⚡ కరోనా నేపథ్యంలో ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లను తెరవకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్‌లాక్ 2.0 గడువు ఈనెల 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే అన్‌లాక్ 3.0 నిబంధనలను బుధవారం రాత్రి విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపుల అనంతరమే ఆ మార్పులు చేసినట్టు తెలిపింది.
Click here to download complete Guidelines
⚡సినిమాహాళ్లు, ఈతకొలనులు, వినోద పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు, అసెంబ్లీ హాళ్లు, జనం గుమిగూడటానికి వీలున్న ఇతర ప్రాంతాలు ఆగస్టు 31 వరకు తెరవడానికి వీల్లేదు.
⚡వందేభారత్ మిషన్ కింద మాత్రమే అంతర్జాతీయ విమాన ప్రయాణాలను పరిమితంగా అనుమతిస్తారు. మెట్రో రైళ్లు కూడా నడవవు.
⚡సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం యథాతథంగా ఉంటుంది.
⚡వచ్చే నెల 5 నుంచి యోగా కేంద్రాలు, వ్యాయామశాలలు మాత్రం తెరవొచ్చు. కేంద్ర వైద్యఆరోగ్య శాఖ జారీ చేసే ప్రామాణిక నిబంధనల ప్రకారం వీటిని నిర్వహించాల్సి ఉంటుంది.
⚡స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో భౌతికదూరం పాటించాలి. అందరూ మాస్క్ ధరించాలి.
ఆగస్టు 31 వరకు కంటెయిన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ ఉంటుంది. ఇందులో అత్యవసర కార్యకలాపాలు మినహా మిగిలిన వాటిని అనుమతించకూడదు. ఇక్కడ కాంటాక్ట్ ట్రేసింగ్, ఇంటింటి సర్వే చేపట్టాలి.
⚡కంటెయిన్‌మెంట్ జోన్ల వెలుపల కార్యకలాపాలపై అవసరం అనుకుంటే రాష్ట్రాలు తగిన పరిమితులు విధించవచ్చు.
⚡రాష్ట్రం లోపల, రాష్ట్రాల మధ్య ప్రయాణాలు, సరకు రవాణాకు ఎలాంటి పరిమితులు లేవు. ఇందుకోసం ప్రత్యేకంగా అనుమతులు, మంజూరులు, ఇ-పర్మిట్‌లు అవసరం లేదు.
⚡పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదన్న నిబంధన అలాగే కొనసాగుతుంది.
⚡మార్చి 25 నుంచి దేశంలో అమలవుతున్న రాత్రి వేళ కర్ఫ్యూను ఎత్తేశారు.
⚡మిగిలిన అంశాల్లో ఇప్పటివరకూ ఉన్న నిబంధనలు, వెసులుబాట్లు యథాతథంగా కొనసాగుతాయి.

No comments:
Post a Comment