APTF VIZAG: July 2020

CRDA BILL, AP 3 CAPITAL BILLS ARE PASSED BY GOVERNER AND GEZITTE NOTIFICATION RELEASED


సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం ,గెజెట్ నోటిఫికేషన్ విడుదల.
ఇకపై ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు
1.శాసన రాజధానిగా అమరావతి
2.పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం
3.జ్యుడీషియల్ రాజధాని గా కర్నూలు
Click Here To Download GEZITTE Notification 27
Click Here To Download GEZITTE Notification 28

New Admissions online Process in govt Schools


గౌరవ కమిషనర్, పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లోనూ నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేసుకోవాల్సిందిగా సూచించడమైనది.
 అడ్మిషన్ల ప్రక్రియ ఆప్ లైన్ మరియు ఆన్లైన్ రెండు విధానాల్లోనూ జరగవలసి ఉంటుంది.
అనగా ప్రతిరోజు అడ్మిట్ అయినటువంటి విద్యార్థుల వివరాలను అడ్మిషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలి. అదేవిధంగా గౌరవ కమీషనర్ వారి కార్యాలయం పంపినటువంటి  వెబ్ సైటు లింకు (  https://schooledu.ap.gov.in/SIMS20/ )   ద్వారా అడ్మిషన్ వివరాలను ఆన్ లైన్ లో కూడా అదే రోజు సాయంత్రం లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Click Here To Enter Students  Online Admission

User id : udise code
Password : Child info password తో లాగిన్ అయితే క్రింద చూపిన విధంగా విండో ఓపెన్ అవుతుంది.
  

ఇప్పుడు న్యూ స్టూడెంట్  రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి ఆధార్ నెంబరు ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసి వివరాలను నమోదు చేయాలి.

Intermediate First Year and Second Year Marks Memos


ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం జనరల్ కేటగిరి విద్యార్థుల షార్ట్ మెమోస్ 31.07.2020 తేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుండి నుండి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కేటగిరీ విద్యార్థుల, మరియు ప్రథమ సంవత్సరం ఒకేషనల్, జనరల్ కేటగిరీ విద్యార్థుల షార్ట్ మెమోస్ 01.08.2020 తేదీ మధ్యాహ్నం ఒంటిగంట  నుండి అందుబాటులో ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి సెక్రెటరీ  పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

మీ యొక్క మార్కుల మెమోల కొరకు క్రింది లింక్ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి డౌన్ లోడ్ చేసుకోగలరు.

 వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ప్రక్కన 3 అడ్డగీతలు కనబడతాయి. వాటి పైన క్లిక్ చేయగానే ఒక లిస్టు ఓపెన్ అవుతుంది. అందులో shart memo అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని పైన క్లిక్ చేయగానే మీకు ఏ సంవత్సరం రిజల్ట్స్ కావాలో చూపిస్తుంది దాని పైన క్లిక్ చేయాలి.

Click Here To Board Of Intermediate Website 

🎯Click Here For 2nd Year General SHORT MEMOS (షార్ట్ మెమోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
🎯Click Here For 2nd Year Vocational SHORT MEMOS (షార్ట్ మెమోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

🎯Click Here For 1st Year  General SHORT MEMOS (షార్ట్ మెమోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
🎯Click Here For 1st Year Vocational SHORT MEMOS (షార్ట్ మెమోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Cases Withdraw by govt against CPS AGITATIONS


CPS ఉద్యోగులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నట్లు జీవో విడుదల

Income certificate period for 4 years is stopped by Revenue Department

నాలుగు సంవత్సరాల పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు అవుతుంది అంటూ ఇటీవల రెవెన్యూ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మరల రెవెన్యూ శాఖ ఉత్తర్వులు.

Director of School Education Appointment


Sri V.N.Masthanaiah, Additional
Director of School Education - Promotion to the post of Director of School
Education in Category-1 of Class-I of A.P.E.S. for the Panel Year 2019-20
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్  గా శ్రీ వి.ఎన్.మస్తానయ్య గారిని ప్రొమోషన్ పై నియమిస్తూ ఉత్తర్వులు

COVID HOSPITAL PHONE NUMBER AND DOCTORS NAMES

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా చికిత్స అందిస్తున్న 471 ఆసుపత్రుల జాబితా విడుదల. ఆసుపత్రి పోన్ నంబర్లు,  వైద్యుని పేరుతో సహా జిల్లాల వారీగా జాబితా జతచేయబడినది.

ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే అన్‌లాక్‌ 3.0 నిబంధనలను బుధవారం రాత్రి విడుదల చేసింది.

⚡ కరోనా నేపథ్యంలో ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లను తెరవకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్‌లాక్‌ 2.0 గడువు ఈనెల 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే అన్‌లాక్‌ 3.0 నిబంధనలను బుధవారం రాత్రి విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపుల అనంతరమే ఆ మార్పులు చేసినట్టు తెలిపింది.
Click here to download complete Guidelines 
⚡సినిమాహాళ్లు, ఈతకొలనులు, వినోద పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు, అసెంబ్లీ హాళ్లు, జనం గుమిగూడటానికి వీలున్న ఇతర ప్రాంతాలు ఆగస్టు 31 వరకు తెరవడానికి వీల్లేదు.
 ⚡వందేభారత్‌ మిషన్‌ కింద మాత్రమే అంతర్జాతీయ విమాన ప్రయాణాలను పరిమితంగా అనుమతిస్తారు. మెట్రో రైళ్లు కూడా నడవవు.
⚡సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం యథాతథంగా ఉంటుంది.
⚡వచ్చే నెల 5 నుంచి యోగా కేంద్రాలు, వ్యాయామశాలలు మాత్రం తెరవొచ్చు. కేంద్ర వైద్యఆరోగ్య శాఖ జారీ చేసే ప్రామాణిక నిబంధనల ప్రకారం వీటిని నిర్వహించాల్సి ఉంటుంది.
⚡స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో భౌతికదూరం పాటించాలి. అందరూ మాస్క్‌ ధరించాలి.
ఆగస్టు 31 వరకు కంటెయిన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ ఉంటుంది. ఇందులో అత్యవసర కార్యకలాపాలు మినహా మిగిలిన వాటిని అనుమతించకూడదు. ఇక్కడ కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఇంటింటి సర్వే చేపట్టాలి.
⚡కంటెయిన్‌మెంట్‌ జోన్ల వెలుపల కార్యకలాపాలపై అవసరం అనుకుంటే రాష్ట్రాలు తగిన పరిమితులు విధించవచ్చు.
⚡రాష్ట్రం లోపల, రాష్ట్రాల మధ్య ప్రయాణాలు, సరకు రవాణాకు ఎలాంటి పరిమితులు లేవు. ఇందుకోసం ప్రత్యేకంగా అనుమతులు, మంజూరులు, ఇ-పర్మిట్‌లు అవసరం లేదు.
⚡పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదన్న నిబంధన అలాగే కొనసాగుతుంది.
⚡మార్చి 25 నుంచి దేశంలో అమలవుతున్న రాత్రి వేళ కర్ఫ్యూను ఎత్తేశారు.
⚡మిగిలిన అంశాల్లో ఇప్పటివరకూ ఉన్న నిబంధనలు, వెసులుబాట్లు యథాతథంగా కొనసాగుతాయి.

New Education Policy Reforms


దేశంలో 'విద్య' రూపు రేఖలు మార్పు.కొత్త పాలసీలో హైలైట్స్ .
Click Here To Download Complete Details
నిర్భంధ విద్య పొడగింపు.

ప్రస్తుతం 14 ఏళ్ల లోపు విద్యార్థులకు అందిస్తున్న నిర్బంధ విద్యను నూతన విద్యా విధానం ద్వారా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు పొడగించారు. 2025 నాటికి ప్రీ-ప్రైమరీ విద్యను విస్తృతం చేయడం,ప్రతీ ఒక్కరూ సాధారణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా కొత్త పాలసీని రూపొందించారు. లభ్యత,నాణ్యత,సమానత్వం,జవాబుదారీతనం ప్రాతిపదికన దీన్ని రూపొందించారు.
5+3+3+4 పద్దతిలో.

నూతన విద్యా విధానంలో పిల్లల వయసు కంటే వారి జ్ఞాన అభివృద్ది దశల ఆధారంగా 5+3+3+4 పద్దతిలో విద్యా విధానాన్ని రూపకల్పన చేశారు. దీన్ని ఫౌండేషనల్ స్టేజ్(3-8ఏళ్లు-గ్రేడ్స్ 1-2),ప్రీ-ప్రైమరీ,ప్రిపరేటరీ(8-12ఏళ్లు-గ్రేడ్స్-3-5),మిడిల్ స్టేజ్(11-14ఏళ్లు-గ్రేడ్స్-6-8),సెకండరీ స్టేజ్(14-18ఏళ్లు-గ్రేడ్స్-9-12)గా విభజించారు. ఇంటర్ విద్యను పూర్తిగా రద్దు చేశారు. డిగ్రీ కోర్సుల కాల పరిమితిని నాలుగేళ్లకు పొడగించారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో రీసెర్చ్‌ను కూడా భాగం చేసే అవకాశం ఉంది.

ఐదు వరకు మాతృ భాషలోనే..

కొత్త విద్యా విధానంలో విద్యార్థులు కళలు, మానవతా శాస్త్రాలు, క్రీడలు, ఇతర వృత్తిపరమైన సబ్జెక్టుల అధ్యయనానికి అవకాశం కల్పించారు. అలాగే 2-8ఏళ్ల వయసు నుంచే ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకునేలా విద్యా విధానాన్ని రూపొందించనున్నారు. దేశవ్యాప్తంగా 8 స్థానిక భాషల్లో ఈ-కోర్సులను అందుబాటులోకి తీసుకోనున్నారు. ఐదో తరగతి వరకూ అన్ని స్కూళ్లలోనూ మాతృ భాషలోనే విద్యా బోధనా జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంచేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయనున్నారు. ఇందుకోసం ఆరో తరగతి నుంచే విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశాలు బోధించనున్నారు. ఇప్పటిలా బోర్డు పరీక్షల్లో విద్యార్థుల ఆలోచనా శక్తిని కాకుండా జ్ఞాన శక్తిని పరీక్షించేలా పరీక్షల రూపకల్పన చేయనున్నారు.

సంస్కృతానికి ప్రాధాన్యం... ఏబీసీ ఏర్పాటు.
కొత్త విద్యా విధానంలో సంస్కృతానికి ప్రాధాన్యత కల్పించనున్నారు. సంస్కృత విశ్వ విద్యాలయాలకు కూడా పెద్ద పీట వేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయనున్నారు. ఇకనుంచి పరిశోధనలో ఎంఫిల్‌‌ను పూర్తిగా రద్దు చేయనున్నారు. అకడమిక్ క్రెడిట్ స్కోర్‌ను డిజిటల్ పద్దతిలో నిక్షిప్తం చేసేలా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ABC)ని ఏర్పాటు చేయనున్నారు.

డిపార్టమెంటల్ టెస్టుల దరఖాస్తు గడువు పెంపు,Departmental Test Application Last Date 1-8-20


డిపార్ట్మెంట్ల్ టెస్టుల కోసం ఫీజు చెల్లింపు, దరఖాస్తులు పంపడానికి గడువును పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆగస్టు ఒకటో తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు, ఫీజు చెల్లించాలని సూచించారు. ఆగస్టు 25వ తేదీన జరగా ల్సిన ఈ పరీక్షలను ఆగస్టు 28 కి, ఆగస్టు 31న జరగాల్సిన పరీక్షలను సెప్టెంబర్ ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నట్లు కార్యదర్శి పేర్కొన్నారు.

G.O.RT.No.33 ,Dt:27-07-2020 HM&FW Department – COVID-19 Conducting Rapid Antigen Tests at NABL& ICMR Approved Private Labs–Fixation of Rate for conducting COVID–19 Test in Private NABL & ICMR approved Labs – Permission Accorded

కోవిడ్ 19 ర్యాపిడ్ ఆంటీజన్ పరీక్షలు నిర్వహించుటకు ప్రయివేటు ల్యాబ్స్ కి అనుమతినిస్తూ, రేట్లు ఫిక్స్ చేస్తూ మార్గదర్శకాలు విడుదల.

ఆర్.సీ.నం.151/అ&ఐ/2020 తేది.25-07-2020 ప్రత్యామ్నాయ విద్యా కాలెండరు



AP లో ప్రత్యామ్నాయ విద్యా కాలెండరు అమలు గురించి కమీషనర్  వారి  ఆదేశములు.
పాఠశాల ప్రణాళిక,తల్లిదండ్రుల కమిటీ సమావేశం, పరీక్షలు,ప్రీ ప్రైమరీ,ఆన్లైన్ తరగతులు, పాఠశాలల్లో ప్రవేశాలు, ఉపాధ్యాయుల హాజరు మీద సమీక్ష మొదలగు విషయాలపై ఉత్తర్వులు.

Revenue Department – Issue of Income Certificate/Rice Cards by Revenue Authorities -G.O.MS.No.205 Dated: 25-07-2020


రేషన్ కార్డుయే ఇక ఆదాయ ధృవీకరణ పత్రము.ఇక బియ్యం కార్డుయే.. ప్రభుత్వ పథకాలకు Income certificate గా ప్రత్యేక ధృవీకరణ పత్రము అవసరం లేదు.
Click Here To Download Complete Proceedings Go

Telangana State Open schools 10th, inter All pass

తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ స్కూల్ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ కూడా పాస్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు అందర్నీ 35 మార్కులతో పాస్ చేసినట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Revised Time Table for Video classes, DD SAPTHAGIRI LIVE TV CHANNEL APP


1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సప్తగిరి ఛానల్ లో ప్రసారమయ్యే ఆన్లైన్ క్లాసెస్ ఈ క్రింది APP ఇన్స్టాల్ చేసుకుని అందులో చూడవచ్చు.
Click Here To Download Live TV Channel  App
 CSE : Video Classes (1st - IXth Classes) are going to be telecasted from 13.07.2020 to 31.07.2020  through Doordarshan (Saptagiri Channel) daily few hours

Level 1- (1 & 2 classes )
Time 11.00 am to 12.00 noon
3 ,4 & 5 class
Time 12.00 noon to 1.00 pm
6 and 7 Class
Time 2.00 Pm to 3.00 PM
8 and 9 class
Time 3.00 pm to 4.00 pm
10 class Languages
10.00 Am to 11.00 Am
10 class Non Languages
4.00 Pm to 5.00 PM

13.07.202
Worksheet 17
Telugu English and
Maths
Telugu Urdu/
Telugu
Urdu/
Telugu English Maths
14.07.202
Worksheet 18
Telugu English and
Maths
English Hindi Hindi Telugu Physical
Science
15.07.202
Worksheet
19Telugu English
and Maths
Maths English English Hindi Biology
16.07.202
Worksheet 20
Telugu English and
Maths
EVS Maths Maths English Social
17.07.202
Worksheet21Telugu
English and Maths Telugu Science Physical
Science
Urdu/
Telugu Maths
20.07.202
Worksheet22Telugu
English and Maths English Social Social Hindi Physical
Science
21.07.202
Worksheet
23Telugu English
and Maths
Maths Telugu Telugu English Biology
22.07.202
Worksheet 24
Telugu English and
Maths
EVS Hindi Hindi Urdu/
Telugu Social
23.07.202
Worksheet 25
Telugu English and
Maths
Telugu English English Hindi Maths
24.07.202
Worksheet
26Telugu English
and Maths
English Maths Maths English Physical
Science
27.07.202
Worksheet 27
Telugu English and
Maths
Maths Science Biology Telugu Biology
28.07.202
Corona Awarness
Programme EVS Social Social Hindi Social
29.07.202
Career Guidance Telugu Urdu/
Telugu
Urdu/
Telugu English Maths
30.07.202
Career Guidance English Hindi Hindi Telugu Physical
Science
31.07.202
Interaction with
Teachers Maths English English Hindi Biology

COVID Treatment For All Employees in EHS Scheme

ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు కరోనా పాజిటివ్ వచ్చిన సందర్బంలో ఆరోగ్యశ్రీ పథకం కింద జారీ చేసిన జి.వో & సర్క్యులర్ ల ప్రకారం అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో EHS కార్డ్స్ వున్న వారికీ  కోవిద్ -19 చికిత్స వున్నట్లు సి.ఈ.ఓ , ఈ.హెచ్.యస్ (ఆరోగ్యశ్రీ ), గుంటూరు వారు తెలిపారు.
కోవిద్ -19 పాజిటివ్ వచ్చిన టీచర్లకు EHS కార్డుల ద్వారా అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స చేయాలని ప్రాతినిధ్యం చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు సి.ఈ. ఓ గారు స్పష్టత నిచ్చారు.సందేహాలు వున్న వారు ఈ.హెచ్.యస్ (ఆరోగ్యశ్రీ ) హెల్ప్ లైన్ నెం: 104 కు ఫోన్ చెయ్యగలరు.

Ap SEC NIMMAGADDA RAMESH KUMAR


Ap SEC గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని నియమించవలసిందిగా గవర్నర్ గారి ఆదేశం. ఈ- మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి లేఖ.హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఉత్తర్వులు. 

All Schools Roll Particulars Mandal Wise, School Wise


మీకు కావల్సిన ఏదేని పాటశాల రోల్, ఆ పాటశాల లో పని చేసే ఉపాధ్యాయుల పేర్లు, వారి హోదా, అదే గ్రామం లోని మిగిలిన పాటశాల ల వివరాలు, వాటి ఎన్రోల్మెంట్ లను ఈ క్రింది లింక్ పై కేవలం జిల్లా, మండలం, పాటశాల సెలెక్ట్ చేసుకొని తెలుసుకోండి. బదిలీలకు ఇది ఉపయోగ పడుతుంది. రిపోర్ట్ ను పి.డి.ఎఫ్ రూపం లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.


ఏపీ: విద్యా విధానంలో సంచలన మార్పులు


వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ, యూకేజీ విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని సీఎం ఆదేశం

పీపీ1, పీపీ లుగా ప్రీప్రైమరీ విద్య అమలు

ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్ రూపొందిస్తాం

వర్చువల్ క్లాస్ రూమ్, ఇంగ్లీష్ ల్యాబ్ లు ఏర్పాటు: ఆదిమూలపు సురేష్

అవసరమైన టీచర్లను కూడా నియమించాలని సీఎం ఆదేశించారు

ప్రతీ జిల్లాలో టీచర్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు

8వ తరగతి నుంచే కంప్యూటర్ విద్య : మంత్రి సురేష్

ప్రతీ నియోజకవర్గానికి ఓ విద్యాశాఖ అధికారిని తెస్తాం

జిల్లా స్థాయిలో డీఇవో, జేడీలు జిల్లాలో జేసీల పరిధిలోకి విద్యాశాఖను తెస్తాం

ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్ పై చర్చించాం

కమిటీ నివేదిక ఆధారంగా సీఎం చర్యలు తీసుకుంటారు

సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు చర్యలు
సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు: మంత్రి సురేష్
అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం

JIO MART ,AMAZON, FLIP KART APPS FOR PURCHASING ALL ITEMS ONLINE AND DOOR DELIVERY.

RELIANCE JIO MART ద్వారా మనం ఆన్లైన్ లో మనకు కావలసిన నిత్యావసర వస్తువులు అన్నీ ఓకేచోట వెతికి డోర్ డెలివరీ ద్వారా మన ఇంటికి రప్పించుకోవచ్చు. వీటికి సంబంధించిన వెబ్ సైట్ లు.

Click Here To JIO MART
Click Here To FLIP KART 
Click Here To Amazon

సెప్టెంబర్‌ 5 నుంచి బడులు.విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గారు


ఆ లోపు పాఠ్యపుస్తకాలు అందించండి
 'నాడు-నేడు' పనుల్లో రాజీపడొద్దు , 25 నుంచి మెటిరీయల్స్‌ సరఫరా.
కొవిడ్‌-19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా సెప్టెంబర్‌ 5వ తేది నుంచి పాఠశాలలు పున: ప్రారంభమయ్యే అవకాశముందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.

ఆ లోగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాడు-నేడు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధి పనులపై సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ముందుగా 7 నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేసేలా చూడాలని, దీనివల్ల విద్యార్థులు వాటిని చదువుకునే అవకాశముందని మంత్రి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనుల్లో నాణ్యతపై రాజీపడొద్దని మంత్రి ఆదేశించారు.

క్వాలిటీ కంట్రోల్‌  విషయంలో ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించేటట్లు చూడాలని ముఖ్యకార్యదర్శి బి రాజశేఖర్‌ను ఆదేవించారు. గుర్తించిన 30 డెమో పాఠశాలల్లో ఆగస్టు మొదటి వారానికి పనులు పూర్తిచేసి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఫర్నీచర్‌, ఫ్యాన్లు, శానిటరీ తదితర మెటీరియల్స్‌ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. ఏయే పాఠశాలల్లో గ్రానైట్‌, టైల్స్‌, మార్బుల్స్‌ తో గ్రౌండ్‌ ఫ్లోర్‌ వేశారో వాటి వివరాలు అందజేయాలని కోరారు. మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్దపై అధికారులు ప్రత్యేక దఅష్టి సారించాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని చెప్పారు. జగనన్న గోరుముద్ద పథకం అమలు తీరుపై సిఎం మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు.
సిమెంట్‌ పూర్తిస్థాయిలో పంపిణీ కాకపోవడంతో పనుల్లో ఆలస్యం చోటుచేసుకుంటోందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇతర శాఖలు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యాశాఖకు పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదని తెలిపారు. పనుల్లో విశాఖ జిల్లా ముందంజలో ఉందని,కృష్ణాజిల్లా వెనుకబడిందని తెలిపారు. సిమెంట్‌ సరఫరా అంశాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. పనులు కొసాగడానికి పేరెంట్స్‌ కమిటీలకు రివ్వాల్వింగ్‌ ఫండ్‌ తక్షణమే అందజేయాలని ఆదేశించారు.పాఠ్యాంశాల సందేహాల నివఅత్తికి ప్రారంభించిన స్టూడెంట్‌ హెల్ప్‌ లైన్‌ కు విశేషమైన స్పందన లభిస్తున్నట్లు అధికారులు వివరించారు.

Kendriya Vidyalaya Admission Notification

 

కేంద్రీయ విద్యాలయాల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు తేదీలను ప్రకటించారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆగస్టు 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కరోనా నేపథ్యంలో ఫోన్ ద్వారా కూడా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించారు.  వెబ్సైట్తో పాటు కేవీఎస్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Click Here To Apply KV 1st Class Admission
Click Here To Download KV Android App


Sr. No. Title Details/Download
1 KVS Admission Guidelines 2020-2021. Download (406.87 KB) PDF
2 KVS Admission Notice 2020-2021. Download (56.77 KB) pdf
3 KVS Admission Schedule 2020-2021 Download (906.92 KB) pdf

Ap లో లాక్ డౌన్ పోడిగించే యోచనలో

మళ్లీ రెండు వారాలపాటు లాక్ డౌన్ ప్రకటిస్తే మంచిదనే ప్రతిపాదనలు సీఎం జగన్ ముందు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉంచినట్టు తెలుస్తోంది .

ఏపీలో కోవిడ్ కేసులు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు 4 వేలకు పైగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఒక వైపు రాష్ట్రంలో భారీగా కరోనా టెస్టులు చేస్తూ, అనేక చర్యలు తీసుకుంటున్నా... ఈ మహమ్మారి నియంత్రణలోని రాకపోవడం ప్రభుత్వ వర్గాలను ఆందోళన కలిగిస్తోంది. మ‌రోవైపు ఏపీలో కొన్ని ప్రాంతాలు ఇప్పటికే స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. గుంటూరు, చిత్తూరు, తూర్పుగోదావ‌రి లాంటి జిల్లాల్లో వ్యాపారస్థులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి లాక్‌డౌన్ పాటిస్తున్నారు. మ‌రికొన్ని ప్రాంతాల్లో ఆదివారం లాక్ డౌన్‌గా ప్రకటిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం కూడా ఏపీలో లాక్‌డౌన్ విధించే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

గ‌త వారం రోజులుగా ఏపీలో కోవిడ్ కేసుల వ్యాప్తి చూస్తుంటే రికవరీ రేటుతో పాటు డెత్‌రేట్ కూడా పెరుగుతోంది. ఇవే ఇప్పుడు ప్రభుత్వ వ‌ర్గాల్లో ఆందోళ‌న కలిగిస్తోంది. రాష్ట్రంలో ఒక్కసారిగా ఇలా భారీగా కేసులు పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు అయితే గ‌త కొద్ది రోజులుగా ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌ల‌స‌లు గ‌ణ‌నీయంగా పెరుగుతున్న నేప‌థ్యంలో కేసులు పెరుగుతున్నాయ‌ని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి శాతం త‌క్కువ‌గా ఉంద‌ని ప్రభుత్వ చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితిల నేప‌థ్యంలో మ‌ళ్లీ లాక్‌డౌన్‌కి వెళితే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌లు ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మ‌ళ్లీ రెండు వారాల‌పాటు లాక్ డౌన్ ప్రకటిస్తే మంచిద‌నే ప్రతిపాదనలు సీఎం జగన్ ముందు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉంచినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై సీఎం జగన్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మ‌ళ్లీ లాక్ డౌన్‌కి వెళ్లడం అనే అంశంపై సీఎం జగన్ చాలా విముఖ‌త‌గా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో భారీ సంఖ్యలో టెస్టులు చేస్తున్నామని, దీంతోపాటు ప్రైవేట్ ఆసుప‌త్రుల‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని సేవ‌లు అందిస్తున్నామని జగన్ వాదనగా ఉందని తెలుస్తోంది. కేసులు పెరుగుతున్నా... వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నప్పుడు మళ్లీ లాక్‌డౌన్ ఎందుకనే భావనలో ఏపీ ముఖ్యమంత్రి ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే లాక్‌డౌన్ ప్రకటించాలని ప్రభుత్వం అనుకున్నా.. అది అంతా సుల‌భ‌మైన ప‌ని కాద‌నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా ప‌రిస్థితి బ‌ట్టి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌పై నిర్ణయాలు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ... లాక్‌డౌన్ అంశం ఇంకా త‌మ అధీనంలోనే ఉంచుకుంద‌నే వాదనలు వినిపిస్తున్నాయి. గ‌తంలో తెలంగాణ కూడా మ‌ళ్లీ లాక్‌డౌన్‌కు వెళ్లాల‌ని భావించినా.. కేంద్రం నో చెప్పడంతో వెన‌క్కి త‌గ్గిన‌ట్లు పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రిగింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఏపీకి అలాంటి ప‌రిస్థితే వ‌స్తుందా? జ‌గ‌న్ లాక్‌డౌన్‌కు స‌ముఖ‌త‌గా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంద‌నే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెల‌కొంది.

Andhrapradesh State 1 to Intermediate Text Books PDF FILES

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  రూపొందించిన 1 నుండి ఇంటర్ వరకు అన్ని సబ్జెక్టు ల యొక్క పాఠ్యపుస్తకాలు PDF రూపం లో పోందుపరిచారు.కావలసిన వారు తరగతి మీద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోగలరు. 





నువ్వుల నూనె యొక్క ఉపయోగం, విశిష్టతలు


ఈ భూమిపై లభించే ఉత్తమమైన ఆహారాల గురించి మాట్లాడుకుంటే, అప్పుడు నువ్వుల నూనె పేరు ఖచ్చితంగా వస్తుంది. మరియు ఈ ఉత్తమ పదార్థం మార్కెట్లో అందుబాటులో లేదు.  రాబోయే తరాలకు దాని గుణాలు కూడా తెలియదు.
     ఎందుకంటే  ఈ కొత్త తరం జనం, టీవీ వాణిజ్య ప్రకటనలను చూసిన తర్వాత మాత్రమే అన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.
    నువ్వుల నూనెను నూనెలు నూనె అంటారు.
    నువ్వుల నూనెకు చాలా బలం ఉంది, అది రాయిని కూడా చీల్చుతుంది. 

మీరు ప్రయత్నించండి.
      ఒక కొండ రాయిని తీసుకొని ఒక గిన్నెలాగ  తయారు చేసి, ప్రపంచంలో నీరు, పాలు, ఆమ్లం లేదా ఆమ్లం ఉంచండి, ప్రపంచంలో ఏదైనా రసాయన, ఆమ్లం, అదే రాయిలో అలాగే ఉంటుంది.
  కానీ… మీరు ఆ గిన్నెలో నువ్వుల నూనెను, ఆ గొయ్యిలో నింపండి .. 2 రోజుల తరువాత మీరు చూస్తే, నువ్వుల నూనె… రాయిలోకి ప్రవేశించి రాయి కిందకు వస్తుంది.
    ఇది నువ్వుల నూనె యొక్క బలం. ఈ నూనెతో మసాజ్ చేయడం వలన, అది ఎముకలను దాటి,  ఆ ఎముకలను బలపరుస్తుంది.
       నువ్వుల నూనెలో భాస్వరం ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
    ఏదైనా శుద్ధమైన నువ్వుల నూనెను,  భారతీయుడు కోరుకుంటే, కొంచెం ప్రయత్నంతో సులభంగా పొందవచ్చు.
    అప్పుడు అతను ఏ కంపెనీ నూనెను కొనవలసిన అవసరం లేదు.
    నువ్వుల నూనెను ఏదైనా గానుగ నుండి కొనండి. కానీ, నువ్వుల నూనెను ఆడటానికి ముడి గానుగ (చెక్కతో చేసిన గానుగ) ను మాత్రమే వాడాలి.
    తైలం అనే పదం "తిల్" అనే పదం నుండి వచ్చింది.
    తిలల (నువ్వులు) నుండి బయటకు వచ్చే నూనెనే  నూనె అంటారు.
    అంటే, నూనె యొక్క నిజమైన అర్ధం "నువ్వుల నూనె" అని అర్థం.
     నువ్వుల నూనె యొక్క గొప్ప గుణం ఏమిటంటే, ఇది శరీరానికి ఎంతో శుభప్రదంగా పనిచేస్తుంది .. మీకు ఏ వ్యాధి ఉన్నా, దానికి వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తుంది.
    ఈ గుణము ఈ భూమి మీద ఇతర ఆహార  పదార్థాలలోను కనుగొనబడలేదు.
    100 గ్రాముల తెల్ల నువ్వులలో, 1000 మి.గ్రా కాల్షియం లభిస్తుంది.  నువ్వులు, బాదం కన్నా 6 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి.
    నలుపు మరియు ఎరుపు నువ్వులు, ఇనుముతో సమృద్ధిగా ఉంటాయి, ఇది రక్త లోపానికి చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది.
    నువ్వుల నూనెలో ఉన్న లెసిథిన్ అనే రసాయనం, రక్త నాళాలలో కొలెస్ట్రాల్ ప్రవాహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.
    నువ్వుల నూనెలో సహజంగా , సీస్మోల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా చాలా త్వరగా క్షీణించటానికి అనుమతించదు.
    ఆయుర్వేద చరక సంహిత లో, వంట చేయడానికి ఇది ఉత్తమమైన నూనెగా పరిగణించబడనది.
    నువ్వుల నూనెలో, విటమిన్-C మినహా అన్ని అవసరమైన పోషక పదార్థాలు ఉన్నాయి, ఇవి మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
    నువ్వులు విటమిన్ -బి మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి.
    ఇది మీథోనిన్ మరియు ట్రిప్టోఫాన్ అని పిలువబడే రెండు ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంది, ఇవి పప్పు దినుసులు, వేరుశెనగ, బీన్స్, చోలాస్ మరియు సోయాబీన్స్ వంటి చాలా శాఖాహార ఆహారాలలో కనిపించవు.
    ట్రిప్టోఫాన్‌ను ప్రశాంతమైన పదార్థం అని కూడా పిలుస్తారు, ఇది గాఢ నిద్రను కలిగించే సామర్ధ్యం కలిగి ఉంటుంది.
    ఇది చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
    మెథోనిన్ కాలేయాన్ని సరిచేస్తుంది మరియు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.
     టిల్బీస్ జీవక్రియను పెంచే ఆరోగ్యకరమైన కొవ్వుల యొక్క పెద్ద మూలం.
    ఇది మలబద్దకాన్ని కూడా అనుమతించదు.
     నువ్వు గింజల్లో ఉండే పోషక అంశాలు కాల్షియం, ఐరన్ వంటివి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి.
    నువ్వుల నూనెలో తక్కువ సంతృప్త కొవ్వు ఉంటుంది, కాబట్టి దీని నుండి తయారైన ఆహారాలు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
    సాధారణ అర్ధం ఏమిటంటే, మీరు సేకరించిన స్వచ్ఛమైన నువ్వుల నూనెను క్రమం తప్పకుండా తీసుకుంటే, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువ.
     అనారోగ్యంతో లేనప్పుడు, చికిత్స అవసరం ఉండదు.  ఇది ఆయుర్వేదం చెబుతోంది.
     ఆయుర్వేదం యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటంటే, సరైన ఆహారమే మాత్రమే శరీరాన్ని ఆరోగ్యంగా  ఉంచుతుంది. అపుడు శరీరానికి చికిత్స అవసరం ఉండదు.
     కొంతమంది ప్రజలు మార్కెట్లో నువ్వుల నూనె పేరిట మరికొన్ని నూనెలను విక్రయిస్తున్నారని గుర్తుంచుకోవాలి.
    ఇది గుర్తించడం కష్టమవుతుంది.  అటువంటి పరిస్థితిలో, మీ ముందు తీసిన నూనెను మాత్రమే నమ్మండి.  ఈ పని కొంచెం కష్టం, కానీ మొదటిసారి చేసిన ప్రయత్నంగా, ఈ స్వచ్ఛమైన నూనె మీకు అందుబాటులో ఉంటుంది.
     ఈ నువ్వుల నూనెలో మోనో-అసంతృప్త కొవ్వు ఆమ్లం ఉంటుంది, ఇది మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) అందించటం ద్వారా శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
    ఇది గుండె జబ్బులు, గుండెపోటు మరియు అథెరోస్క్లెరోసిస్ అవకాశాలను తగ్గిస్తుంది.
  క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది :
      నువ్వులు సెసామిన్ అనే యాంటీఆక్సిడెంట్ కలిగివుంటాయి, ఇది క్యాన్సర్ కణాలు పెరగకుండా ఆపుతుంది మరియు దాని మనుగడ రసాయన ఉత్పత్తిని ఆపడానికి సహాయపడుతుంది.
     ఊపిరితిత్తుల క్యాన్సర్, (Lung's cancer), కడుపు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రభావాలను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది.
 
ఒత్తిడిని తగ్గిస్తుంది.
    ఇందులో నియాసిన్ అనే విటమిన్ ఉంటుంది, ఇది ఒత్తిడి మరియు నిరాశను తగ్గించడంలో సహాయ పడుతుంది.
  గుండె కండరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది.
    ఈ నూనెలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, ఇది గుండె కండరాలు సజావుగా పనిచేయడానికి సహాయ పడుతుంది మరియు క్రమమైన వ్యవధిలో గుండె కొట్టుకోవడానికి సహాయపడుతుంది.

   శిశువుల ఎముకలను బలపరుస్తుంది.
    నువ్వులు  ప్రోటీన్ మరియు అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి, ఇది పిల్లల ఎముకల పెరుగుదలను బలోపేతం చేయడానికి సహాయ పడుతుంది.
     ఉదాహరణకు, 100 గ్రాముల నువ్వులు 18 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటాయి, ఇది పిల్లల అభివృద్ధికి చాలా ముఖ్యమైనది.
  గర్భిణీ స్త్రీ మరియు పిండం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
   నువ్వుల లో ఫోలిక్ ఆమ్లం ఉంటుంది, ఇది గర్భిణీ స్త్రీ మరియు పిండం యొక్క అభివృద్ధి మరియు ఆరోగ్యకరమైన అభివృద్ధికి సహాయపడుతుంది.
  నువ్వుల నూనె శిశువులకు మసాజ్‌ చేయడానికి పని చేస్తుంది.
    అధ్యయనం ప్రకారం, నువ్వుల నూనెతో శిశువులకు మసాజ్ చేయడం వల్ల వారి కండరాల బలానికి, వాటి అభివృద్ధికి ఉపయోగపడుతుంది.
    ఆయుర్వేదం ప్రకారం, ఈ నూనెతో మసాజ్ చేయడం ద్వారా, పిల్లలు హాయిగా నిద్రపోతారు.
  బోలు ఎముకల వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుంది.
    నువ్వుల నూనెలో జింక్ మరియు కాల్షియం ఉన్నాయి, ఇది బోలు ఎముకల వ్యాధి అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  డయాబెటిస్ మందులను సమర్థవంతంగా  పని చేయిస్తుంది.
     తమిళనాడులోని వినాయకా మిషన్ విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ అధ్యయనం ప్రకారం, ఇది అధిక రక్తపోటును తగ్గించడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని 36% తగ్గిస్తుంది.  యాంటీ-డయాబెటిక్  ఔషధం, గ్లిబెన్క్లామైడ్తో కలిపినప్పుడు సహాయపడుతుంది.
    అందువల్ల, టైప్ 2 డయాబెటిక్ రోగికి ఇది సహాయపడుతుంది.
    నువ్వులు, పాలతో పోలిస్తే మూడు రెట్లు కాల్షియం కలిగి ఉంటాయి.  ఇందులో కాల్షియం, విటమిన్ బి మరియు ఇ, ఐరన్ మరియు జింక్, ప్రోటీన్ మరియు కొలెస్ట్రాల్ పుష్కలంగా  ఉంటాయి.

  ఇవి పాలల్లో లేవు.
    నువ్వుల నూనె, చాలా సంవత్సరాలు పాడవదు, వేసవి రోజులలో కూడా అదే విధంగా ఉంటుంది.
  నువ్వుల నూనె సాధారణ నూనె కాదు.
    ఈ నూనెతో  మసాజ్ చేస్తే, శరీరం గొప్ప ఉపశమనం పొందుతుంది.  పక్షవాతం వంటి వ్యాధులను కూడా నయం చేసే సామర్థ్యం దీనికి ఉంది.
  దీనితో, మహిళలు తమ రొమ్ముల కింది నుండి పైకి మసాజ్ చేస్తే, అప్పుడు రొమ్ములు బలపడతాయి.
    శీతాకాలంలో మీరు ఈ నూనెతో శరీరానికి మసాజ్ చేస్తే, జలుబు అనిపించదు.
  నువ్వుల నూనెతో   ముఖానికి మసాజ్ చేస్తే,  ముఖం యొక్క అందం మరియు మృదుత్వాన్ని కాపాడుతుంది.
    పొడిగా ఉన్న చర్మానికి ఇది ఉపయోగపడుతుంది.
    నువ్వుల నూనెలో, విటమిన్ A మరియు విటమిన్ E సమృద్ధిగా ఉంటాయి.
    ఈ కారణంగా, ఈ నూనెకు ఇంత ప్రాముఖ్యత  ఉంది.
    ఈ నూనెను వేడి చేసి చర్మంపై మసాజ్ చేయడం వల్ల, చర్మము నిగారింపు పొందుతుంది.
   జుట్టు మీద పూస్తే, వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి.
   మీకు కీళ్ల నొప్పులు ఉంటే, నువ్వుల నూనెలో కొద్దిగా శొంఠి పొడి, చిటికెడు ఇంగువ పౌడర్ వేసి వేడి చేసి మసాజ్ చేయండి.
    నువ్వుల నూనె ఆహారంలో సమానంగా పోషకమైనది.
    మను ధర్మం లో కూడా నువ్వులు లేకుండా ఏ కార్యము సిద్దించదు, పుట్టుక, మరణం, పరానా, యజ్ఞం, శ్లోకం, తప, పిత్ర, పూజ మొదలైనవి నువ్వులు లేకుండా ఉన్నట్లు రుజువు లేదు.
    నువ్వులు మరియు నువ్వుల నూనె లేకుండా ఇది సాధ్యం కాదు, కాబట్టి ఈ భూమి యొక్క అమృతాన్ని అవలంబించి జీవితాన్ని ఆరోగ్యంగా చేసుకోండి.

      🙏సర్వేజనాఃసుఖినోభవంతు🙏

గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదా.




కరోనా కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో జరగవలసిన గ్రామ,వార్డు సచివాలయం పరీక్ష లు  మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామో త్వరలో తెలియజేస్తాం అని  పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ ట్వీట్ చేశారు.

Mahatma Gandhi NREGA Payment Status by Using Adhar No


మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నంబర్లు ఇచ్చి వారికి ఎప్పుడు బ్యాంకులో అమౌంట్ లు పడ్డాయో తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా కింద ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేయాలి.

Click Here for Website,వెబ్ సైట్ కోసం ఇక్కడ నోక్కండి.

 ఇలా ఓపెన్ చేయగానే క్రింద  చూపించిన పిక్చర్ లాగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.అందులో  వెబ్సైటు చివరికి వెళ్ళినట్లయితే అక్కడ మనకు లుకింగ్ ఫర్ సంథింగ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. అది ఈ చిత్రంలో చూపించినట్లు గా ఉంటుంది.

 అందులో మీరు సెలెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే కొన్ని వివరాలు వరుసగా కనబడతాయి.అందులో చివరగా యుఐడి అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేయగానే ఈ క్రింద చూపిన విధంగా విండో ఓపెన్ అవుతుంది.

 అందులో మీ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి క్రింద ఇచ్చిన కోడ్ నెంబరు ఎంటర్ చేసి GO పైన నొక్కగానే మీకు ఏ నెలలో ఎంత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో పడిందో మొత్తం వివరాలు అన్నీ ఒక పేజీలో ఓపెన్ అవుతాయి.

All states Schools Reopening information



పాఠశాలల పునః ప్రారంభం విషయమై తేదీ 15.7.2020  న కేంద్ర ప్రభుత్వం  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వివిద రాష్ట్రాల అభిప్రాయాలు,మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం.

HM లాగిన్ లో జగనన్న విద్యా కానుక వివరాలను నమోదు చేయడం.


జగనన్న విద్యాకానుకలో భాగంగా HMs receive చేసుకున్న Belt, Bag, Uniform, Text books వివరాలను క్రింది link లో Login అయ్యి services లో ఉన్న stock received HM మీద click చేసి ప్రధానోపాధ్యాయులు అందరూ వారు receive చేసుకున్న వివరాలను enter చేయాలి.
Click Here To Enter JAGANANNA VIDYA KANUKA KITS DETAILS
 

 

Note Books Upload in MEO Logins

 

ఒకటవ  తరగతి నుండి పదవ తరగతి వరకు నోటు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక్కో విద్యార్థికి ఒక్కో సెట్ గా తరగతుల వారీగా నోటు పుస్తకాలు ఇవ్వాలి. సెట్ల వారీగా చేయాల్సిన బాధ్యత సప్లయిరుదే. సెట్లుగా చేసిన తర్వాతే వాటిని మండల విద్యాశాఖాధికారి వారు  లాగిన్లో నమోదు చేయాలి .
Click Here To Download Instruction & User manual.

SWATCHA VIDYALAYA PURASKAR (WIN STAR) APP

స్వచ్చ విద్యాలయ పురస్కారం కోసం మీ పాఠశాల యొక్క పూర్తి వివరాలను క్రింది ఆప్ లో లాగిన్ అయి సబ్మిట్ చేయవలసివున్నది.
All Schools HMs are requested to download the win star ranking tool app(previously it called Swach vidyalay puraskar) and register and complete the fields in the app.
Click Here To Download Win star APP

PM-Kisan Samman Nidhi Department of Agriculture,Cooperation & Farmers Welfare Ministry of Agriculture & Farmers Welfare



Beneficiaries list under PMKisan 

District ,Sub-District ,Block ,Village లను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఆ గ్రామం లో  కిసాన్ క్రెెడిట్ కార్డు కు అర్హత పొందిన 
వారి వివరాలు అన్నీ కనబడతాయి.

మీ వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ మంజూరు అయిందా లేదా అనే వివరాలను మీ యొక్క ఆధార్ నెంబరు ని ఎంటర్ చేసి  తెలుసుకోవచ్చు.

మీ కార్డు మంజూరు గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మీ పేరు ఉన్నట్లయితే మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు. మీకు దగ్గరగా ఉండే కామన్ సర్వీస్ సెంటర్ కి వెల్లి అప్లై చేసుకోవచ్చు. 

మీకు దగ్గరగా ఉండే కామన్ సర్వీస్ సెంటర్ ని తెలుసుకోవడానికి ఇక్కడ నోక్కండి.

మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవడానికై కావలసిన అప్లికేషన్.


Featured post

Ap open school 10th Class and intermediate results