APTF VIZAG: Formative Assessment test conducting instructions

Formative Assessment test conducting instructions

FA - 1 (ఫార్మేటివ్ అసెస్మెంట్) జరుపు విధానం గురించి సూచనలు ఈనెల 21 నుండి 25 వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ స్లిప్ టెస్ట్ లు నిర్వహించాలి. 

ప్రాథమిక పాఠశాల  విషయంలో 

21వ తేదీ తెలుగు 

22వ తేదీ ఆంగ్లము, 

23వ తేదీ గణితం, 

25వ తేదీ పరిసరాల విజ్ఞానం నిర్వహించాలి. 


సెకండరీ పాఠశాల విషయంలో 

21 వ తేదీ ఉదయం తెలుగు మధ్యాహ్నం గణితం, 

22వ తేదీ ఉదయం హిందీ మధ్యాహ్నం 6 7 తరగతులకు సైన్స్ 8 9 10 తరగతులకు భౌతిక శాస్త్రము అలాగే 23వ తేదీ ఉదయము ఆంగ్లము మధ్యాహ్నం సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహించాలి. తరువాత 25వ తేదీ జీవశాస్త్ర పరీక్ష నిర్వహించాలి  

ఈసారి ఈ పరీక్షల నిర్వహణలో కొన్ని ప్రధానమైన మార్పులు చేశారు. ప్రశ్న పత్రము నేరుగా ఎస్ ఎస్ సి ఈ ఆర్ టి వారు ప్రధానోపాధ్యాయులకు మెయిల్ ద్వారా పరీక్ష సమయానికి ఒక గంట ముందు పంపుతారు. ఆ ప్రశ్నాపత్రాన్ని ఒక బోర్డు పైన ప్రదర్శించి విద్యార్థులను రాసుకోమని చెప్పాలి. తర్వాత పరీక్ష నిర్వహించాలి . 

మరుసటి రోజు నుంచి పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేయాలి.   తరువాత ప్రధానోపాధ్యాయులు వాటిని అనగా మూల్యాంకనం చేసిన పరీక్షా పత్రాలను ర్యాండమ్ గా తనిఖీ చేయాలి .  

ఆ తర్వాత మార్కులను నమోదు చేసి  ఆన్లైన్లో సమర్పించాలి. తర్వాత తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలి . ఈ పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చిన వారికి రెమిడియల్ టీచింగ్ ప్రత్యేకంగా చేపట్టి తరగతులు నిర్వహించాలి.  

కనుక ఈ సారి నుండి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులను గమనించి తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి . అంతేకాక దాదాపు నవంబరు ఒకటవ తేదీ నుండి ప్రత్యేక  బోధన నిర్వహించవలసి రావచ్చు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results