CSE డాష్ బోర్డ్ లో విద్యార్ధుల యొక్క హాజరు యొక్క రిపోర్ట్స్ ని క్రింది లింకు ను క్లిక్ చేసి జిల్లా, మండలం,పాఠశాల సెలెక్ట్ చేసి చూడగలరు.
జగనన్న విద్యా కానుక-2 పంపిణీ గురించి సూచనలు
మండల విద్యాశాఖాధికారులకు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ముఖ్య విజ్ఞప్తి::
జగనన్న విద్యా కానుక వస్తువులు ప్రస్తుత సంవత్సరం (2021-22) మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అందజేయవలెను.
గత సంవత్సరం (2020-21) మీ పాఠశాలలో Primary -5, UP-7/8, High School -10 చదివిన విద్యార్థులకు JVK Kit ఇవ్వరాదు.
ఈ విద్యా సంవత్సరంలో 6 లేదా 8 లేదా 9వ తరగతిలో చేరే విద్యార్థులకు కొత్తగా చేరిన పాఠశాలలో మాత్రమే JVK Kit ఇవ్వవలెను.
TC తీసుకుని వెళ్లే విద్యార్థులకు JVK Kit ఇవ్వకూడదు.
గత సంవత్సరం చదివిన విద్యార్థుల JVK Kit ను విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న UP / హైస్కూల్ నందు అందజేయవలెను.
Base Line Test Marks Entry Link Enabled
బేస్ లైన్ పరీక్ష లకు సంబంధించి Marks Entry ఆప్షన్ ను ఎనేబుల్ చేశారు .పిల్లల మార్క్స్ ను ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు.
USER ID AND BASE LINE TEST MARKS ENTRY LINK ARE SAME AS CHILD INFO
School Children Text Books Indent HM login
జగనన్న విద్యా కానుక పథకం లో భాగంగా విద్యార్థులు కు పంపిణీ చేయవలసిన పాఠ్య పుస్తకాలు ను MEO OFFICE నుండి తీసుకొని వాటివ వివరాలను HM లాగిన్ లో సబ్మిట్ చేయాలి.
ఆగస్టు 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం-శ్రీ చిన వీరభద్రుడు
ఉపాధ్యాయులకు కరోనా టీకా త్వరలో ముగియనుండటంతో ఆగస్టు 15న జెండా వందనంతో పాఠ శాలలను పునఃప్రాంభించేందుకు చర్యలు తీసు కొంటున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్య శాఖ డైరె క్టర్ కె. చినవీరభద్రుడు తెలిపారు.
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం పెదనెమలిపురిలో నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేసిన పాఠ శాలలను ఆయన గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా వీరభద్రుడు మాట్లాడుతూ ఆగస్టు 16 నుంచి 30 వరకు విద్యార్థులను అభ్యసనానికి సిద్ధం చేసి,
సెప్టెంబరు ఒకటి నుంచి తరగతులు నిర్వహించాలని భావిస్తు న్నట్లు చెప్పారు.
అంగన్వాడీలను నిర్వీర్యం చేస్తారని వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదనిస్థలం లేని చోట్ల పాఠశాలల్లోనే భవనాలు నిర్మించి పూర్వ విద్య నుంచి పదో తరగతి వరకు ఒకే ఆవరణలోకి తీసుకు వచ్చి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
రెండేళ్లలో సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడమే తప్ప ఒక్క ఉద్యోగం రద్దు కాదన్నారు. రెండో విడత నాడు- నేడు కింద రాష్ట్రంలో 25 వేల అదనపు తరగతి గదులను నిర్మించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు.
అవసరమైతే పదో తరగతి సిలబస్ లో రెండు అధ్యాయాలు తొలగించేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు.
New Student Admission option Enabled in cse login
STUDENT ENROLLMENT CSE SITE లో న్యూ admission OPTION ENABLE చేయడం జరిగింది. లాగిన్ అయి పిల్లలు వివరాలను నమోదు చేయవలెను.
న్యూస్టూడెంట్ ను ENROLL చేయాలంటే ముందుగా
★స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫారం1 fill చేయాలి
★ఆ తర్వాత నే ఫారం 2 FIIL. చేయాలి
https://studentinfo.ap.gov.in/newstudentRegistrationFormBasicDetailsOne.htm
NOTE: 1)ఫారం1ను పూర్తి చేసి ఫారం 2 అసంపూర్తిగా ఉన్నచో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి కానట్లే
2)పారం1,2 రెండు వివరాలు అసంపూర్తి ఉన్న కూడా రిజిస్ట్రేషన్ కాదు.
ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో SCERT డైరెక్టర్ జెడి B.ప్రతాపరెడ్డి గారు సమావేశం లో చర్చించిన ప్రధాన అంశాలు
జూలై నెలలో పాఠశాలల పునః ప్రారంభం ఉండదని కానీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా మరియు దూరదర్శన్ ద్వారా విద్యాబోధన చేయాలని, దానికి కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. నిర్వహణ, మూల్యాంకనం గురించి సూచనలను అడిగారు.
ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు ఆన్లైన్ నందు విద్యాబోధన అవసరం లేదని, 9 మరియు పదవ తరగతి లకు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేపడుతూ, ఆ అంశాలపై గల అసైన్మెంట్ ల పర్యవేక్షణ కొరకు వారానికి ఒకరోజు 10 am - 1pm వరకు నిర్వహించేలా, విద్యార్థులను పాఠశాలకు వచ్చే అవసరం లేకుండా ఈ కార్యక్రమం మొత్తం వాలంటీర్ల ద్వారా జరిపే విధంగా చేయాలని తెలియజేయడమైనది.
అడ్మిషన్ల గురించి వివరణ అడగగా పాఠశాలలు ప్రారంభించిన తర్వాతే అడ్మిషన్ల అంశం వచ్చునని తెలియజేశారు.
సర్వీస్ రూల్స్ విషయం గత రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నందున ప్రభుత్వం వైపు నుండి కొన్ని ప్రతిపాదనలు తెలియజేయడం జరిగినది ఏ మేనేజ్మెంట్ వారికి ఆ మేనేజ్మెంట్ ల వారీగా, వీటిలో ప్రత్యేకించి 13 డీఈఓ పోస్టులు, 49 డిప్యూటీ ఈవో పోస్టులు మరియు 666 ఎం ఈ ఓ పోస్టులను నూతనంగా సర్వీస్ రూల్స్ తో సంబంధం లేకుండా 100% జిల్లాపరిషత్ వారితోనే నియామకం చేసేలా శాంక్షన్ చేయించుటకు కృషి చేస్తామని తెలిపారు.
జె ఎల్స్ మరియు డైట్ లెక్చరర్స్ విషయం గురించి అడగగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ క్రింద ఎన్ని జూనియర్ కళాశాలలు ఏర్పాటు జరుగుచున్న కారణంగా ఆ తరువాత ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు జిల్లా పరిషత్ వారితోనే ఆయా పోస్టులను భర్తీ చేసేలా చర్యలు అని తెలిపారు.
పాఠశాలల పునఃప్రారంభంపై పరిశీలన.అనుకూల వాతావరణం వస్తే 10వ తరగతి పరీక్షలు.స్కూల్ కాంప్లెక్స్లుకు జగనన్న విద్యా కానుక కిట్లు.పాఠశాలల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు
కరోనా సెకండ్ వేవ్ తగ్గు ముఖం పట్టిన తరువాత జూలై 1 నుంచి పాఠశాలల పునఃప్రారం బానికి యోచిస్తున్నామని పాఠశా లల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. మంగళ వారం ఆర్జేడీ నరసింహారావుతో కలసి మచిలీపట్నం పాతరామన్నపేట మునిసిపల్ స్కూల్, రాంజీ ప్రభుత్వం హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల్లో నాడు- నేడు కింద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పుస్తకాలు, బూట్లు, టైలు, యూనిఫాం ఇచ్చే కార్యక్రమం ముమ్మరంగా కొన సాగుతోందన్నారు.
స్కూల్ కాంప్లెక్స్లకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇప్పటికే చేరాయన్నారు. విద్యాసంవత్సరంలో విద్యా కార్యక్రమాలు సంతృప్తికరంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. నాడు నేడు కార్యక్ర మాల అమలువల్ల పాఠశాలలకు భౌతిక వనరులు ఏర్పడ్డాయన్నారు. 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అయితే కొవిడ్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు జరుపుతామన్నారు. ఇప్పటికే పశ్చిమగోదావరి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించామన్నారు.
కృష్ణాజిల్లాలో నిర్వహిస్తున్న నాడు- నేడు కార్య క్రమాల అమలును జిల్లా విద్యాశాఖాధికారి తహెరా సుల్తానా, ఇతర అధికా రులతో చర్చించామన్నారు. కొవిడ్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ విద్యాశాఖాధికారులు పరిపాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం డీఈవో కార్యాలయంలో చినవీరభద్రుడుకు డీఈవో తాహెరా సుల్తానా, సూపరింటెండెంట్లు పూలదండలతో స్వాగతం పలికారు. డీఈవో కార్యాలయంలో ఫైళ్ల పెండింగ్పై అధికారులు, సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
విద్యా శాఖ కమీషనర్ శ్రీ చిన్న వీరభద్రుడు గారు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో డి.జి.ఇ, జాయింట్ డైరెక్టర్లు, యస్.సి.ఇ. ఆర్.టి డైరెక్టర్, కమీషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రధానాంశాలు:
విద్యాశాఖలో రోజురోజుకు ఎక్కువైపోతున్న యాప్ ల వినియోగాన్ని తగ్గించాలని కోరగా అనవసరమైన యాప్ లను రద్దు చేసి, అవసరమైన యాప్ లను సరళీకృతం చేసే విధంగా త్వరలో వర్క్ షాపు చేపడతామని తెలియజేశారు.
పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. దీనిపై ఈ రోజే సమావేశం కూడా నిర్వహించామని తెలిపారు.
ఎమ్ఈవోల బదిలీలను నిర్వహించాలని కోరగా త్వరలో చేపట్టుటకు ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.
నాడు నేడు పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయులకు ఆర్జిత సెలవులను ఇవ్వమని కోరగా దానిపై కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలియజేశారు.
నెలవారీ పదోన్నతులను నిర్వహించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.
సర్వీస్ రూల్స్ సాధించడానికి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని, తగు ప్రతిపాదనతో సమావేశానికి రావాలని సంఘాలను కోరారు.
పాఠశాలలో విద్యుత్ వినియోగ బిల్లులు తగ్గించుటకు 2 కేటగిరి నుండి 7 కేటగిరి కు మార్చాలని కోరగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పెండింగ్ లో ఉన్న 400 హెచ్ఎం పోస్టుల మంజూరులో జాప్యం నివారించి వెంటనే మంజూరు చేయాలని కోరగా ఈ సమస్యను పరిష్కరించడానికి వెంటనే డీఈఓ ల నుంచి సమాచారాన్ని తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎస్ ఎస్ సి స్పాట్ వాల్యుయేషన్ రేట్లు పెంచాలని కోరగా ప్రతిపాదనలు పంపుతామని అన్నారు.
అంతర్ జిల్లా బదిలీలు లను నిర్వహించాలని కోరగా ఎన్నికల కోడు ఉన్నందున నిర్వహించలేక పోయామని కోడ్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.
610 జీవో పై పని చేస్తున్న వారికి పదోన్నతి, బదిలీలపై ప్రతిపాదనలు గవర్నమెంట్ కు పంపామని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
675 పి.ఇ.టిలు విద్యార్హత లేని కారణంగా ప్రమోషన్ పొందని వారి కొరకు వేసవి సెలవులలో బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తామని తెలిపారు.
మోడల్ పాఠశాలలలో ఉపాధ్యాయులకు వార్డెన్ విధులు తొలగించాలని కోరగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.
40 మంది పైగా విద్యార్థులు గల పాఠశాలలకు PSHM పోస్ట్ లు మంజూరు చేయమని కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.
శాశ్వత బదిలీల కోడ్ రూపొందించుటకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోస్టుల పునర్విభజనలో భాగంగా బదిలీ పొందిన ఉపాధ్యాయులకు తాత్కాలికంగా జీతాలు ఇచ్చినప్పటికీ కేడర్ స్ట్రెంత్ సమస్యను పరిష్కరించవలసినదిగా కోరగా వేంటనే తగు చర్యలు తీసుకుంటామన్నారు.
కవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున పాఠశాలల నిర్వహణ పై గౌరవ విద్యాశాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి గార్లతో సంప్రదించి తగు నిర్ణయాన్ని తెలియజేస్తామని తెలిపారు.
ప్రధానోపాధ్యాయులు, పండిట్ల బదిలీల ఉత్తర్వులు వెంటనే విడుదల చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరగా సానుకూలంగా స్పందించారు.
Academic Calendar for 7th, 8th, 9th, 10th Class
7,8,9,10 తరగతుల అకడమిక్ క్యాలెండర్ 2020-2021 ని CSE వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
Click Here To Download 6,7,8,9,10 th Classes Academic Calendar
Application For Roll Increased school submit District Committe
రేషనలైజేషన్ నూతన ఉత్తర్వుల ప్రకారం ఏ పాఠశాల లో ఈ విద్యా సంవత్సరం రోలు పెరిగిందో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి మండల విద్యా శాఖాధికారి వారి ద్వారా జిల్లా లెవెల్ కమిటీ వారికి అప్లికేషన్ పెడితే పరిశీలించి అక్కడ ఉన్న పాత రోలు ప్రకారం పోస్టు పోతున్న ఎడల ఆ పోస్టును నిలుపుదల చేస్తారు.
Click Here To Download APPLICATION
పాత రోలు ప్రకారం ఉన్న పోస్టులు పోకుండా ప్రస్తుతం ఎక్కువ రోలు పెరిగి అక్కడ అదనంగా పోస్టులు కేటాయించడానికి లేదా వేరే పోస్టును అక్కడకు సర్దుబాటు చేయుటకు దరఖాస్తు చేయాలి కావున ఈ మాదిరి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని మీ MEO garu వారి ద్వారాజిల్లా లెవెల్ కమిటీ కి సమర్పించగలరు