ఏపీ మోడల్ స్కూళ్లల్లో ఈనెల 15 వరకు ఉన్న అడ్మిషన్ల గడువును 25వ తేదీ వరకు పెంచుతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు
దరఖాస్తు చేయు వెబ్ సైట్
ఏపీ మోడల్ స్కూళ్లల్లో ఈనెల 15 వరకు ఉన్న అడ్మిషన్ల గడువును 25వ తేదీ వరకు పెంచుతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు
దరఖాస్తు చేయు వెబ్ సైట్
ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు )లో 2021 - 22 విద్యా సంవత్సరంనకు 6వ తరగతిలో విద్యార్థులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ఆ ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్యమం ఆంగ్లంలో ఉంటుంది.
ప్రవేశ అర్హతలు :
వయస్సు : OC/BC కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2009 మరియు 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి.
SC/ST కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2007 మరియు 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి.
సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరవధికంగా 2019 - 20 మరియు 2020 - 21 విద్యా సంవత్సరంలు చదివి ఉండాలి.
2020-21 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారపత్రం కొరకు www.cse.ap.gov.in
apms.ap.gov.in చూడగలరు.
దరఖాస్తు చేయు విధానం.
అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించి సంతృప్తి చెందినతర్వాత తేది : 16.04.2021 నుండి 15.05.2021 వరకు net banking/Credit/Debit cards ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తర్వాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించడం జరుగుతుంది.
ఆ జనరల్ నెంబరు ఆధారంగా ఏదేని ఇంటర్నెట్ కేంద్రంలో.
apms.ap.gov.in (online) లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకోవడానికి రుసుము :
OC/BC రూ.100
SC/ST రూ.50
ప్రవేశములు లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును.