APTF VIZAG: కరోనా పరిస్థితిపై సీఎం జగన్‌ సమీక్ష:

కరోనా పరిస్థితిపై సీఎం జగన్‌ సమీక్ష:

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించకుండానే కరోనాకట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సీఎం జగన్‌ అధికారులతో సమీక్షించారు. అందరికీ కొవిడ్‌ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. లక్షణాలు ఉన్న అందరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని సూచించారు.

రాష్ట్రంలో అర్బన్‌ ప్రాంతాల్లో 62శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం కొవిడ్‌ కేసులు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా మరణాలు నమోదవుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆలస్యంగా ఆసుత్రులను ఆశ్రయించడమే మరణాలకు కారణంగా గుర్తించారు.

వాలంటీర్‌, ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలతో ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇంటింటి సర్వే చేయడంపై కసరత్తు చేయాలన్నారు. సీసీటీవీల ద్వారా ఆసుపత్రుల పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాణ్యమైన భోజనం, శానిటైజేషన్‌పై దృష్టి సారించాలన్నారు

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today