే విద్యార్ధులకు భవిష్యత్తులో  నష్టం కలగకుండా పాస్ మార్కులు వేసే విషయంలో ఏం చేయాలన్న దానిపై ఛాయారతన్ కమిటీని నియమించింది. 

ఆ కమిటీ అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్దం చేసింది.

ఏపీలో పదో తరగతి విద్యార్ధులకు వారు ఈ విద్యాసంవత్సరంలో సాధించిన ఫార్మాటివ్ అసెస్మెంట్ ( ఇంటర్నల్ మార్కులు) ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తోంది. 

పరీక్షలు రద్దు కావడంతో ఎవరూ నష్టపోకుండా విద్యార్ధులు ఈ ఏడాది సాధించిన ఇంటర్నల్ మార్కుల్లో సగటు తీసి దాని ఆధారంగా గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 

అంటే రెండు ఫార్మాటివ్ అసెస్ మెంట్లలో సాధించిన మార్కుల్ని సగటు తీసి ఆ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ప్రకటిస్తారు. 

గ్రేడ్లు ప్రకటించిన తర్వాత రెండు, మూడు రోజుల్లో స్కూళ్ల నుంచి మార్కు మెమోల్ని తీసుకునే అవకాశం కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే ప్రకటించారు.

ఈ ఏడాదితో పాటు గత విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రద్దయినా వారికీ గ్రేడింగ్ ఇవ్వలేదు. మార్కులూ ప్రకటించలేదు. 

దీంతో ఛాయారతన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 2019-20 విద్య సంవత్సరం పదో తరగతి చదివిన విద్యార్ధులకు కూడా గ్రేడ్లు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. 

పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం గ్రేడ్లు ప్రకటించకపోవండతో ఇప్పటికే అప్పటి విద్యార్ధులు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ ప్రక్రియను త్వరలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

టెన్త్, ఇంటర్ ఫలితాలకు హైపవర్ కమిటీలు

రాష్ట్రంలో కోవిడ్ కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఫలితాలు ప్రకటించడంపై అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించడానికి విశ్రాంత ఐఏఎస్ అధికారిణి ఎం.ఛాయారతన్ చైర్పర్సన్ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులిచ్చింది. ఈ కమిటీకి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి, ప్రకాశం జిల్లా డీఈవో సుబ్బారావు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు కమిటీలో మరో ఆరుగురు నిపుణులను నియమించారు. ఈ మేరకు విద్యా శాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు ఉత్తర్వులిచ్చా రు. ఈ కమిటీ పది పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏయే మార్కులను పరిగణనలోకి తీసుకోవాలో ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. కాగా.. ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలకు అనుసరించాల్సిన విధివిధానాలు నిర్ణయించడానికి ఛాయారతన్ నేతృత్వంలోనే మరో హైపవర్ కమిటీని కూడా విద్యాశాఖ నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.

సుప్రీం కోర్టు లో ఏపి 10th ఇంటర్ ఎగ్జామ్స్ కేసు:విచారణ రేపటికి వాయిదా.పూర్తి సమాచారంతో మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీం కోర్టు

ఇంటర్‌పరీక్షలను జులైలో నిర్వహించేందుకు అనుమతివ్వాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని, సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది. ఒక్కరు చనిపోయినా.. ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. మన నిర్ణయాలు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. జులై చివరిలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కానీ నిర్ధిష్టమైన తేదీని చెప్పలేదని పేర్కొంది. 15 రోజుల ముందుగా టైం టేబుల్‌ ఇస్తే.. .ఆ సమయం సరిపోతుందని ఎలా చెప్తారని ప్రశ్నించింది. ‘‘ పరీక్షల నిర్వహణకు సహకరించే ఇతర సిబ్బందికి సంబంధించిన వివరాలేవీ ఇవ్వలేదు. ప్రభుత్వమే అన్ని రకాల లాజిస్టిక్‌ వసతులు కల్పించాలి. విద్యార్థులకే కాదు.. సిబ్బందికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది’’ అని సుప్రీం వ్యాఖ్యానించింది.

సరైన గాలి, వెలుతురు ఉండే పరీక్షలు నిర్వహించే గదుల వివరాలేవీ అఫిడవిట్‌లో లేవని చెప్పింది. ఏపీ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం  సుమారు 28వేల గదులు అవసరం అవుతాయని అభిప్రాయపడింది.

Ap govt file affidavit in SC for conducting exams

పరీక్షలపై సుప్రీంలో ఏపీ అఫిడవిట్: పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపర్చిన ప్రభుత్వం, రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది.

Featured post

Ap open school 10th Class and intermediate results