APTF VIZAG

విద్యార్థులు ఆంగ్లంలో ప్రావీణ్యం సాధించాలి. కేంబ్రిడ్జ్‌ లాంటి సంస్థల సహకారం తీసుకోవాలి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం

ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడటం, రాయడంలో ప్రావీణ్యం సాధించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇందుకు కేంబ్రిడ్జ్‌ లాంటి సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని, వీరి సహాయంతో మూడోతరగతి నుంచే పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్లు జారీచేసేలా కార్యక్రమం రూపొందించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో గురువారం పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘విద్యార్థులు ఆంగ్లంలో పట్టు సాధించేందుకు వారికి చేదోడుగా నిలవాలి. ఉపాధ్యాయులకు ఆంగ్లభాషపై శిక్షణ కొనసాగించాలి. ఆరో తరగతి, ఆపైన ప్రతి తరగతి గదిలో వచ్చే విద్యా సంవత్సరంలోపు ఐఎఫ్‌బీ ప్యానెల్స్‌, ఐదో తరగతిలోపు టీవీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలి. దీంతో బోధన, అభ్యసన సులభతరమవుతుంది. ఎనిమిదో తరగతి నుంచి ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఇంటివద్ద సైతం పిల్లలు ఆడియో, వీడియో పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశం కల్పించాం. ట్యాబ్‌ల వినియోగం, పాఠ్యాంశాలను నేర్చుకుంటున్న తీరుపై పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి’ అని సూచించారు.


బోధన సీరియస్‌గా ఉండాలి.

‘ఆరోతరగతిలోకి రాగానే పిల్లలు విద్యను సీరియస్‌గా తీసుకునేలా దృష్టిపెట్టాలి. మొక్కుబడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబులను వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రారంభంలోనే అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇంటర్‌ విద్యార్థులకు డిజిటల్‌ సౌలభ్యాన్ని కల్పించడంపై ఆలోచించాలి. విద్యారంగంలో అమలుచేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరం. దీంతో విద్యాకానుక నుంచి పాఠ్యాంశాలు, మౌలికసదుపాయాలు, గోరుముద్ద వరకు నాణ్యత పెరుగుతుంది. పిల్లలకు మంచి పాఠశాల వాతావరణం అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏటా విద్యాకానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలన అవసరం. వచ్చే ఏడాది విద్యాకానుక కిట్లు ఈ విద్యా సంవత్సరం ఆఖరుకే బడులకు చేరాలి. ‘నాడు-నేడు’ రెండోదశలో 23,221, మూడోదశలో 16,968 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నాం. వీటితోపాటు అంగన్‌వాడీలు, వసతిగృహాలను బాగుచేయాలి. రెండోదశ పనులు చురుగ్గా సాగాలి’ అని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సబ్జెక్టు టీచర్ల విధానం వల్ల 3, 4, 5 తరగతులకు మంచిబోధన అందుతోందని వెల్లడించారు. ట్యాబ్‌ల వినియోగంలో వైయస్‌ఆర్‌, విజయనగరం, చిత్తూరు జిల్లాల విద్యార్థులు మొదటి మూడుస్థానాల్లో ఉన్నారని, ఏప్రిల్‌ చివరినాటికి విద్యా కానుక వస్తువులన్నింటినీ పాఠశాలలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మొదటిదశ ‘నాడు-నేడు’పై ఆడిట్‌ పూర్తిచేశామని వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఖాతాల్లోకి నేడు నగదు జమ. విదేశీవిద్యా దీవెన కింద వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్థుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నగదు జమచేయనుంది. క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 200 విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా రూ. 19.95 కోట్లు వారి ఖాతాల్లో జమచేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సి, ఎస్సీ, బిసి, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, ఇతర విద్యార్థులకు గరిష్టంగా రూ.కోటి వరకు 100 శాతం ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంటు ప్రభుత్వం అందిస్తుంది. 100 నుంచి 200 ర్యాంకులు పొందిన యూనివర్సిటీల్లో ఎంపికైన ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ విద్యార్థులకు 100 శాతం ట్యూషన్ ఫీజు, గరిష్టంగా రూ.75 లక్షల వరకు అందించనుంది. ఇతర విద్యార్థులకు గరిష్టంగా రూ.50 లక్షలు లేదా ట్యూషన్ ఫీజులో 50 శాతం, ఏది తక్కువైతే అది చెల్లిస్తుంది. విద్యార్థులకు విమాన, వీసా ఛార్జీలను ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది.

Jawahar Navodaya samiti 9th Class entrance exam Hall Tickets Navodaya

వెబ్సైట్లో 'నవోదయ’ హాల్టికెట్లు 

జవహర్ నవోదయ విద్యాలయాల్లో (2023 2024 విద్యా సంవత్సరానికి) 9వ తరగతిలో ఖాళీ సీట్ల కోసం ఈనెల 11న నిర్వ హించనున్న ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ల (అడ్మిట్ కార్డులు) https://www.nvsadmissionclassnine.in

 వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి

IMMS App Updated Version 1.5.3

IMMS App ఈరోజు 1.5.3 లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, కొత్త వెర్షన్1.5.3ని క్రింది లింక్ ద్వారా పొందవచ్చును.

NEW VERSION FEATURES :

1)Ragi Jaggery indent module in HM services

2)Photo capturing in Close tickets module(TMF) in HM login

3)Showing image captured by HM in Final ticket closing module

4)Disabled Stock register and MDM sortex rice in Inspection form for NGO Served schools.


https://play.google.com/store/apps/details?id=com.ap.imms