APTF VIZAG: సెప్టెంబర్‌ 5 నుంచి బడులు.విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గారు

సెప్టెంబర్‌ 5 నుంచి బడులు.విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గారు


ఆ లోపు పాఠ్యపుస్తకాలు అందించండి
 'నాడు-నేడు' పనుల్లో రాజీపడొద్దు , 25 నుంచి మెటిరీయల్స్‌ సరఫరా.
కొవిడ్‌-19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా సెప్టెంబర్‌ 5వ తేది నుంచి పాఠశాలలు పున: ప్రారంభమయ్యే అవకాశముందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.

ఆ లోగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాడు-నేడు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధి పనులపై సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ముందుగా 7 నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేసేలా చూడాలని, దీనివల్ల విద్యార్థులు వాటిని చదువుకునే అవకాశముందని మంత్రి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనుల్లో నాణ్యతపై రాజీపడొద్దని మంత్రి ఆదేశించారు.

క్వాలిటీ కంట్రోల్‌  విషయంలో ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించేటట్లు చూడాలని ముఖ్యకార్యదర్శి బి రాజశేఖర్‌ను ఆదేవించారు. గుర్తించిన 30 డెమో పాఠశాలల్లో ఆగస్టు మొదటి వారానికి పనులు పూర్తిచేసి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఫర్నీచర్‌, ఫ్యాన్లు, శానిటరీ తదితర మెటీరియల్స్‌ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. ఏయే పాఠశాలల్లో గ్రానైట్‌, టైల్స్‌, మార్బుల్స్‌ తో గ్రౌండ్‌ ఫ్లోర్‌ వేశారో వాటి వివరాలు అందజేయాలని కోరారు. మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్దపై అధికారులు ప్రత్యేక దఅష్టి సారించాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని చెప్పారు. జగనన్న గోరుముద్ద పథకం అమలు తీరుపై సిఎం మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు.
సిమెంట్‌ పూర్తిస్థాయిలో పంపిణీ కాకపోవడంతో పనుల్లో ఆలస్యం చోటుచేసుకుంటోందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇతర శాఖలు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యాశాఖకు పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదని తెలిపారు. పనుల్లో విశాఖ జిల్లా ముందంజలో ఉందని,కృష్ణాజిల్లా వెనుకబడిందని తెలిపారు. సిమెంట్‌ సరఫరా అంశాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. పనులు కొసాగడానికి పేరెంట్స్‌ కమిటీలకు రివ్వాల్వింగ్‌ ఫండ్‌ తక్షణమే అందజేయాలని ఆదేశించారు.పాఠ్యాంశాల సందేహాల నివఅత్తికి ప్రారంభించిన స్టూడెంట్‌ హెల్ప్‌ లైన్‌ కు విశేషమైన స్పందన లభిస్తున్నట్లు అధికారులు వివరించారు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4