మళ్లీ రెండు వారాలపాటు లాక్ డౌన్ ప్రకటిస్తే మంచిదనే ప్రతిపాదనలు సీఎం జగన్ ముందు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉంచినట్టు తెలుస్తోంది .
ఏపీలో కోవిడ్ కేసులు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు 4 వేలకు పైగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఒక వైపు రాష్ట్రంలో భారీగా కరోనా టెస్టులు చేస్తూ, అనేక చర్యలు తీసుకుంటున్నా... ఈ మహమ్మారి నియంత్రణలోని రాకపోవడం ప్రభుత్వ వర్గాలను ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఏపీలో కొన్ని ప్రాంతాలు ఇప్పటికే స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. గుంటూరు, చిత్తూరు, తూర్పుగోదావరి లాంటి జిల్లాల్లో వ్యాపారస్థులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి లాక్‌డౌన్ పాటిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం లాక్ డౌన్‌గా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఏపీలో లాక్‌డౌన్ విధించే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
గత వారం రోజులుగా ఏపీలో కోవిడ్ కేసుల వ్యాప్తి చూస్తుంటే రికవరీ రేటుతో పాటు డెత్‌రేట్ కూడా పెరుగుతోంది. ఇవే ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఒక్కసారిగా ఇలా భారీగా కేసులు పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు అయితే గత కొద్ది రోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి వలసలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి శాతం తక్కువగా ఉందని ప్రభుత్వ చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిల నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్‌కి వెళితే ఎలా ఉంటుందనే ఆలోచనలు ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది.
మళ్లీ రెండు వారాలపాటు లాక్ డౌన్ ప్రకటిస్తే మంచిదనే ప్రతిపాదనలు సీఎం జగన్ ముందు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉంచినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై సీఎం జగన్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మళ్లీ లాక్ డౌన్‌కి వెళ్లడం అనే అంశంపై సీఎం జగన్ చాలా విముఖతగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో భారీ సంఖ్యలో టెస్టులు చేస్తున్నామని, దీంతోపాటు ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని సేవలు అందిస్తున్నామని జగన్ వాదనగా ఉందని తెలుస్తోంది. కేసులు పెరుగుతున్నా... వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నప్పుడు మళ్లీ లాక్‌డౌన్ ఎందుకనే భావనలో ఏపీ ముఖ్యమంత్రి ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే లాక్‌డౌన్ ప్రకటించాలని ప్రభుత్వం అనుకున్నా.. అది అంతా సులభమైన పని కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా పరిస్థితి బట్టి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌పై నిర్ణయాలు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ... లాక్‌డౌన్ అంశం ఇంకా తమ అధీనంలోనే ఉంచుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణ కూడా మళ్లీ లాక్‌డౌన్‌కు వెళ్లాలని భావించినా.. కేంద్రం నో చెప్పడంతో వెనక్కి తగ్గినట్లు పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఏపీకి అలాంటి పరిస్థితే వస్తుందా? జగన్ లాక్‌డౌన్‌కు సముఖతగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

No comments:
Post a Comment