APTF VIZAG: KGBV
Showing posts with label KGBV. Show all posts
Showing posts with label KGBV. Show all posts

Kgbv schools teachers transfers guidelines and shedule

కేజీబీవీ టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు.రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీ) పని చేస్తున్న బోధనా సిబ్బంది బదిలీలకు అనుమతి నిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.

Click Here TO Download Go 

 బదిలీలు ఆన్లైన్ విధానంలో, పునర్విభజనకు ముందున్న జిల్లా ప్రాతిపదికన నిర్వహించాలని సూచించారు. ప్రిన్సిపాల్, సీఆర్టీ, పీఈటీ, పీజీటీలు ఒకే చోట రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కోరవచ్చు. ఐదేళ్లు ఒకే చోట పని చేసిన ప్రిన్సిపాల్స్, ఎనిమిదేళ్ల సర్వీసున్న సీఆర్టీ, పీఈటీలు తప్పనిసరిగా బదిలీ కావాలి. బదిలీలన్నీ సంబంధిత జిల్లాలోనే చేపట్టాలి. మ్యూచువల్ ఆమోదం ఉంటేనే అంతర్ జిల్లా బదిలీకి అవకాశం కల్పిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆన్లైన్లో నిర్వహించే ఈ బదిలీల నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్ గా, డీఈవో సభ్యులుగా, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ మెంబర్ కన్వీనర్ గా, డైట్ ప్రిన్సిపాల్ సభ్యులుగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Invitation to apply for admission in KGBV (Kasturba Gandhi Balika Vidyalaya)

కేజీబీవీల్లో( కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం 

సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహి స్తోన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతి ప్రవేశాలకు, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచా లకులుకె. వెట్రిసెల్వి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 7వ తేదీ నుంచి 22 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసిన వారు), పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే ప్రవేశాలకు పరిగణిస్తామని స్పష్టం చేశారు.

https://apkgbv.apcfss.in/

circular Memo. Rc.No.ss-21021 /36/2022-IED & KGBV-ssA Dt:05.05.2022 KGBVs Admissions for VI Class and for vacant seats in VII & VIII Classes for academic year 2022 - 23 in KGBVs - certain instructions

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలలో (KGBVs)  2022-23 విద్యా సంవత్సరానికి 6వ తరగతి మరియు 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల ప్రవేశాలకు అనుసరించవలసిన విధానంపైసూచనలతో ఉత్తర్వులు విడుదల.

ఈ నెల 7 నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి..

Click here to download proceedings

KGBV 6th Class Entrance Results

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం  ఆరవ తరగతి(2021-22) ప్రవేశ ఫలితాలు ను విద్యార్థి ఆధార్ నెంబరు మరియు పుట్టిన తేదీ కింది లింక్ నందు చేసి ఫలితాలను తెలుసుకోండి.

https://apkgbv.apcfss.in/KGBVSixthResult.do

AP KGBV 6th Class, Inter Admissions 2021 Notification, Schedule, Online Application

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలలో 6 వతరగతి, 11వ తరగతులలో ప్రవేశము కొరకు మరియు 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కొరకు దరఖాస్తులు స్వీకరణ.

https://apkgbv.apcfss.in/

కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ ఆరవ తరగతి ఆన్లైన్ అప్లికేషన్  ప్రారంభ తేది :- జూన్3. ముగింపు తేది :- జూన్20.

క్యాండిడేట్ లాగిన్ లింక్:

( ఇందుకు విద్యార్థి ఆధార్ నెంబరు మరియు పుట్టిన తేదీ అవసరమగును)

Click Here To Login Apply Online Application


Featured post

Ap open school 10th Class and intermediate results