Pension Sanctioning Authorities తమ పరిధిలో 25సం. సర్వీస్ పూర్తి చేసుకున్న లేదా 5సం. సర్వీస్ మిగిలి ఉన్న ఉద్యోగులు అందరి తమ SR లను వెరిఫికేషన్ కొరకు AG ఆఫీస్ కు పంపాలని ఉత్తర్వులు విడుదల
AP NMMS February 2023 Final Key Released by BSE AP
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారికంగా విడుదల చేసిన NMMS 2022-23 (Held on 05.02.2023) ఫైనల్ కీ
State level science fair program live
ఈ రోజు రేపు జరగనున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ ఉత్సవాల లైవ్ ఈ రోజు ఉదయం 11 గంటల నుండి ఈ క్రింది లింక్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. విద్యార్థులకు ఈ లైవ్ చూపించడం వలన వాళ్ళలో మంచి స్ఫూర్తి నింపవచ్చు.
LEARN A WORD A DAY (27/02/2023) words list for level 1 2 3 4
లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
LEVEL-1 (Classes 1&2)
BOXING(ముష్టి యుద్ధం) Part of speech: Noun /'bok.sin/
Usage: He does boxing in his spare time.
LEVEL-2 (Classes 3,4&5)
WIN (గెలుపు/గెలవడం)
Part of speech: Noun/Verb
/win/
Synonyms: Verb:Gain /achieve/attain Noun:Victory/triumph/Success Antonyms: Defeat/failure/forfeit/loss Usage:He practiced a lot to win the race.
LEVEL-3 (Classes 6,7&8)
WEIGHTLIFTING (బరువులు ఎత్తే ఆట)
Part of speech:Noun
/wertlif.tin/ Usage:Mr John won Gold medal in
weightlifting.
LEVEL-4 (Classes 9&10)
WRESTLE (కుస్తీ పట్టుట)
Part of speech:Noun
/res.al/
Usage:They are going to wrestle a match next month.
Check your Inspire award amount in online
Inspire Award Amount విద్యార్థి బ్యాంక్ అకౌంట్ లో పడిందో లేదో Online లో check చేసే లింక్
Notification for admission of children in Class I under Section 12(1) (C) of the Right of Children to Free and Compulsory Education Act 2009 for the academic year 2023-24 for all Private Unaided Schools (IB/ICSE/CBSE/State syllabus)in Andhra Pradesh
ఏపీ లో ప్రైవేట్ (అన్ -ఎయిడెడ్) పాఠశాలల్లో RTE Act 2009 ప్రకారం పేద విద్యార్దులకు 1వ తరగతిలో ఉచిత సీట్లు కేటాయింపు షెడ్యూల్ తో కూడిన ఉత్తర్వులు జారీ - G.O.Ms.No.24, Dated:26/02/2023
SSC 2023 .. Target Oriented Program (TOP) Released by CSE Pre-Final 8th March to 16th F.A.4 Cancelled for SSC Long Periods Time Table Instructions for All
పదోతరగతి పరీక్షల సంసిద్ధత కార్యక్రమాల నియమాలు, సూచనలు మరియు టైమ్ టేబుల్స్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేష్ కుమార్ గారు
GENERAL ADMINISTRATION DEPARTMENT (SER.B) DIRECT RECRUITMENT -SYLLABUS AND SCHEME OF EXAMINATION OF THE COMPUTER PROFICIENCY TEST (CPT) TO BE CONDUCTED BY THE ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION (APPSC) OR STATE BOARD OF TECHNICAL EDUCATION & TRAINING AP OR UNIVERSITY RECOGNISED BY THE UGC OR STATE GOVERNMENT -APPROVED.
గ్రూప్-2,గ్రూప్-3 ఉద్యోగ నియామకాల్లో కొత్త నిబంధన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 2,గ్రూప్ 3 నియామకాల్లో కొత్త రూల్ అమల్లోకి తెచ్చింది.ఈ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధులు ఇక నుంచి తప్పనిసరిగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (సీపీటీ) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ టెస్టును ఏపీపీఎస్సీ,ఏపీ సాంకేతిక విద్యా మండలి నిర్వహిస్తుందని తెలిపింది.
ఈ సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా ఎవరూ కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసుల్లో ఉద్యోగం పొందలేరంటూ అడ్‌హక్ నిబంధనలు జారీ అయ్యాయి.
వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగ అభ్యర్ధులు 30 శాతం, బీసీలు 35 శాతం,ఓసీలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంది.
డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్,కంప్యూటర్లు, ఇంటర్నెట్ తదితర అంశాలపై పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ 2,గ్రూప్ 3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా ఈ సీపీటీ పరీక్ష పాస్ కావాల్సిందేనని అందులో స్పష్టం చేశారు.
Click Here To Download
Results for AISSEE - 2023 Sainik school entrance exam results released
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు మార్క్స్ విడుదల... Roll No. And Date of birth ద్వారా చూడొచ్చు..
https://ntaresults.nic.in/resultservices22/AISSEE2023XIVI/Login?apprefno=101182311
Learn A Word A Day Date : 25.02.2023 words list for level 1 2 3 4
లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level : 1 ( 1 to 2 )
Swimming - ఈదడం
Level : 2 ( 3 to 5 )
Team - జట్టు
Usage :Our school volley ball team won the championship.
Level - 3 ( 6 to 8 )
Track - ట్రాక్
Level - 4 ( 9 to 10 )
Toss - పైకి ఎగరవేయడం
Learn a word a day Today Date : 24.02.2023 words list for level 1 2 3 4
లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level 1
Row (పడవ నడపటం)
Spelling : R O W
Meaning : to move a boat by means of oars.
Phonetic Script : / rəʊ /
Other forms : Row – Rowed – Rowed – Rowing (Verb)
Usage :
1. He rowed a boat.
2. They row a boat on the river.
3. The fishermen rowed their boats.
4. Do you know rowing a boat ?
5. Where do you row your boat upto ?
Level : 2 Classes : 3,4,5
Success(విజయం)
Spelling : S U C C E S S
Meaning : achievement of something you planned to do.
Phonetic Script : / səkˈses /
Other forms : Success(Noun) Successful (Adj) Successfully (Adv)
Succeed – Succeeded – Succeeded (Verb)
Usage :
1. A good attempt is half success.
2. He had success through hard work.
3. I wish good luck for your success.
4. Really it was a great success.
5. What is the secret of your success ?
Level : 3 Classes : 6,7,8
Referee (మధ్యవర్ిత, ఆట నియమాలను అమలు పర్తచేవయక్ి)త
Spelling : R E F E R E E
Meaning : a person to whom something is referred for decision
Phonetic Script : / refəˈriː /
Other forms : Referee, Referees (Noun) Referee – Refereed – Refereed (Verb)
Usage :
1. The referee blew his whistle to start the game.
2. The referee signaled it for a foul.
3. The referee gave a final warning to the player.
4. The referee made the right decision.
5. The referee must be fair both the sides.
Level : 4 Classes : 9, 10
Tournament (ఆటల పో టీ)
Spelling : T O U R N M E N T
Meaning : in a sport or game a series of contests between a number of competitors,
competing for an overall prize.
Phonetic Script : / ˈtʊə(r)nəmənt /
Other forms : Tournament (Singular Noun) Tournaments (Plural Noun)
Usage :
1. All the best for your tournament.
2. I believe strongly that he can win the tournment.
3. He is watching tennis tournament.
4. He scored two goals in the tournament.
5. He looks forward for the tournament.
AP High Court Jobs Provisionally Selected Candidates List Released.
ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదల.
క్రింది PDF పేజీలో వివిధ రకాల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు కలవు.
Download your EHS CARD using your treasury id and Phone number
మీ యొక్క TREASURY I D మరియు mobile number తో మీ కుటుంబ సభ్యుల EHS cards ను క్షణం లో download చేసుకోగలరు
https://www.ehs.ap.gov.in/EHSAP/healthCardAction.do?actionFlag=healthCardView&theme=navyblue
Salary Drawing School Station Points to DEO Pool Teachers Memo.No.ESE02-14/11/2022-EST4-CSE Dt: 23/02/2023
ఏపీ ఉపాధ్యాయ బదిలీలు 2022లో స్టేషన్ పాయింట్స్ పై తాజా ఉత్తర్వులు విడుదల.డీఈవో పూల్ ఉపాధ్యాయులకు వారు ఎక్కడైతే జీతము పొందుతున్నారో ఆ పాఠశాల స్టేషన్ పాయింట్స్ కేటాయించాలని ఆదేశాలు.
Click Here To Download proceedings
From the Desk of Principal Secretary,Praveen Prakash-Episode- 3
జిల్లా విద్యాశాఖ అధికారులు అందరూ మీ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులకు హెడ్మాస్టర్ కి ఉపాధ్యాయులకు అందరికీ మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు విద్యాశాఖ పైన ఇచ్చినటువంటి సందేశాన్ని అందరికీ పంపి వీక్షించవలసిందిగా కోరడమైనది.
Link will open after 3 pm
గౌరవ విద్యాశాఖ అధికారులు అందరికీ నమస్కారం..
ఈ వీడియో లింక్ 23 వ తేదీ అనగా గురువారం సాయంత్రం మూడు గంటల నుండి సందేశాన్ని వినగలరు.
10 వేల లోపు పెన్షన్ ఉంటే రేషన్ కార్డు. రిటైర్డు ఉద్యోగులకు అవకాశమిచ్చిన ప్రభుత్వం
రిటైర్డు ఉద్యోగులు రూ.10 వేలలోపు పెన్షన్ పొందే వారు రేషన్ కార్డు తీసుకునేందుకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్ బుధవారం సర్క్యులర్ జారీ చేశారు.రేషన్ కార్డు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆరెంచల నిబంధనల్లో గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ.10 వేలలోపు,పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు కలిగి ఉండాలి. ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ నుంచి వేతనాలు పొందుతున్న ప్రభుత్వ పెన్షనర్లకు ఆదాయంతో సంబంధం లేకుండా రేషన్ కార్డును పౌరసరఫరాలశాఖ తిరస్కరిస్తుంది. ఇప్పుడు పెన్షన్ రూ.10 వేలలోపు పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.ఇప్పుడు రూ.10 వేలలోపు పెన్షన్ పొందే వారికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతివ్వడం వల్ల 19,780 మంది కొత్త రేషన్ కార్డులు పొందేందుకు అర్హత సాధించారు.
విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త నిబంధన, 1 వ తరగతిలో 6 + వయస్సు గలవారినే చేర్చుకోవాలి. ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు ఆరేళ్లు ఉండాల్సిందే.. కేంద్రం కొత్త రూల్!
పాఠశాలల్లో చిన్నారుల అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు కనీసం ఆరేళ్ల వయసు ఉండాలనే నిబంధనను పక్కాగా అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కనీసం ఆరేళ్ల ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని.. ఈ నిబంధన అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన విద్యా విధానంలో ఈ మేరకు నిబంధన ఉన్న విషయాన్ని విద్యాశాఖ గుర్తు చేసింది.
ఆ నిబంధన ప్రకారం మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఫౌండేషన్ స్టేజ్‌లో భాగంగా విద్య నేర్పాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఇందులో మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆటపాటలతో చదువుపై ఆసక్తి కలిగించేలా ప్రీ-స్కూల్ విద్య ఉంటుందని కేంద్రం ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఆ తర్వాత ఒకటి, రెండో తరగతులు ఫౌండేషన్ దశలో ఉంటాయి. అయితే ఒకటో తరగతిలో చేరే ముందే.. చిన్నారులకు నాణ్యమైన ప్రీస్కూల్ విద్య అందేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర విద్యా శాఖ సీనియర్ అధికారి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వయసు నిబంధనను నూతన విద్యా విధానానికి అనుగుణంగా మార్చుకోవాలని స్పష్టం చేశారు. దేశ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు కేంద్రం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది.
ఈ నూతన విద్యావిధానంలో బట్టి చదువులకు స్వస్తి పలికి సృజనాత్మకతకు పెద్ద పీట వేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ విధానాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఉన్నత విద్య తీరుతెన్నులను మార్చేసింది. ఇప్పటివరకు విద్యా విధానం 10+2+3గా ఉండగా.. దాన్ని 5+3+3+4గా మార్చింది. ఆర్ట్స్, సైన్స్ విద్య మధ్య విభజనలు లేకుండా నచ్చిన సబ్జెక్టులు ఎంపిక చేసుకునే వెసులుబాటును కల్పించేలా నూతన విద్యా విధానాన్ని రూపొందించింది. . జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాలల్లోనూ ప్లేస్కూల్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. సమగ్ర శిక్షా అభియాన్ 2.0 కింద ప్లేస్కూల్స్ ఏర్పాటు చేసి, అందుకోసం ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
Competency Need Analysis Survey Official SCHOOL LEADERSHIP Development SURVEY LINK
అందరు ప్రధానోపాధ్యాయులు (PS/UP/HS) AP సమగ్ర శిక్ష -SALT ప్రోగ్రామ్ సంబంధించి స్కూల్ లీడర్షిప్ డెవలప్మెంట్ Competency Need Analysis Survey ను దీక్ష యాప్ లో Compulsory గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది,
Note ఈ లింకు క్లిక్ చేసి, కేవలం దీక్ష APP లో మాత్రమే ఓపెన్ చేయాలి
https://diksha.gov.in/manage-learn/take-survey/85909f55801d70e6dffe079c73677dc9
Learn A Word A Day Date : 21.02.2023 words list for level 1 2 3 4
లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level : 1 Classes : 1, 2
Word: Lift
Level : 2 Classes : 3,4,5
Word: Exercise
Level : 3 Classes : 6,7,8
Word: Event
Level : 4 Classes : 9, 10
Word: Marathon
A marathon is a race in which people run a distance of 26 miles (about 42 km
Level - 4 ( 9 to 10 )
Contest - పోటీ
AP School Composite Grants 2022-23 Further 20% Released Rc.No. SS-15024/36/2021-SAMO-SSA, Dt. 18/02/2023
2022-23 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల కాంపోజిట్ గ్రాంట్స్ 20% విడుదల చేయటం జరిగింది.
SCHOOL LEADERSHIP PROGRAM_AP SALT survey form for all teachers
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ
సమగ్ర శిక్ష స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రపంచ బ్యాంక్ SALT కింద (ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్సఫార్మాషన్ ప్రోగ్రామ్) _ స్కూల్ లీడర్షిప్ డెవలప్మెంట్
డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (DoSE) పాఠశాల నాయకత్వ సామర్థ్య అవసరాలపై సర్వే నిర్వహించబోతోంది. అందువల్ల, DoSE పరిధిలో గల ప్రాథిమిక, మధ్యామిక, ఉన్నత మరియు హయ్యర్ సెకండరీ పాఠశాలలలో గల ప్రధానోపాధ్యాయుల నుండి ప్రతిస్పందనలను అనుమతిస్తుంది.
గమనిక:
1.ప్రధానోపాధ్యాయులందరు ఈ సర్వేలో తప్పనిసరిగా పాల్గోనవలెను.
2. దయచేసి మీ DIKSHA App ద్వారా ఈ సర్వేలో పాల్గొనండి.
3. తప్పనిసరిగా మీ DIKSHA ప్రొఫైల్‌ను అప్డేట్ చేయండి
4. ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో గల ప్రధానోపాద్యాయులందరు వారి ప్రొఫైల్ ను అప్డేట్ చేసుకొనవలెను
5. ఈ సర్వే కేవలం ప్రధానోపాద్యాయుల కోసం నిర్వహిస్తున్నారు
ప్రోగ్రామ్ పేరు: SCHOOL LEADERSHIP PROGRAM_AP SALT
సర్వే పేరు: కాంపిటెన్సీ నీడ్ అనాలిసిస్_స్కూల్ లీడర్షిప్_WB_SALT (ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్సఫార్మాషన్ ప్రోగ్రామ్) సర్వే ఫామ్ ను అందరు ఉపాధ్యాయులు నింపి సబ్మిట్ చేయాలి.
Survey Link:
https://diksha.gov.in/manage-learn/take-survey/85909f55801d70e6dffe079c73677dc9
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ ద్వారా జారీ చేయబడినది.
EMPLOYEES and PENSIONERS INCOME TAX SOFTWARE FOR FINANCIAL YEAR 2022-23
UPDATED (14-2-2023) INCOME TAX SOFTWARE 2022-23 for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners Below 60 years, Above 60 years, Above 62 years prepared by K.S.NAIDU.
2022-23 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ లో 6 నెలల పే స్లిప్ లు కూడా జనరేట్ అవుతాయి.
Click Here To Download Income Tax Software 2022-23
➡ మీ మొబైల్ లో income tax software ను ఏవిధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఈ క్రింద ఇచ్చిన వీడియోను చూడండి.
కొత్త PRC ప్రకారం రెండు రకాల hra కూడా ఇవ్వడం జరిగింది అలాగే da కూడా మనకు ఎన్ని కావలిస్తే అన్ని చూపించే విధంగా కూడా ఆప్షన్లు ఇవ్వడం జరిగింది
ఆదాయపు పన్ను శాఖ వారు అపీషియల్ గా మీ టాక్స్ బుల్ ఇన్‌కం పై ఎంత టాక్స్ పడుతుంది తెలుసుకోవడానికి ఒక లింకు ను ఇవ్వడము జరిగింది.
Click Here To Download Income Tax Software 2020-21
ఉపాధ్యాయులు తమ యొక్క ఆదాయపన్ను ఫారం-16 నింపడానికి వీలుగా వారి యొక్క వివరాలను నమోదు చేయడానికి వీలుగా ఒక MODEL application form ను PDF లో తయారు చేయడం జరిగింది.
Click here to Download Blank Form16 Proforma
Click Here To Download for single application
మీ మొబైల్ లో income tax software ఓపెన్ చేయడం కోసం WPS OFFICE అనే app ఇన్స్టాల్ చేసుకోండి. దానికి సంబంధించిన లింకు క్రింద ఇస్తున్నాను.
MLC vote enrolment process in simple steps
క్రింద తెలిపిన విదంగా online ప్రక్రియలో మన పట్టభద్రుల ఓటు కేవలం 3,4 నిమిషాలలో నమోదు చేసుకోవచ్చు.
https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/online2/form18.aspx
1) పైన ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే నమోదు పేజి(FORM -18) కి కనెక్ట్ అవుతుంది.
2) Graduates Constituency అనే చోట (Drop down list నుండి) .....మీ నియోజక వర్గ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయాలి
అలాగే మన జిల్లా ని కూడా సెలెక్ట్ చేయాలి
3) పక్కనే ఉన్న Choose file అనే చోట క్లిక్ చేసి మన యొక్క ఫోటోను మన ఫోన్ Gallery లేదా ఫైల్స్ అనే ఫోల్డర్ నుంచి సెలెక్ట్ చేసుకొని Upload అనే బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మన ఫోటో అటాచ్ అయ్యి కనబడుతుంది.
Very important
ఫోటో అటాచ్ చేసే ప్రక్రియలో మన ఫోటో size 100kb లేదా అంతకంటే తక్కువ ఉండాలి లేదంటే upload చేయలేము.
4) Applicant details Section.
మన పూర్తి పేరు, చిరునామా వివరాలు నమోదు(enter) చేయాలి
5)AC & EPIC
ఇక్కడ మన ఓటరు నంబర్ ని ఎంటర్ చేయాలి
6) Aadhaar Details
ఇక్కడ కేవలం ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది
7) Garduate సెక్షన్ దగ్గర డిగ్రీ అయితే Graduate సెలెక్ట్ చేయాలి డిప్లొమా అయితే Diploma సెలెక్ట్ చేసుకోవాలి.
I am a Graduate of the దగ్గర మన విద్యార్హత (మనం పాసయిన డిగ్రీ ) ఎంటర్ చేయాలి.
తరువాత సెక్షన్ మనం చదివిన యూనివర్సిటీ పేరు ఎంటర్ చేయాలి తరువాత in the year of అనే చోట మనం పాస్ ఆయిన సంవత్సరం ఎంటర్ చేయాలి.
తరువాత choose file అనే చోట మన సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని upload మీద క్లిక్ చేయాలి.
Important Note
మన సర్టిఫికేట్ 200KB మాత్రమే ఉండాలి.
ఫోటో సైజ్ ని క్రింద ఉన్న లింక్ ద్వారా తగ్గించవచ్చు.
Size reducing Steps
మొదటగా లింక్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఇమేజ్( select image ) చేసి కింద choose new size and format దగ్గర width and height 26 కి మార్చి download మీద క్లిక్ చేస్తే మన ఫోన్ Galery లో save అవుతుంది.
లాస్ట్ స్టెప్
Submit మీద నొక్కండి
Record submitted successfully your application no అని వస్తుంది దయచేసి ఆ నంబర్ ని నోట్ చేస్కోండి.
AP Mana Badiki Podam Mobile App Latest Updated Version Download.
బడి బయట పిల్లల సర్వే కోసం బడికి పోదాం మొబైల్ అప్లకేషన్ ను విడుదల చేయటం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.apcfss.manabadikipodam
Know Your MLC Application Status by using your name or application
మీ MLC ఓటు వివరాలు మీరే స్వయంగా మీ పేరు లేదా Ref.no తో check చేసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రాడ్యుయేట్ వారు form 18, టీచర్ mlc వారు form 19 సెలెక్ట్ చేసి తెలుసుకోవచ్చు.
https://ceoaperolls.ap.gov.in/status_mlc_2023/search.aspx
పై లింక్ లో మీ అప్లికేషన్ ఐడీ తెలుసుకొని క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ యొక్క పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు.
https://ceoaperolls.ap.gov.in/status_mlc_2023/search_ps.aspx
MLC ఓటు స్టేటస్ తెలుసుకొనే విధానం
Orientation on Classroom observation process Scheduled on 13th Feb 2023, 10 AM - 12:00 PM Attendance is mandatory. Please find the below google form link:
టీచ్ టూల్ లో భాగంగా అందరు ఉపాధ్యాయులకు క్లాస్ రూం అబ్జర్వేషన్ పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం 10 గం.లకు YouTube ద్వారా ప్రత్యక్ష ప్రసారం. దీనికోసం ప్రతి ఒక్కరు క్రింది గూగుల్ ఫారం ను నింపి సబ్మిట్ చేసిన వెంటనే వారికి YouTube link వస్తుంది.
https://forms.gle/L4KewTPvjLhnAfqB6
The form will be active from 9:45 AM to fill in the details.
Step 1: Participants shall fill in the details in the google form
Step 2: Participants shall get Youtube link
Step 3: Click on the Link.
Step 4: Join the orientation Program
open this link for D form and attendance of FA3 and Class Room Based Assesment CBA
క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ మరియు ఎఫ్ఏ 3 పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లతో ఇవ్వవలసినటువంటి డీఫామ్ మరియు ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసిన అటెండెన్స్ ఫామ్‌లను క్రింది వెబ్సైట్లో మీయొక్క dise code తో లాగిన్ అయ్యి సబ్మిట్ చేయాలి.
User ID: DISE CODE
PASSWORD: DISE CODE
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం (08–02–2023) సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం (08–02–2023) సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులకు వివరించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం మరియు సినిమాటోగ్రపీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ కార్యక్రమాలు.
# ఫిబ్రవరి 10న వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా అమలు.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా.
బాలికా విద్యకు ప్రోత్సాహాన్నిచ్చే గొప్ప సంస్కరణ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా.
వధూ, వరులు కచ్చితంగా పదోతరగతి పాసవ్వాలన్న నిబంధనను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.
గతంలో పోలిస్తే దాదాపు రెట్టింపు లబ్ధి.
4,536 కుటుంబాలకు మేలు జరిగేలా రూ.38.18 కోట్లు లబ్ధి.
అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ వివాహం చేసుకున్నవాళ్లకు సంబంధించి.. జనవరిలో తనిఖీ చేసి ఫిబ్రవరిలో చెల్లించనున్న ప్రభుత్వం.
జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో వివాహం చేసుకున్నవాళ్లకు ఏప్రిల్ నెలలో తనిఖీ చేసి మే నెలలో చెల్లింపు.
ప్రతి మూడు నెలలకొకమారు చెల్లించనున్న ప్రభుత్వం.
వైఎస్ఆర్ లా నేస్తం.
# ఫిబ్రవరి 17న అందించనున్న వైఎస్ఆర్ లా నేస్తం.
వైఎస్ఆర్ లా నేస్తం కింద 65,537 వేల మంది జూనియర్ న్యాయవాదులకు మూడేళ్లలో రూ.35 కోట్లు స్టైఫండ్ కింద అందించిన ప్రభుత్వం.
న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు.
17 వేల మందికి మేలు చేస్తూ ఇప్పటివరకూ రూ.25 కోట్ల కార్ఫస్ ఫండ్ కింద అందించిన ప్రభుత్వం.
# కర్నూలులో 50 ఎకరాల స్ధలంలో రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(ఎన్ఎల్యూ) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
# ఫిబ్రవరి 24న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించనున్న ప్రభుత్వం.
ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పరిహారాన్ని అదే సీజన్లో చెల్లిస్తున్న ప్రభుత్వం.
# ఫిబ్రవరి 28న జగనన్న విద్యాదీవెన పూర్తి పీజు రీయింబర్స్మెంట్.
అక్టోబరు నుంచి డిసెంబరు క్వార్టర్‌కు సంబంధించి ఫిబ్రవరి 28న విద్యాదీవెన విద్యార్ధులకు అందజేత.
విద్యాదీవెనకి సంబంధించి ఈ త్రైమాసికానికి దాదాపు రూ.700 కోట్లు.
దాదాపు 10.50 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి.
# ఉగాది సందర్భంగా మూడో విడత వైఎస్ఆర్ ఆసరా.
వారం రోజుల పాటు పండగ వాతావరణంలో పంపిణీ కార్యక్రమం.
79 లక్షల మంది మహిళలకు మేలు చేస్తూ మూడో విడతగా దాదాపు రూ.6,500 కోట్లుపంపిణీ.
10–04–2019 నాటికి డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు రూ.25వేలు కోట్లు చెల్లిస్తానని పాదయాత్రలో ప్రకటించిన శ్రీ వైయస్.జగన్.
ఇప్పటికే దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా చెల్లించిన వైయస్.జగన్ ప్రభుత్వం.
# మార్చినెలలో ఈబీసీ నేస్తం.
ఈబీసీ నేస్తం పథకం కింది దాదాపు రూ.600 కోట్లతో 4 లక్షల మందికి లబ్ధి.
# మార్చి నెలలో వసతి దీవెన.
వసతి దీవెన కింద ఈ ఏడాదికి సంబంధించి దాదాపు 10.50 లక్షల మంది విద్యార్దులకు మేలు చేస్తూ.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ రూ.20వేల వరకూ లబ్ధి.
విద్యార్ధుల వసతి, భోజన ఖర్చుల కోసం దాదాపు రూ.1000 కోట్లు అందించనున్న ప్రభుత్వం.
# కర్నూలు జిల్లా డోన్‌లో నూతనంగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 31 మంది బోధన, 12 మంది బోధనేతర సిబ్బంది భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
# ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను రూ.34.48 కోట్ల వ్యయంతో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
52 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
# వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి రాష్ట్ర, జోనల్, జిల్లా స్ధాయిలో పోస్టుల భర్తీ చేయాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
ఖాళీ అయిన వెంటనే ఎప్పటికప్పుడు వైద్య విభాగంలో పోస్టుల భర్తీ కోసం మెడికల్ సర్వీసు రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు.
గత ప్రభుత్వంలో ఖాలీగా ఉన్నవి, మన ప్రభుత్వంలో కొత్తగా సృష్టించిన పోస్టులు కలిపి దాదాపు 49 వేల పోస్టుల భర్తీ.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.
ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యుల నియామకం. ఒక 104 వాహనం.
ఒక వైద్యుడు పీహెచ్‌లో ఉంటే, మరో వైద్యుడు గ్రామాల్లో ఇళ్లకు వెళ్తారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి వీలుగా వైద్య ఆరోగ్యశాఖలో ప్రతి పీహెచ్సీలో సిబ్బందిని 12 నుంచి 14 మందికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
ఇందులో భాగంగా కొత్తగా 1,610 కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం.
# వైయస్సార్ జిల్లా ఫాతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 2015–16లో కేటగిరీ ఏ తో పాటు, తర్వాత విద్యాసంత్సరాలకు సంబంధించి కేటగిరీ బీ, సీలకు చెందిన విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు అంశాన్ని స్పెషల్ కేసుగా పరిగణించి చెల్లించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
రూ.9,12,07,782 చెల్లించాలన్న నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
# డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టులో జిల్లా సమన్వయకర్తలుగా 10 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.
సివిల్ అసిస్టెంట్ సర్జన్లను ఫారిన్ సర్వీసు డిప్యూటేషన్ (ఎఫ్‌ఎస్‌డి)పై నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
# 1998 డీఎస్సీలో క్వాలిఫైడ్ అభ్యర్ధులతో 4,534 సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టుల భర్తీ.
డిఎస్సీ –1998 క్వాలిఫైడ్ అభ్యర్ధులతో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
వీరికి మినిమమ్ టైం స్కేల్(ఎంటీఎస్) వర్తింపుచేయాలన్న ప్రతిపాదనకూ మంత్రిమండలి ఆమోదం.
ప్రాధమిక విద్యాశాఖతో పాటు ఖాళీలను అనుసరించి బీసీ, సోషల్ వెల్పేర్ స్కూళ్లలోనూ భర్తీ చే యడానికి గ్రీన్ సిగ్నల్.
# మార్చి 2వ తేదీ నుంచి మిడ్ డే మీల్స్‌లో రాగిజావ.
మధ్యాహ్న భోజన పథకం మెనూలో కొత్తగా అమల్లోకి రానున్న రాగిజావ.
వారానికి మూడు రోజుల పాటు రాగిజావ.
పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగిజావ.
మార్చి 2 వ తేదీ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం.
# మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్న ప్రభుత్వం.
సబ్జెక్టు టీచర్లగా అర్హత పొందిన 5,809 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు నెలకు రూ.2500 చొప్పున సబ్జెక్ట్ టీచర్ అలవెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
డిజిటల్ విద్యావిధానం వైపు వేగంగా అడుగులు వేస్తూ ఇప్పటికే నాడు నేడు ద్వారా అభివృద్ధి చెందిన పాఠశాలల్లో 6వతరగతి పైన ఉన్న అన్ని తరగతులకు సంబంధించి ప్రతి తరగతి గతిలో ఒక ఇంటరాక్టివ్ ప్లాట్ ప్లానెల్ (ఐఎఫ్‌పీ)లు చొప్పున 30,213 ఐఎఫ్‌పీలు ఏర్పాటు. మిగిలిన తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలు ఏర్పాటు.
# కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి ప్రస్తుతం అందిస్తున్న గౌరవవేతానానికి అదనంగా 23 శాతం పెంచుతూ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
అదే విధంగా కస్తూరిబా విద్యాలయాల్లో పనిచేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు(సీఆర్టీలు)తో సమానంగా గౌరవ వేతనం ఇవ్వాలన్న ప్రతిపాదనకూ గ్రీన్ సిగ్నల్.
# విశాఖపట్నంలో 100 మెగావాట్ల డేటా సెంటర్, ఐటీ అండ్ బిజినెస్ పార్కు, స్కిల్ సెంటర్‌తో పాటు రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటు కోసం అవసరమైన 60.29 ఎకరాల భూమి వైజాగ్ టెక్ పార్కు లిమిటెడ్ (వీటీపీఎల్)కు కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
వైజాగ్ టెక్ పార్కు ఏర్పాటు ద్వారా 14,825 మందికి కలగనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.
# రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నిర్వహణలో ఉన్న డిగ్రీ కళాశాలకు సంబంధించి 10 ప్రిన్సిపాల్, 138 బోధనా సిబ్బంది, 36 నాన్ టీచింగ్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
# ఏపీ జువైనల్ వెల్పేర్ డిపార్ట్మెంట్, విజయవాడలో డైరెక్టర్ పోస్టు భర్తీకి కేబినెట్ ఆమోదం.
# ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో 29 అదనపు పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
# గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పీవీ సింధు బ్యాడ్మెంటెన్ అకాడమీ అండ్ స్పోర్ట్స్ స్కూల్‌కు వేకెంట్ ల్యాండ్ టాక్స్‌ను రద్దు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
# ఆంధ్రప్రదేశ్ మున్సిపాల్టీస్ యాక్టు –1965, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్టు – 1955లకు సవరణలకు సంబంధించిన డ్రాప్ట్ బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ మరియు రెవెన్యూశాఖల సహాయంతో అర్భన్ లోకల్ బాడీస్ (యూఎల్బీస్)లో సమగ్ర భూముల రీ సర్వే పనుల కోసం అవసరమైన సవరణలకు కేబినెట్ ఆమోదం.
# ఏపీ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీసెస్ కింద పరిపాలనా సౌలభ్యం కోసం డిప్యూటీ డైరెక్టర్ (అకౌంట్స్) పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
# ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు ఏర్పాటుకు అవసరమైన భూమిని 20 సంవత్సరాల లీజు పీరియడ్‌కు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం.
16 అర్బన్ లోకల్ బాడీస్ (ఒంగోలు, నెల్లిమర్ల, పాలకొండ, శ్రీకాకుళం, వినుకొండ, అనంతపురం, ప్రొద్దుటూరు, కావలి, పిఠాపురం, రాయచోటి, గూడూరు, పెద్దాపురం, కడప, బద్వేలు, వెంకటగిరి, చిలకలూరిపేట)లలో చదరపు మీటరుకు ఏడాదికి రూ.1 కే అద్దె ప్రాతిపదికన కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఓకే.
# నెల్లూరు బ్యారేజ్‌ను నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు బ్యారేజ్‌గా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం.
# రాష్ట్రంలోని గ్రానైట్ పరిశ్రమలు పూర్వవైభవం దిశగా పయనించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు కేబినెట్ ఆమోదం.
స్మాల్ స్కేల్ గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్తును యూనిట్ రూ.2 కే అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
# ఆంధ్రప్రదేశ్ హైడ్రో ప్రాజెక్టు ప్రమోషన్ పాలసీ –2022లోని ప్రొవిజన్ 3 ప్రకారం ... వివిధ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టు సంస్ధలకు అవసరమైన అనుమతులు మంజూరుకు కేబినెట్ ఆమోదం.
# ఎకోరన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్ధకు సుమారు 1000 మెగావాట్ల విండ్‌పవర్, 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో దశలవారీగా నిర్మాణం కానున్న విండ్, సోలార్ ప్రాజెక్టులు.
విండ్ పవర్ ప్రాజెక్టులు.
అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురంలో 250, కర్నూలు జిల్లా బేతంచర్లలో 118.8 మెగావాట్స్, అనంతపురం జిల్లా కురుబరాహల్లిలో 251.2 మెగావాట్స్, కర్నూలు జిల్లా చిన్న కొలుములపల్లిలో 251.2 మెగావాట్స్, కర్నూలు జిల్లా మెట్టుపల్లిలో 100 మెగావాట్స్, జలదుర్గంలో 130 మెగావాట్లు విండ్ ప్రాజెక్టులు ఏర్పాటు.
సోలార్ పవర్ ప్రాజెక్టులు.
అనంతపురం జిల్లా కమలపాడు, యాడికిలలో 250 మెగావాట్లు, శ్రీ సత్యసాయి జిల్లా కొండాపురంలో 250 మెగావాట్లు, నంద్యాల జిల్లా నొస్సంలో 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు.
# మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రుణసదుపాయం కోసం అవసరమైన రూ.3,940.42 కోట్ల బ్యాంకు గ్యారంటీకై పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు, మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు మధ్య కుదిరిన ఎంఓయూను రాటీఫై చేస్తూ కేబినెట్ ఆమోదం.
# పెట్టుబడులు, మౌలికసదుపాయాలు కల్పనశాఖలో ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ విభాగానికి చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పోస్టు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
# రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు 250 ఎకరాల భూమిని లీజు ప్రాదిపదికన కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
దీనివల్ల రామాయపట్నం ప్రాంతంలో మెరుగుపడనున్న ఉపాధి అవకాశాలు.
# స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ)లో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం.
రూ.1.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు. దీని ద్వారా 70 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. పరోక్షంగా మరింతమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు.
# ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో వివిధ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.
ఏపీ లీగల్ సర్వీసెస్ అధారిటీలో రెండు పోస్టులు (1 డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్, 1 డేటా ఎంట్రీ ఆపరేటర్) తో పాటు 13 జిల్లాల్లో 13 డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.
# ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీస్‌లో జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో 14 ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ల భర్తీకి కేబినెట్ ఆమోదం.
# విజయనగరంలో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
#లీగల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్స్ సజావుగా నడిచేందుకు వీలుగా సపోర్టింగ్ స్టాప్ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
అనంతపురం, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు జిల్లాల్లో పోస్టుల భర్తీకి నిర్ణయం.
# మావోయిస్టుల పై నిషేధం మరో ఏడాది పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
# ఆంధ్రప్రదేశ్ వాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్) –2023 బిల్లు సవరణలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్.
# తిరుమల తిరుపతి దేవస్ధానం ఐటీ విభాగం(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్)లో 34 పోస్టులకు కేబినెట్ ఆమోదం.
# శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్వీఐటీఎస్ఏ)లో 12 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.
# పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
# పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో కొత్త పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
# ఏలూరు జిల్లా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గణపవరం మండలాన్ని భీమవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి మార్చే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
# విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలాన్ని చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ నుంచి విజయనగరం రెవెన్యూ డివిజన్‌కు మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
# పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలాన్ని గురజాల రెవెన్యూ డివిజన్ నుంచి నరసరావుపేట రెవెన్యూ డివిజన్‌కు మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
# ఆదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు 500 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు అవసరమైన 406.46 ఎకరాల భూమిని.. ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పెద్దకోట్ల, దాడితోట గ్రామాల పరిధిలో భూములు కేటాయించేందుకు ఆమోదం.
# కొత్త జిల్లాల ఏర్పాటు నేపధ్యంలో ప్రజల సౌకర్యార్ధం, పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ మండల కేంద్రాల మార్పుతో పాటు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
ఎన్టీఆర్ జిల్లాలో వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరుకు మారుస్తూ కేబినెట్ ఆమోదం.
జిల్లా కేంద్రాల్లో ఉన్న మండలాలను అర్బన్, రూరల్ మండలాలగా ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం.
విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల,అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6 జిల్లా కేంద్ర మండలాలను రూరల్, అర్భన్ మండలాలుగా విభజిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.
ఒంగోలు జిల్లా కేంద్ర మండలాన్ని ఒంగోలు రూరల్, అర్భన్ మండలాలుగా విభజిస్తూ నూతన మండలాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
# పశుసంవర్ధకశాఖలో నిపుణుల కొరతను తీర్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ యాక్టు – 2023 డ్రాప్టు బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
దీని ప్రకారం పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ ఏర్పాటు.
# జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం.
జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం మరింత మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరేలా మార్పులుకు కేబినెట్ ఆమోదం.
ఇంతకుముందు క్యూఎస్ ర్యాంకింగ్‌లో టాప్ -200 విశ్వవిద్యాలయాల వరకే పరిమితం.
ఇకపై దాదాపు 21 సబ్జెక్టులు/ఫ్యాకల్టీలకు సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్టు లేదా ఫ్యాకల్టీలో టాప్ 50 కాలేజీలు లేదా విద్యాసంస్ధల్లో సీటు సాధించినవారికి జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తింపు.
గతంలో కేవలం క్యూఎస్ సంస్ధ ర్యాంకింగ్ మాత్రమే పరిగణలోకి తీసుకోగా... ఇకపై క్యూఎస్ సంస్ధ ర్యాంకింగ్‌తో పాటు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్
ర్యాంకింగ్ ఆధారంగా సీటు సంపాదించిన వారికి జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తింపు.
ఈ మార్పుల వల్ల 320 కాలేజీలు, విద్యాసంస్ధల్లో విద్యార్ధులకు అందుబాటులోకి రానున్న కోర్సులు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు రూ.1.25 కోట్ల వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.
అర్హులైన ఇతరులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.
# ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపీఎస్పీఎఫ్)లో 105 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.
FA 3 and Class room based assessment answer keys for Telugu and maths
IMMS APP updated latest Version 1.5.4
IMMS App ఈరోజు ఫిబ్రవరి 9 న 1.5.4 లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది.అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్‌ని Instal చేయాల్సి ఉంటుంది. కొత్త వెర్షన్ 1.5.4 ని క్రింది సైట్ నుండి పొందవచ్చును
https://play.google.com/store/apps/details?id=com.ap.imms
NEW VERSION FEATURES
1)Ragi Jaggery indent module in HM services
2)Photo capturing in Close tickets module(TMF) in HM login
3)Showing image captured by HM in Final ticket closing module
4)Disabled Stock register and MDM sortex rice in Inspection form for NGO Served schools.
AP NMMS February 2023 Initial Key and Objections Link Officially Released by BSE AP
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారికంగా విడుదల చేసిన NMMS 2022-23 ప్రాథమిక కీ క్రింది వెబ్ పేజీలో
FA 3 CBA exams important instructions
FA -3 పరీక్షల నిర్వహణకు సంబంధించిన అతి ముఖ్యమైన సూచనలు .ప్రతి ఉపాధ్యాయుడు తప్పకుండా నోట్ చేసుకోవలసినవి.
Ap police SI PRELIMINARY HALL TICKETS RELEASED
హాల్ టికెట్లు విడుదల
ఈనెల 19వ తేదీన జరిగే SI ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లలను పోలీస్ నియామక మండలి విడుదల చేసింది._
ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండగా.
19వ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు షిఫ్ట్ - 1.
మధ్యాహ్నం 2.30 ని.ల నుండి సాయంత్రం 5.30 ని.ల వరకు షిఫ్ట్ -2 పరీక్షలు జరుగుతాయి.
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, ఫోన్ నంబర్, పుట్టిన తేదిని ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు.
వెబ్సైట్ : https://slprb.ap.gov.in
Ap constable recruitment exam results released
BREAKING: కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.
5,09,579 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా, 4,58,219 మంది పరీక్ష రాశారు. ఇందులో 95,208 మంది పాస్ అయ్యారు. మొత్తం 200 మార్కులు ఎగ్జామ్ నిర్వహించారు. ఫలితాల కోసం సైట్:
Learning improvement program (LIP) grading process
పకడ్బందీగా పరీక్షల నిర్వహన .టెన్త్ పరీక్షలకు 6.20 లక్షల మంది విద్యార్థులు. రాష్ట్ర పాఠశాల విద్య పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి.
నేడు ఎన్ఎంఎంఎస్ పరీక్షలకు 76 వేల మంది .రాష్ట్ర పాఠశాల విద్య ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలన్నీ పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్య పరీక్షల డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నిర్వహించే నేషనల్ మీన్స్‌కం మెరిట్ పరీక్షల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శనివారం జిల్లాకు వచ్చిన ఆయన డీఈవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.20 లక్షల మంది రాసేందుకు వీలుగా 3,300 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో 22 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 115 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఏ స్కూల్ నుంచీ నామినల్ రోల్స్ (ఎన్ఆర్) తీసుకోరాదని, ఆయా పాఠశాలల నుంచే రాష్ట్ర విద్యాశాఖకు పంపాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విద్యాశాఖ కార్యాలయంలోని పరీక్షల విభాగం సిబ్బంది ఎన్ఆర్ల పేరుతో డబ్బు వసూలు చేసినట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 76,320 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్షలు రాసేందుకు అవసరమైన 346 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. డీఈవో విజయేంద్రరావు, పరీక్షల సహాయ కమిషనర్ గురుస్వామిరెడ్డి, సమగ్రశిక్ష ప్లానింగ్ కోఆర్డినేటర్ గుణశేఖర్ ఆయన వెంట ఉన్నారు.
విద్యార్థులు ఆంగ్లంలో ప్రావీణ్యం సాధించాలి. కేంబ్రిడ్జ్ లాంటి సంస్థల సహకారం తీసుకోవాలి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం
ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడటం, రాయడంలో ప్రావీణ్యం సాధించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకు కేంబ్రిడ్జ్ లాంటి సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని, వీరి సహాయంతో మూడోతరగతి నుంచే పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్లు జారీచేసేలా కార్యక్రమం రూపొందించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో గురువారం పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘విద్యార్థులు ఆంగ్లంలో పట్టు సాధించేందుకు వారికి చేదోడుగా నిలవాలి. ఉపాధ్యాయులకు ఆంగ్లభాషపై శిక్షణ కొనసాగించాలి. ఆరో తరగతి, ఆపైన ప్రతి తరగతి గదిలో వచ్చే విద్యా సంవత్సరంలోపు ఐఎఫ్బీ ప్యానెల్స్, ఐదో తరగతిలోపు టీవీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలి. దీంతో బోధన, అభ్యసన సులభతరమవుతుంది. ఎనిమిదో తరగతి నుంచి ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఇంటివద్ద సైతం పిల్లలు ఆడియో, వీడియో పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశం కల్పించాం. ట్యాబ్‌ల వినియోగం, పాఠ్యాంశాలను నేర్చుకుంటున్న తీరుపై పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి’ అని సూచించారు.
బోధన సీరియస్‌గా ఉండాలి.
‘ఆరోతరగతిలోకి రాగానే పిల్లలు విద్యను సీరియస్‌గా తీసుకునేలా దృష్టిపెట్టాలి. మొక్కుబడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబులను వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రారంభంలోనే అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ సౌలభ్యాన్ని కల్పించడంపై ఆలోచించాలి. విద్యారంగంలో అమలుచేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరం. దీంతో విద్యాకానుక నుంచి పాఠ్యాంశాలు, మౌలికసదుపాయాలు, గోరుముద్ద వరకు నాణ్యత పెరుగుతుంది. పిల్లలకు మంచి పాఠశాల వాతావరణం అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏటా విద్యాకానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలన అవసరం. వచ్చే ఏడాది విద్యాకానుక కిట్లు ఈ విద్యా సంవత్సరం ఆఖరుకే బడులకు చేరాలి. ‘నాడు-నేడు’ రెండోదశలో 23,221, మూడోదశలో 16,968 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నాం. వీటితోపాటు అంగన్వాడీలు, వసతిగృహాలను బాగుచేయాలి. రెండోదశ పనులు చురుగ్గా సాగాలి’ అని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సబ్జెక్టు టీచర్ల విధానం వల్ల 3, 4, 5 తరగతులకు మంచిబోధన అందుతోందని వెల్లడించారు. ట్యాబ్‌ల వినియోగంలో వైయస్ఆర్, విజయనగరం, చిత్తూరు జిల్లాల విద్యార్థులు మొదటి మూడుస్థానాల్లో ఉన్నారని, ఏప్రిల్ చివరినాటికి విద్యా కానుక వస్తువులన్నింటినీ పాఠశాలలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మొదటిదశ ‘నాడు-నేడు’పై ఆడిట్ పూర్తిచేశామని వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఖాతాల్లోకి నేడు నగదు జమ. విదేశీవిద్యా దీవెన కింద వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
Jawahar Navodaya samiti 9th Class entrance exam Hall Tickets Navodaya
వెబ్సైట్లో 'నవోదయ’ హాల్‌టికెట్లు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో (2023 2024 విద్యా సంవత్సరానికి) 9వ తరగతిలో ఖాళీ సీట్ల కోసం ఈనెల 11న నిర్వ హించనున్న ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ల (అడ్మిట్ కార్డులు) https://www.nvsadmissionclassnine.in
వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి
IMMS App Updated Version 1.5.3
IMMS App ఈరోజు 1.5.3 లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, కొత్త వెర్షన్1.5.3ని క్రింది లింక్ ద్వారా పొందవచ్చును.
NEW VERSION FEATURES :
1)Ragi Jaggery indent module in HM services
2)Photo capturing in Close tickets module(TMF) in HM login
3)Showing image captured by HM in Final ticket closing module
4)Disabled Stock register and MDM sortex rice in Inspection form for NGO Served schools.
ఏంటి కొత్త పన్ను విధానం,ఎవరికి వర్తిస్తుంది,ఎంత కట్టాలి. ఉద్యోగులకు ఊరటనిస్తూ పన్ను శ్లాబుల్లో మార్పులు చేసింది కేంద్రం. కొత్త పన్ను విధానం ప్రకారం ఎవరు ఎంత పన్ను చెల్లించాలి? ఏం ప్రయోజనాలు లభిస్తాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు మీకోసం..
లక్షలాది మంది మధ్యతరగతి ఉద్యోగులకు ప్రయోజనం కల్పించేలా పన్ను శ్లాబుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కీలక ప్రకటన చేసింది. వార్షిక ఆదాయం రూ.7లక్షలు వరకు ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, శ్లాబుల్లో మాత్రం రూ.3లక్షల వరకు సున్నా శాతం పన్ను అని పేర్కొంది. దీన్ని చూసి చాలా మందికి ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు వస్తున్నాయి. అసలు ఈ పన్ను మినహాయింపులు ఎవరికి వర్తిస్తాయి? ఎంత ఆదాయం ఉన్నవారు ఎంత పన్ను చెల్లించాలి? వంటివి వివరంగా చూద్దాం.
కొత్త శ్లాబులు ఇలా..
గతంలో రూ.2.50లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను పరిధి నుంచి మినహాయింపు ఉండేది. ఇప్పుడు అది రూ.3లక్షలకు పెరిగింది. అంటే ఏడాదికి మూడు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన శ్లాబుల వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్త పన్ను శ్లాబులు
మరి రూ.7లక్షల మాటేంటి?
కొత్త పన్ను విధానం ప్రకారం రూ.3 లక్షల నుంచి రూ.6లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 5శాతం పన్ను పరిధిలోకి వస్తారు. రూ.6లక్షలు- రూ.9లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం రిబేట్ ఇస్తుంటుంది. ఇదివరకు రూ.5లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రిబేట్ ఉండగా.. ప్రస్తుతం ఆ పరిమితిని రూ.7లక్షల వరకు పెంచింది. అంటే.. రూ.7లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను మినహాయింపులు ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎవరు ఎంత కట్టాలి?
పైన చెప్పినట్లు ఏడాదికి రూ.7లక్షల వరకు సంపాదించేవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
రూ.9లక్షల వార్షిక వేతనం పొందుతున్న వ్యక్తులు ప్రస్తుతం సుమారు రూ.60వేలు పన్ను చెల్లిస్తున్నారు. ఇకపై వీరు చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు మాత్రమే. ఫలితంగా రూ.15వేల మేర ప్రయోజనం కలగనుంది.
రూ.15 లక్షల వార్షిక వేతనం పొందే వ్యక్తులు ఇదివరకు రూ.1.87 లక్షలు చెల్లిస్తుండగా.. ఇప్పుడు అది రూ.1.5 లక్షలకు తగ్గనుంది. వీరు రూ.37వేలు పన్ను ఆదా చేసుకోవచ్చు.
కొత్త పన్ను విధానం కింద ప్రతి పన్ను చెల్లింపుదారుడు రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దీని వల్ల రూ.15.5లక్షలు, ఆపైన ఆదాయం ఉన్న వేతన ఉద్యోగులు రూ.52,500 మేర పన్ను ప్రయోజం పొందనున్నారు.
అయితే, పన్ను చెల్లింపుదారులు ఇన్వెస్ట్మెంట్లపై ఎలాంటి డిడక్షన్లు, మినహాయింపులు పొందలేరని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
ఇకపై, ఆదాయపు పన్ను వెబ్సైట్లో కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఆప్షన్‌గా కనిపిస్తుంది. చెల్లింపుదారులు పాత విధానాన్ని సైతం ఎంపిక చేసుకోవచ్చు. కొత్త విధానం ఎంపిక చేసుకున్నవారికే పైన పేర్కొన్న మినహాయింపులు లభిస్తాయి.
ప్రస్తుతం ఇలా..
ప్రస్తుతం రూ.2.5లక్షలు- రూ.5లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 5శాతం పన్ను విధిస్తున్నారు. రూ.5-రూ.7లక్షల మధ్య 10 శాతం, రూ.7.5 నుంచి రూ.10 లక్షల మధ్య 15 శాతం రూ.10 నుంచి రూ.12.5 మధ్య 20 శాతం, రూ.12.5 నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం, రూ.15లక్షలపైన ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో ఐచ్ఛిక పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. మినహాయింపులు వదులుకుంటే తక్కువ రేటుకు పన్ను మదింపు చేసేలా నిబంధనలు తీసుకొచ్చింది. అయితే, ఈ విధానానికి చెల్లింపుదారులు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. మినహాయింపులు వదులుకున్నప్పటికీ.. పన్ను అధికంగానే కట్టాల్సి వచ్చింది.
Union budget 2023-24 announced by finance minister
వేతనజీవులు, మధ్యతరగతివర్గాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆశ ఫలించింది. వ్యక్తిగత ఆదాయ పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతూ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.7 - రూ.9 లక్షల వరకు 5 శాతం పన్ను, ఆదాయం రూ.30 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధింపునకు బడ్జెట్లో ప్రతిపాదించారు. అయితే ఇది నూతన పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనేది పూర్తిగా చెల్లింపుదారుడి ఐచ్ఛికం. ఎందులో ప్రయోజనం ఉంటుందనుకుంటే దానిని ఎంపిక చేసుకోవచ్చు. కాగా పన్ను మినహాయింపులకు సంబంధించి ఆర్థిక నిపుణుల అంచనాలు దాదాపు నిజమయ్యాయి. రెండేళ్లక్రితం ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానంలో వేతన జీవులకు ఆకర్షించడమే లక్ష్యంగా స్లాబుల్లో మార్పులు జరగొచ్చునని మొదటి నుంచి విశ్లేషకులు చెబుతూ వచ్చారు. దాదాపు ఇప్పుడు అదే జరిగింది.
వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు.కొత్త విధానంలో పొదుపు మొత్తాలపై రిబేట్ రూ 7.00 లక్షలకు పెంపు.
స్టాండర్డ్ డిడక్షన్ రూ 3.00 లక్షలు
6 స్లాబుల్లో టాక్స్
0 నుంచి రూ. 3 లక్షలు - సున్నా
రూ. 3 లక్షలు నుంచి రూ.6 లక్షలు - 5 %
రూ. 6 లక్షలు నుంచి రూ.9 లక్షలు - 10%
రూ. 9 లక్షల నుంచి రూ.12 లక్షలు - 15%
రూ. 12 లక్షల నుంచి రూ.15 లక్షలు - 20%
రూ. 15 లక్షల పైబడిన ఆదాయం - 30%
ఇన్‌కంటాక్స్ (వచ్చే సంవత్సరానికి)మినహాయింపు రూ 5.00 లక్షలు యదాతథం.ఎటువంటి మార్పు లేదు
బడ్జెట్ విశేషాలు.
రైతులకు 20 లక్షల కోట్ల రుణాలు
మత్స్య కారులకి 6000 కోట్ల సహకారం
157 నర్సింగ్ కాలేజీలు
చిరు ధాన్యాల వ్యాపారానికి...వ్యవసాయానికి సహకారం
వ్యవసాయ పరపతి సంఘాలకు 2000 కోట్లు
Ekalavya పాఠశాలలకు 38 వేల మంది ఉపాధ్యాయుల నియామకం.
తెల్ల కార్డు దారులకు ఉచిత బియ్యం పంపిణీ ఈ సంవత్సరం కూడా కొనసాగింపు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఆదాయపన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు
ఉద్యోగులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు.
ప్రస్తుతం ఉన్న రూ.5లక్షల ఆదాయపు పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
వైద్య కళాశాలల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తాం.
అధ్యాపకుల శిక్షణకు డిజిటల్ విద్యావిధానం, జాతీయ డిజిటల్ లైబ్రరీ తీసుకొస్తాం
దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలలతో పాటు, 157 నర్సింగ్ కాలేజ్‌లకు అనుమతి
త్వరలోనే ఐసీఎంఆర్ ప్రయోగశాలల విస్తృతిని మరింత పెంచుతాం.
ఫార్మారంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తాం.
ఈ-కోర్టులకు రూ.7వేల కోట్లు
బ్యాటరీల నిల్వ కేంద్రాల్లో 4వేల మెగావాట్లు.
పట్టణ మౌలిక సౌకర్యాలకు రూ.10వేల కోట్ల నిధి.
2030 కల్లా 5 MMT హైడ్రోజన్ తయారీ.
తాజా బడ్జెట్లో రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయింపు చేస్తున్నాం
రైల్వేల అభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.2.40లక్షల కోట్లు కేటాయిస్తున్నాం.
రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు
రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7లక్షల కోట్లు.
కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75వేల కోట్లు.
బడ్జెట్లో మూలధన వ్యయానికి రూ.13.5లక్షల కోట్ల కేటాయింపు.
కోస్టల్ షిప్పింగ్‌కు ప్రోత్సాహం
కాలుష్య కారక వాహనాల తొలగింపులో భాగంగా వాహన తుక్కు విధానం.
పీఎం కౌశల్ యోజనలో భాగంగా యువతకు శిక్షణ.
ప్రకృతి వ్యవసాయం చేసేందుకు వీలుగా కోటిమంది రైతులకు సాయం.
36 అంతర్జాతీయ స్థాయి నైపుణ్య కేంద్రాల ఏర్పాటు
కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్ద పీట వేస్తాం.
అలాగే మౌలిక వసతుల అభివృద్ధికి 33శాతం అధికంగా నిధులు కేటాయిస్తున్నాం
ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు:ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమం.
ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కోసం రూ.15వేల కోట్లు.
ఏకలవ్య పాఠశాలల్లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపడతాము
డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేస్తాం.
కారాగాగాల్లో మగ్గిపోతున్న పేద ఖైదీలకు ఆర్థిక చేయూత అందిస్తాం
దేశంలో 50 టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
దేఖో ఆప్నా దేఖ్ పథకం ప్రారంభం
స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్
దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్ట్‌లు, హెలిప్యాడ్ల నిర్మాణం
5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌ల ఏర్పాటు
పీఎం కౌశల్ పథకం కింద 4లక్షల మందికి శిక్షణ
మహిళల కోసం కొత్త స్కీమ్
ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు.
గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.
కొత్తగా ఇల్లు కొనుగోలు, కట్టుకోవాలనుకోవాలనుకునే వారికి మోదీ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి ఈ సారి బడ్జెట్లో నిధులు పెంచింది. గత బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. వడ్డీ రేట్లు పెరిగిన వేళ గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం.