APTF VIZAG: Pan
Showing posts with label Pan. Show all posts
Showing posts with label Pan. Show all posts

How to link PANCARD NO WITH ADHAR CARD WITH complete details

ఆదాయ పన్ను చెల్లించే వారందరూ కూడా  తమ యొక్కPAN  నెంబర్ తో ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవాలి. మన యొక్క PAN నెంబర్ తో ఆదార్ నెంబర్ లింక్ చేసుకోవడానికి మనకు కావలసిన సమాచారం PAN నెంబర్ ,ఆధార్ నెంబర్, ఆధార్ కార్డులో ఉన్న పేరు, CAPCHA కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ Submit చేయబడతాయి.

ఆధార్ తో పాన్ నెంబర్ ను లింక్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
Click here to link your Pan Card with Aadhar 
ఆధార్ తో పాన్ నెంబర్ ను లింక్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
Click here to Check status of PAN AND ADHAR

Check your PAN and AADHAR link status by using below link

మీ పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా అనే స్టేటస్ ను క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్ కార్డు లింక్ చేయకపోతే  ఈనెల 31 లోపు మీ పాన్ కార్డు తో ఆధార్ కార్డు లింక్ చేసుకోగలరు.

pan and aadhar link last date 31.03.2023

https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status

Download Your E pan Card by using given direction

Pan card: మీ పాన్ కార్డు పోయిందా?అయితే క్రింది ఇచ్చిన సూచనలు పాటించి E Pan Card ని పొందవచ్చు.

అయితే అనుకోకుండా పాన్ కార్డ్‌ను పోగొట్టుకుంటే ఎలా? నంబర్‌ కూడా గుర్తు లేకపోతే ఏం చేయాలి? దీనికి పరిష్కారమే ఇ-పాన్‌. పాన్‌ కార్డు పోయినప్పుడు ప్రత్యామ్నాయంగా దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది ఆదాయపు శాఖ విభాగం. ఐటీ శాఖ వెబ్‌సైట్‌లో లాగిన్‌తో దీన్ని పొందొచ్చు. పాన్ కార్డ్ సంఖ్య గుర్తు లేక‌పోయినా ఇది వరకే ఆధార్‌తో అనుసంధానం చేసి ఉంటే ఇట్టే ఇ-పాన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Click Here To Download Your E-Pan Card

పాన్ నంబర్ లేకుండా ఇ-పాన్ కార్డు డౌన్‌లోడ్ ఎలా?
కొత్త‌ ఆదాయపు పన్ను పోర్టల్ నుంచి తక్షణ ఇ-పాన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మొదట పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి.
ఎడమవైపు దిగువ భాగంలో ఉన్న 'Our Services' వద్ద క్లిక్ చేయండి.
అక్క‌డ‌ Instant E PAN క్లిక్ చేయండి.
'New E PAN' వద్ద క్లిక్ చేయండి.
మీరు కోల్పోయిన పాన్ కార్డ్ నంబర్ మీకు గుర్తులేనందున ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేయండి.
నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదివాక 'Accept' బటన్ క్లిక్ చేయండి
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయండి.
వివరాలను జాగ్రత్తగా చెక్‌ చేయండి. మీ ఇ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి 'Confirm' క్లిక్ చేయండి.
మీ ఇ-మెయిల్ ఐడీకి ఇ-పాన్ వ‌స్తుంది. అక్క‌డ‌ ఇ-పాన్ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Featured post

Ap open school 10th Class and intermediate results