నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ మరియు నేషనల్ టాలెంట్ సెర్చ్ అర్హత పరీక్ష యొక్క ప్రాధమిక కీ విడుదల చేయడం జరిగింది.
NTSE Final key
NMMS Final key
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ మరియు నేషనల్ టాలెంట్ సెర్చ్ అర్హత పరీక్ష యొక్క ప్రాధమిక కీ విడుదల చేయడం జరిగింది.
NTSE Final key
NMMS Final key
IMMS APP లో మీ పాఠశాల యొక్క ఆయా వివరాలు, టాయిలెట్స్ పండ్, టాయిలెట్స్ కమిటీ యొక్క రిజిస్ట్రేషన్స్ పూర్తి అయినవో లేదో క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
Click Here To Ayah Registration Status Link.
6 వారాల్లోగా ఉద్యోగమివ్వాలి.కారుణ్య నియామకంలో హైకోర్టు కీలక తీర్పు
ఆరు వారాల్లోగా కారుణ్య నియామక ఉద్యోగమివ్వాలని ఓ కేసులో హైకోర్టు తెలిపింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి కనబడటం లేదని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయానికి ఆ ఉద్యోగికి ఏడేళ్ల సర్వీస్ మిగిలుంటేనే ఆయన వారసులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందేందుకు అర్హులనే చట్ట నిబంధన రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ మేరకు ఇటీవల జస్టిస్ బి.దేవానంద్ తీర్పు చెప్పారు.
ఆ నిబంధన మేరకు ఏడేళ్ల సర్వీస్ మిగిలి లేదనే కారణంతో కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద విద్యుత్ శాఖ ఉద్యోగం ఇవ్వకపోవడాన్ని శ్రీనివాసరావు దాఖలు చేసిన రిట్లో ఈ తీర్పు వెలువడింది. పిటిషనర్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని ఆరు వారాల్లోగా అర్హతకు తగిన పోస్టులో నియమించాలని ఆ శాఖను ఆదేశించారు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ సెంటర్ లో అటెండర్ గా చేసే టి.సుబ్బారావు 2001ఆగస్టు 26 నుంచి కనిపించడం లేదని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆచూకీ తెలియలేదని, ఆ తర్వాత ఏడాది అక్టోబరులో పోలీసులు తేల్చారు. దీంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఆయన కొడుకు శ్రీనివాసరావు దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు నాటికి సుబ్బారావుకు ఏడేళ్ల సర్వీస్ మిగిలి లేదని, 1999లో రాష్ట్రం ఇచ్చిన జిఓ 378 ప్రకారం ఆయన దరఖాస్తును విద్యుత్ శాఖ తోసిపుచ్చింది. ఆ జిఓ రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని 2012లో శ్రీనివాసరావు హైకోర్టులో రిట్ వేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ... ఒక ఉద్యోగి మరణిస్తే ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం కారుణ్య నియామకం అవుతుంది. ఇది వెంటనే చేసే ప్రభుత్వం తప్పిపోయిన ఉద్యోగి చనిపోయినట్లుగా నిర్ధారించేందుకు ఏడేళ్లు సమయం కావాలని జిఓ చెప్పడం వివక్షే అవుతుంది. ఇంటి పెద్ద అయిన ఉద్యోగి కనబడకుండా పోతే మానవీయ కోణంలో సానుభూతితో సమస్యను చూడకుండా ఏడేళ్ల ఆంక్ష విధించడం చట్ట వ్యతిరేకం, ఆ కుటుంబ మానసిక క్షోభను ప్రభుత్వం పరిగణించకుండా జిఓ ఇచ్చింది. జిఓ ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు తీర్పులో పేర్కొంది.
సాధారణ భవిష్య నిధి మరియు మిగతా భవిష్య నిధి వడ్డీ రేట్లను జనవరి 2021 నుండి మార్చి 2021 వరకు 7.1% గా నిర్ణయిస్తూ G.O.RT.No.337 dated.26.02.2021 విడుదల.
ఎంప్లాయి హెల్త్ స్కీమ్ కి సంబంధించి క్రోనిక్ అవుట్ పేషెంట్ టైమింగ్స్ ని ఉదయం 10 నుండి 1గం. వరకు మార్చుతూ ప్రకటన
పాఠశాలలకు సెలవులు గురించి సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం గురించి DSE పత్రికా ప్రకటన మరియు ఆదిములపు సురేష్ గారి వివరణ
గత కొన్ని రోజులుగా పాటశాలకు సెలవు అంటూ సోషియల్ మిడియాలో వస్తున్న న్యూస్ వాస్తవం లేదు...
కరోనా సాకు చూపి మార్చ్1 నుండి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదు..
ఇది పూర్తిగా అవాస్తవం..దీన్ని ఎవరు వైరల్ చేయద్దు..
అలాంటి వారిపై చర్యలు.. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ..
సైబర్ క్రైమ్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది...
యధావిధిగా పాఠశాలలు నడుస్తాయి.. అందులో ఎటువంటి సందేహం లేదు.
జునియర్ కళాశాల లు కూడా షెడ్యుల్ ప్రకారం నడుస్తాయి..
డ్రై రేషన్ పంపిణీ కి సంబంధించి అన్ని పేజ్ లకు ఎంత పంపిణీ చేయాలి అనే వివరాలను పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది.
అన్ని యాజమాన్యం లోని పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయులు వారి యొక్క పోన్ నెంబర్, మెయిల్ ఐడి లను క్రింది గూగుల్ పామ్ లో సబ్మిట్ చేయాలి.
ఆదాయపు పన్ను శాఖ వారు అపీషియల్ గా మీ టాక్స్ బుల్ ఇన్కం పై ఎంత టాక్స్ పడుతుంది తెలుసుకోవడానికి ఒక లింకు ను ఇవ్వడము జరిగింది.
Click Here To Check Your Income Tax
Income Tax Software Prepared By K S NAIDU
పనుల నాణ్యతలో రాజీపడొద్దు.. ‘విద్యా కానుక’ కిట్‌లో ఇంగ్లీషు డిక్షనరీ
ఆయాలు, అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ.. 390 స్కూళ్లకు పక్కా భవనాలు
మొదటి దశ ‘నాడు-నేడు’ పనులు మార్చి నెలాఖ రు కల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎ్‌సజగన్ అధికారులను ఆదేశించారు. స్కూళ్లు కలర్‌ఫుల్‌గా, మంచి డిజైన్లతో ఉండాలనీ, ఇంటీరియర్ కూడా బాగుండాలనీ సూచించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘నాడు-నేడు’ పనులపై విద్యాశాఖ అధికారుల తో ముఖ్యమంత్రి సమీక్షించారు. ‘నాడు-నేడు’ కింద మౌలిక సదుపాయాలను మార్చిన స్కూళ్ల ఫొటోలను పరిశీలించారు. రెండోదశ ‘నాడు-నేడు’ పనులను జగన్ సమీక్షిస్తూ.. వి ద్యార్థులకు ఏర్పాటు చేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలనీ, ఎత్తు కూడా చూసుకోవాలనీ స్పష్టం చేశారు. పనుల్లో ఎక్కడా నాణ్యతా లో పం రాకూడదని ఆదేశాలు జారీచేశారు. ప్రభు త్వ పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థి తి ఎక్కడా ఉండకూడదనీ, ఎక్కడైతే భవనాలు లేవో అక్కడ ఖచ్చితంగా నిర్మించాలన్నారు. ప క్కా భవనాలు లేని 390 పాఠశాలలకు వాటి నిర్మాణానికి సీఎం ఆదేశాలిచ్చారు. ‘విద్యా కానుక’ కిట్‌లో ఈసారి ఇంగ్లీషు- తెలుగు డిక్షన రీ తప్పనిసరిగా చేర్చాలని సీఎం ఆదేశించారు. ప్రైవేట్ స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాల నాణ్యతతో పోటీగా ప్రభుత్వం ఇచ్చే పాఠ్యపుస్తకాలు ఉం డాలన్నారు. ‘విద్యా కానుక’లో ఏది చూసినా కూడా క్వాలిటీ ఉండాలని, ఎక్కడా రాజీ పడొద్ద ని సీఎం స్పష్టం చేశారు.
టీచర్లకూ డిక్షనరీలు ఇవ్వాలనీ, ‘అమ్మ ఒడి’ కింద ఆప్షన్ తీసుకున్న విద్యార్థులకు ఇచ్చే లాప్‌టా్‌పల క్వాలిటీ, సర్వీస్ ముఖ్యమని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతపై సీఎం సమీక్షించారు. ఇప్పటికే 27 వేల మంది ఆయాలను నియమించినట్లు అధికారులు తెలిపారు. మార్చి మొదటి వారం లో వీరందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పరిపరాలు శుభ్రంగా ఉంచే లిక్విడ్లను అన్నీ స్కూళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు సీఎంకు వివరించారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి తల్లులు, ఎడ్యుకేషన్ సెక్రెటరీలు, వలంటీర్ల మ్యాపింగ్ ప్రక్రియ నడుస్తోందని అధికారులు చెప్పగా.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మార్చి 15కల్లా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
2021-22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎ్‌స ఈ విధానం అమలు చేయాలని, ఆ తర్వాత నుంచి ఒక్కో తరగతి పెంచుకొంటూ 2024 విద్యా సంవత్సరానికల్లా 1 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులు ఈ విధానంలోకి రావాలన్నా రు. ఈ మేరకు అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇ వ్వాలనీ, చిన్నారులకు బోధన ఎలా చేయాలన్నదానిపై ఈ శిక్షణ ఉండాలన్నారు. ప్రతి రెండు నెలలకోసారి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారా? లేదా ? అన్నదానితో సంబంధం లేకుండా వారు ఎం తవరకు శిక్షణ కార్యక్రమాల ద్వారా అప్‌గ్రేడ్ అయ్యారో పరిశీలించాలన్నార
రాష్ట్ర వ్యాప్తంగా 24-2-21 నాడు స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయని పాఠశాల ల వివరాలు జిల్లా వారీగా ఇవ్వడం జరిగింది.
విశాఖపట్నం జిల్లాలో దీక్షా platform ద్వారా నిష్ఠా టీచర్ ట్రైనింగ్స్ తీసుకున్న టీచర్లు కింద తెలిపిన గూగుల్ లింక్ లో బ్యాంక్ వివరాలు పంపడం జరిగింది. అయితే కొంతమంది ఉపాధ్యాయులు తమ బ్యాంకు వివరాలు పంపేటప్పుడు తప్పుగా పంపడం జరిగింది. దిగువన ఉన్న వీరి వలన మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పేమెంట్స్ ఆగిపోయాయి.
1 . బ్యాంకు అకౌంట్ నెంబర్ లు తప్పుగా పంపిన వారు- 61 టీచర్లు Click Here for List
2 . CFMS వివరాలు తప్పుగా పంపిన వారు - 16 టీచర్లు Click Here for List
3 . IFSC కోడ్ తప్పుగా పంపిన వారు - 47 టీచర్లు Click Here For List
పైన వివరాలు కరెక్ట్ చేయడానికి మాకు తెలియదు కనుక, జాబితాలో ఉన్న టీచర్ లు అన్యధా భావించకుండా కింది తెలిపిన google link లో మీ యొక్క బ్యాంక్ వివరాలు మరల నమోదు చేయగలరు.
https://forms.gle/PWV8bGLGBMCXACBE9
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2021 అన్ని సబ్జెక్స్ అఫీషియల్ సిలబస్ తెలుగు & ఇంగ్లీషు మీడియం - పరీక్షకు చదివించవలసినవి మరియు చదివించనవసరంలేని అంశాలు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సీఎం జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమై పలు కీలకనిర్ణయాలు తీసుకుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈబీసీ నేస్తం పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్‌ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు ఆమోదించింది.
సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేబినెట్ చర్చించింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై చర్చించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈబీసీ కులాల మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదముద్రవేసింది. వచ్చే మూడేళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈ పథకం ద్వారా రూ.45వేలు అందించనున్నారు. రాజధాని పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఏకు రూ.3 వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
వైఎస్‌ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప జిల్లాలో 2 పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చించారు. కడప జిల్లా కొప్పర్తి గ్రామంలో 598.59 ఎకరాల భూమి మెగా ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుపై మంత్రివర్గంలో ప్రతిపాదనకు వచ్చింది. కడప జిల్లా అంబాపురం గ్రామంలో మరో మెగా ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు 93.99 ఎకరాల కేటాయించే అంశంపైనా చర్చించారు. ఈ భూమిలను ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి ఉచితంగా ఇచ్చే అంశంపై మంత్రులు చర్చించారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 3148 ఎకరాల భూమిని ఎకరం రూ.1.65 లక్షలకు విక్రయించే అంశంపై కెబినెట్ చర్చించింది.
తూర్పుగోదావరి జిల్లా కొన గ్రామంలో 165.34 ఎకరాల భూమిని ఏపీ మారీటైమ్ బోర్డుకి ఎకరం 25 లక్షల చొప్పున విక్రయించే అంశం ప్రతిపాదనలపై చర్చ జరుగింది. కాకినాడ ఎస్ఈజెడ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్ట పరిహారాన్ని ఖరారు చేసే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కమిటీ సూచించిన నష్ట పరిహారం కంటే ఎక్కువగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఎస్ఈజెడ్ పరిధిలో ఆరు గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది.
ఆయుస్మాన్ పధకం లో భాగంగా పాఠశాల హెల్త్ మరియు వెల్నెస్ ప్రోగ్రామ్ 24 నుండి వర్చువల్ మోడ్ లో జరుగుతుంది. దీనికి అన్ని యాజమాన్యం లోని ఉపాద్యాయులు ఓక్కోక్క కి చొప్పున హాజరవవలసిందిగా ఉత్తర్వులు.
జోన్ 1లో విశాఖపట్నం జిల్లా ప్రాంతీయ సంచాలకులు RJD గారు We Love Reading' & 'India Toy Fair పై వెబ్ మీటింగ్ ఈ రోజు 11 గం. కు నిర్వహిస్తున్నారు. అందరు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం లో పాల్గొనాలి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం - 1984 - సేవ్ చేసిన ఫండ్ కమ్యూనికేషన్స్ ఆఫ్ టేబుల్స్ పై సవరించిన వడ్డీ రేటు (7.1% p.a) 01-07-2020 నుండి 30-09-2020 వరకు కాలానికి పొదుపు నిధికి ప్రయోజనాలు సవరించిన పట్టికలు
మునిసిపల్ merging కేసు dismiss అయి ఇపుడు relieve అవుతున్నటీచర్ల places కోసం appeal చేసుకున్న వారికి CSE నుంచి తాజా ఉత్తర్వులు.
మార్చి మొదటి వారం నుంచే కేసులు పెరిగే అవకాశం.మళ్లీ కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని సూచన
మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ మొదలైంది. ముంబైలో అయితే మాస్కులు లేకుండా తిరిగేవాళ్లకు జరిమానాలు కూడా విధిస్తున్నారు. కేరళ, కర్ణాటకలో కొత్త కేసులు భయపెడుతున్నాయి. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అంటే దేశంలో సెకండ్ వేవ్ మొదలైందా..? సెకండ్ వేవ్‌తోపాటు కొత్త స్ట్రెయిన్ కూడా కలిసొస్తే.. పరిస్థితి ఏమిటి? మళ్లీ లాక్‌డౌన్.. కఠిన ఆంక్షలు.. అమ్మో తలచుకుంటేనే భయంగా ఉంది కదూ! అందుకే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాదిలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతుండడంతో.. దక్షిణాది రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను హెచ్చరించింది. మొదటి విడతలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. కాబట్టి రాష్ట్రంలో మళ్లీ కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం, వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమయ్యాయి. కరోనా పర్యవేక్షణ కోసం నియమించిన కొవిడ్-19 నిపుణుల కమిటీ శుక్రవారం అత్యవసరంగా భేటీ అయింది. ఆరోగ్యశాఖ అధికారులు ఎపిడిమాలజీ నిపుణులతో కూడా చర్చించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో కరోనా పరిస్థితి, ఏపీలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులపై చర్చించారు.
కరోనాపై అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. ఆస్పత్రులను, రోగులకు అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. కలెక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఎక్కడా అలసత్వం ప్రదర్శించొద్దన్న సంకేతాలిస్తున్నారు. వాస్తవానికి నిపుణుల కమిటీ సభ్యులు గతంలోనే జనవరి 15 నుంచి మార్చి 15 వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిసెంబరు తర్వాత కొవిడ్ నిబంధనలు పాటించకపోతే సెకండ్ వేవ్‌ను తట్టుకోవడం కష్టమని హెచ్చరించారు. కానీ ప్రభుత్వం ఆ సూచలను పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కరోనా నిబంధనలు అమలు చేయడంలేదు. దీంతో సెకండ్ వేవ్ ప్రమాదం తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రస్తుతం రోజుకు వంద లోపు కేసులు నమోదవుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వీటి సంఖ్య వేలల్లో ఉంటుంది. కొన్ని ల్యాబ్‌లు, ఆస్పత్రులు పాజిటివ్ వచ్చినా సమాచారం ఇవ్వడం లేదు. ప్రముఖ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరిగిపోతున్నాయి. ఇవేవీ ఆరోగ్యశాఖ లెక్కల్లోకి రావడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా బులెటిన్‌లో తక్కువ కేసులు చూపిస్తూ.. ఏపీలో కరోనా తీవ్రత లేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూడు నెలల వ్యత్యాసంతో మళ్లీ.
తొలి విడతలో ఉత్తర భారతంలో మొదలైన కరోనా వైరస్ దక్షిణ భారతానికి వ్యాపించడానికి 3-4 నెలల సమయం పట్టింది. సెకండ్ వేవ్ కూడా ఇదే తరహాలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి రావాలంటే మూడు నెలల సమయం పడుతుందని నిపుణుల కమిటీ గతంలోనే అంచనా వేసింది. ఇప్పుడు ఆ అంచనాలు దాదాపు నిజం కాబోతున్నాయి. ఏపీలో నవంబరు చివరి వారం నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయి. నిపుణుల కమిటీ అంచనా వేసినట్టే.. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి.
ఆ ప్రకారం చూస్తే మార్చి నెలలో ఏపీలోనూ సెకండ్ వేవ్ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.
కొత్త స్ట్రెయిన్ వస్తే మరిన్ని కష్టాలు
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ చేశారు. వారికి అందించిన టీకా మొదటి విడత వైర్‌సను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. అయితే.. సెకండ్ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్ వస్తే ఇప్పుడు వేయించుకున్న వ్యాక్సిన్ పనిచేస్తుందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిపుణుల కమిటీ కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఒకవేళ సెకండ్ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్ కూడా బయటపడితే మాత్రం ప్రభుత్వానికి భారం తప్పదు. వైరస్ ట్రేసింగ్, టెస్టింగ్ తలకు మించిన భారంగా మారుతుంది. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా కరోనాను గుర్తిస్తున్నారు. కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించాలంటే ఈ టెస్టు సరిపోదు. దానికోసం శాంపిల్స్‌ను హైదరాబాద్, పుణెకు పంపించాల్సిందే. లేదంటే కొత్త స్ట్రెయిన్ గుర్తించే కిట్లు కొనుగోలు చేయాలి. ఇప్పటికే కొవిడ్ వ్యాప్తి నియంత్రణ, మందుల కొనుగోళ్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసిన ప్రభుత్వానికి ఇది తలకుమించిన భారమే. కొవిడ్‌కు సంబంధించిన బిల్లులే ఇంతవరకు చెల్లించకుండా రూ.400 కోట్లు బకాయిలు పెట్టుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ వస్తే మాత్రం మళ్లీ ఆర్థిక కష్టాలు తప్పవని ఆరోగ్యశాఖ అధికారులే చెబుతున్నారు.
పాఠశాల విద్య లో నూతన విద్యా విధానం పై లైవ్ వీడియో కార్యక్రమం ఉదయం 11గం. ల నుండి ప్రారంభం.
FINAL UPDATED (22-2-2021) INCOME TAX SOFTWARE 2020-21 for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners prepared by K.S.NAIDU.
2020-21 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
Click Here To Download Income Tax Software 2020-21
ఆదాయపు పన్ను శాఖ వారు అపీషియల్ గా మీ టాక్స్ బుల్ ఇన్కం పై ఎంత టాక్స్ పడుతుంది తెలుసుకోవడానికి ఒక లింకు ను ఇవ్వడము జరిగింది.
Click Here To Check Your Income Tax
➡ మీ మొబైల్ లో income tax software ను ఏవిధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఈ క్రింద ఇచ్చిన వీడియోను చూడండి.
ఉపాధ్యాయులు తమ యొక్క ఆదాయపన్ను ఫారం-16 నింపడానికి వీలుగా వారి యొక్క వివరాలను నమోదు చేయడానికి వీలుగా ఒక MODEL application form ను PDF లో తయారు చేయడం జరిగింది.
Click here to Download Blank Form16 Proforma
Click Here To Download for single application
మీ మొబైల్ లో income tax software ఓపెన్ చేయడం కోసం WPS OFFICE అనే app ఇన్స్టాల్ చేసుకోండి. దానికి సంబంధించిన లింకు క్రింద ఇస్తున్నాను.
👉 DOWNLOAD WPS CLICK HERE
జనవరి 2021 నెలలో బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయని ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ ద్వారా నోటీసుల షో కాజ్ నోటీసులు జారీ.
జాతీయ ఉపకార వేతన పరీక్ష, రాష్ట్రస్థాయి ప్రతిభాన్వేషణ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల హాల్ టికెట్లను సిద్ధం చేసినట్ల ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Click Here To Download NMMS&NTSE HALL TICKETS
హాల్ టికెట్లు www.bse.ap.gov.in వెబ్ సైట్ నుంచి ఈ నెల 20వ తేదీలోపు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
హెడ్మాస్టర్లు వారి స్కూలు ఎస్సెస్సీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి విద్యార్థుల హాట్‌కెట్లను డౌన్లోడ్ చేయించాలన్నారు.
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర స్కూళ్ల వారు వారికి కేటాయించిన స్కూల్ కోడ్ ను వినియోగించి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
STUDENT ATTENDANCE APP updated on 17-2-2021 version 1.1
Click Here To Download STUDENTS ATTENDANCE App link
User Name : Dise Code
Password : Child Info Password
లాగిన్ అవగానే చివరలో DATA sync Tab ని క్లిక్ చేయగానే మన పాఠశాల యొక్క రోల్ మీడియం వారీగా చూపిస్తుంది.
కింది లింక్ ను క్లిక్ చేసి మీ జిల్లా, మండలం, పాఠశాల, తేదీని సెలెక్ట్ చేసుకుని, Go పైన క్లిక్ చేయండి. జగనన్న గోరుముద్ద డ్యాష్ బోర్డ్ లో మీ వివరాలు IMMS App ద్వారా sync అయ్యాయో లేదో చూసుకోండి.
జిల్లాలో గల అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు మరియు గౌరవ మధ్యాహ్న భోజనం పథకం డైరెక్టర్ గారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకం మధ్యాహ్న భోజన పథకం మరియు స్కూల్ శానిటేషన్. దీనిని IMMS DASHBOARD ద్వార రోజువారీ రివ్యూ చేస్తున్నారు.
కాబట్టి మధ్యాహ్న భోజన పథకము నకు సంబంధించి ప్రతిరోజు అందరు ప్రధానోపాధ్యాయులు దిగువ తెలిపిన అన్ని పనులు తప్పనిసరిగా చేయవలెను.
INSTRUCTIONS TO HMs
పాఠశాల కు హాజరైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రాప్తికి తప్పనిసరిగా భోజనం అందించవలెను. అందుకు అవసరమైన గుడ్లు మరియు చెక్కీలు సంబంధిత సరఫరాదారు నుండి పాఠశాలలో స్టాక్ ఉండేవిధంగా ముందుగానే తెప్పించుకొని ఉండవలెను. ఎట్టి పరిస్థితుల్లోనూ మెనూ ప్రకారం మాత్రమే భోజనం పెట్టవలెను.
MEALS TAKEN DETAILS ENTRY IN JAGANANNA GORUMUDDA(MDM) AND IMMS APPs
1. మధ్యాహ్న భోజనం వివరాలను జగనన్న గోరుముద్ద(MDM) మరియు IMMS యాప్ లలో తప్పనిసరిగా విధి గా నమోదు చేయవలెను.
2. యాప్ లో వివరాలు నమోదు చేసేటప్పుడు భోజనం చేసే విద్యార్థులు వారికి సమానంగా గుడ్లు మరియు చెక్కిలు(ఉన్నరోజు) వివరాలు కూడా ఖచ్చితంగా ఎటువంటి వ్యత్యాసం లేకుండా నమోదు చేయవలెను. ఈ విషయంలో లో ఎటువంటి వ్యత్యాసాలు గుర్తించినట్లు అయినా దీనికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించవలసి ఉంటుంది.
INSPECTIONs IN IMMS APP
A) Headmasters
ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు IMMS యాప్ లో తప్పనిసరిగా జగనన్న గోరుముద్ద మరియు స్కూల్ శానిటేషన్ inspection from నింపి ఇన్స్పెక్షన్ చేసి సబ్మిట్ చేయవలెను.
B) PMC COMMITTEE
అదేవిధంగా పాఠశాలలో గల తల్లిదండ్రుల కమిటీ కూడా తప్పనిసరిగా మధ్యాహ్న భోజన పథకం మరియు స్కూల్ శానిటేషన్ ఇన్స్పెక్షన్ ను ప్రతి రోజూ చేసే విధంగా ప్రధానోపాధ్యాయులు వారికి తెలియజేయవలెను.
C) WELFARE/WARD EDUCATION ASSISTANT
పాఠశాలకు కేటాయించబడిన వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేక వార్డ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారంలో మూడు రోజులు సోమవారం, బుధవారం, శుక్రవారం, పాఠశాలకు వచ్చి IMMS APP లో తప్పనిసరిగా ఇన్స్పెక్షన్ చేసే విధంగా సంబంధిత వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు తెలియజేయగలరు.
D) VILLAGE ORGANIZER
అదేవిధంగా గా మీ పాఠశాలకు కేటాయించబడిన విలేజ్ ఆర్గనైజర్ కూడా IMMS APP లో వారంలో మూడు రోజులు మంగళవారం, గురువారం, శనివారం, మీ పాఠశాలను సందర్శించి తప్పనిసరిగా యాప్ లో ఇన్స్పెక్షన్ చేసే విధంగా కోరగలరు.
పై అన్ని అంశాలు చాలా ముఖ్యం గా భావించి అందరు ప్రధానోపాధ్యాయులకు విధిగా అనుసరించవలసినదిగా కోరడమైనది.
అందరూ ఉప విద్యాశాఖ అధికారులకు మరియు మండల విద్యాశాఖ అధికారులకు తెలియజేయునది ఏమనగా పై అంశాలపై తమ డివిజన్ మరియు మండల పరిధిలోగల అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విధిగా అన్ని సూచనలు పాటించే విధంగా తగు ఆదేశాలు జారీ చేసి IMMS డాష్ బోర్డు ( http://jaganannagorumudda.ap.gov.in/MDM/MDMDashBoardNew.aspx ) ఈ లింక్ ద్వారా ప్రతిరోజు రిపోర్ట్ చూస్తూ ఏ ప్రధానోపాధ్యాయులు అయితే పై విషయాలను పాటించడంలేదో గుర్తించి వారికి తగు ఆదేశాలు జారీ చేసి తప్పనిసరిగా అందరూ విధిగా మధ్యాహ్న భోజనం మరియు స్కూల్ శానిటేషన్ పాఠశాలలో అమలు పరిచే విధంగా చూడవలసిందిగా కోరడమైనది.
వారానికి మూడు సార్లు ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ అసిస్టెంట్ పాఠశాలను సందర్శించి MDM& SANITATION Inspection డేటాను IMMS ఆప్ నందు నమోదు చేయాలి.
విశాఖపట్నం జిల్లా లో 3 వ ఫేజ్ ఎలక్షన్ డ్యూటీ పడిన వారు వారి యొక్క ఐడి నెంబర్ తో వారికి బస్సులు ఎక్కడ నుంచి బయలుదేరుతాయో తెలుసుకోవచ్చు.
APHRDI వారి ద్వారా ఫిబ్రవరి 15న ఉదయం 11:00 AM నుంచి 1 వరకు ESR గురించి శిక్షణ యూట్యూబ్ లింకు ద్వారా ఇవ్వడము జరిగింది.
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
మార్చి 10వ తేదీన ఎన్నికలు
మార్చ్ 14 న ఓట్ల లెక్కింపు
12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు
నిష్ఠా ఆన్లైన్ ప్రోగ్రాం లో 18 మాడ్యూల్స్ కోర్సులలో కొన్ని మాడ్యూల్స్ పూర్తి చేయని వారి పేర్లను పెండింగ్ లిస్ట్ లో పెట్టారు వారి వివరాలు.జిల్లాలు& మండలాల వారీగా.
ఎవరైతే NISHTHA COURSE కంప్లీట్ చేశారో,ఎవరైతే 18 మాడ్యుల్ పూర్తి చేశారో , యే మాడ్యుల్ సర్టిఫికేట్ రాలేదో వారందరూ ఫైనల్ సర్టిఫికేట్ కోసం (NISHTHA final certificate ) గూగుల్ ఫామ్ fillup చేసి పంపండి.
Click Here To Submit Your Details For Final Certificate
పీఓ హ్యాండ్ బుక్ లో గల వివిధ ఫారాలు, అనెగ్జర్స్ నంబర్స్ మరియు పేజీ నంబర్స్
I )In Brown colour cover :
(Brown for neither Statutory nor Non Statutory)
1. బ్యాలెట్ పేపర్ అకౌంట్
అనెగ్జర్ : 22 ; ఫామ్. : XXV(25) ; పేజీ నంబర్స్ : 102 &103
2. పీఓ డిక్లరేషన్
అనెగ్జర్ : 11; పేజీ నంబర్స్ : 89 - 90 & 91
3. పేపర్ సీల్ అకౌంట్
అనెగ్జర్ : 10. పేజీ నంబర్ : 88
4. పీఓ డైరీ
అనెగ్జర్ : 23 ; పేజీ నంబర్స్ : 104-105 & 106
5. విజిట్ షీట్
అనెగ్జర్ : 9 ; పేజీ నంబర్ : 87
II) In Green colour cover :
(Green for Statutory)
1. టెండర్ ఓట్ల జాబితా
అనెగ్జర్ : 21 ; ఫామ్ : XXIV(24)
2. ఒక మార్క్ డ్ కాపీ
3. వాడని బ్యాలెట్ పేపర్స్ సంతకం లేనివి, కౌంటర్ ఫాయిల్ తో సహా
4. వాడని బ్యాలెట్ పేపర్స్ సంతకంతో ఉన్నవి, కౌంటర్ ఫాయిల్ తో సహా
5. కేన్సిలైన బ్యాలెట్ పేపర్స్
6. హింస వల్ల కేన్సిలైన బ్యాలెట్ పేపర్స్
7. వాడిన బ్యాలెట్ పేపర్ల కౌంటర్ ఫాయిల్స్,
8. టెండర్ బ్యాలెట్ పేపర్స్ తో సహా
III) In Yellow cover :
(Yellow for Non-Statutory)
1. మార్క్ డ్ కాపీలు 2 / 3
2. పాడైన/వాడని సీల్స్
3. నిరక్షరాస్యుల/అంధుల/బలహీనుల ఓటర్ల జాబితా
అనెగ్జర్ : 18 ; ఫామ్ : XXIII(23)
4. ఛాలెంజ్ ఫీజు రశీదు :
అనెగ్జర్ : 14. ; పేజీ నంబర్ : 94
5. వయస్సు డిక్లరేషన్ :
అనెగ్జర్ :15,16. ; పేజీ నంబర్స్ :95,96
6. సహాయకుని డిక్లరేషన్
అనెగ్జర్. : 17 ; ఫామ్. : XXII(22) ; పేజీ నంబర్ : 97
7. ఛాలెంజ్డ్ ఓట్ల జాబితా
అనెగ్జర్ : 13 ; ఫామ్. : 11 ; పేజీ నంబర్ : 93
8. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్
అనెగ్జర్ : 20 ; ఫామ్ : XVI(16) ; పేజీ నంబర్ :100
9. ఏజెంట్ నియామక పత్రాలు
అనెగ్జర్ : 7 ; ఫామ్ : XII(12) ; పేజీ నంబర్ : 85
IV)In Blue cover :
(Blue for Non-Statutory) :
No paper documents Only Item materials :
1. పీఓ హేండ్ బుక్
2. ఇంక్
3. ఇంక్ ప్యాడ్
4. మెటల్ సీల్
5. స్వస్తిక్ రబ్బరు స్టాంప్
6. డిస్టింగ్విష్ రబ్బరు స్టాంప్
V) In White cover :
(White for Non-Statutory)
మిగిలి పోయిన ఎన్నికల సామాగ్రి అంతా వైట్ కవర్ లో ప్యాక్ చేయాలి.
We love reading కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు జరుగుతున్న sunday story time లో క్రింద తెలిపిన గూగుల్ లింక్ లో మీ హాజరు నమోదు చేయవలెను.
June-2021 SSC వారికి 6 సబ్జెక్టు్లు 7 పేపర్ ల తో పరీక్షలు.ప్రభుత్వ ఉత్తర్వులుG.O 8 జారీ (Telugu,Hindi,Eng,Maths,PS,BS,SS)
PS&BS పరీక్ష లు 50 గరిష్ఝ మార్కులకు,మిగిలిన 5 పేపర్ల కు100 గరిష్ట మార్కులకు పరీక్ష.
ఈ 7 పేపర్ల SSC పరీక్ష విధానము 2021 Regular & Advanced Supplementary Exams కే పరిమితము.
దేశ వ్యాప్తంగా ఈనెల 23 నుంచి 26 వరకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ హాల్ టికెట్లను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టిఏ) తన వెబ్ సైట్లో పొందుపరిచింది. ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోగలరు.
Click Here To Download Admit Card
సూచనలు:
పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం మరియు సానిటేషన్ లను మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం IMMS అను నూతన APP Version 1.0.7 ను అందుబాటులో తీసుకురావడం జరిగింది.
Click Here to Download Updated IMMS APP
ఆయా details submit చేయు విధానం
IMMS APP లో మొదట Login కావాలి
Jagananna Gorumudda (MDM) మీద click చేయాలి
HM SERVICES మీద click చేసిన తరువాత దానిలో ఉన్న AYAH DETAILS మీద click చేసి కింది వివరాలు submit చేయాలి.
Ayah Name, Ayah Mobile Number, Ayah Aadhaar Number, IFSC Code, Bank Name, Account Number, Active :Yes /NO, JOINING DATE
అలానే HM SERVICES లో ఉన్న SCHOOL INFORMATION మీద click చేసి
HM Mobile Number,HM Aadhaar ID
SHG Name,SHG Mobile Number,SHG Aadhaar Id
ఈ వివరాలు కూడా update చేయాలి
పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైన వారికి ఎన్నికల తరువాతి రోజు OD గా పరిగణిస్తూ SEC ఉత్తర్వులు.
అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా IMMS APP లో లాగిన్ అయి శానిటేషన్ మానిటరింగ్ సిస్టమ్ (Sanitation Monitoring System)(SMS) పై క్లిక్ చేసి Data Capture పైన క్లిక్ చేసిన తరువాత టాయిలెట్స్ వివరాలు అడగడం జరుగుతుంది.
అక్కడ No.Of Boys blocks, No.Of Girls blocks అని ఉంటుంది.
వాటిలో మీ పాఠశాలలో ఎన్ని చొప్పున ఉంటే ఆ వివరాలు నమోదు చేసి Next బటన్ పైన క్లిక్ చేయాలి.
తరువాత మీరు ఎంటర్ చేసిన ప్రాప్తికి అన్నీ వివరాలుతో కూడిన ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. దాని పైన క్లిక్ చేస్తే యాడ్ డాటా (Add Data) అని వస్తుంది.
అందులో boys మరియు girls టాయిలెట్స్ వివరాలు మొత్తం నమోదు చేసి Submit చేయవలెను.
పైన చెప్పిన విదంగా అందరు ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా submit చేయవలెను. ఇదివరకు వివరాలు ఉన్నచో వాటిని అప్డేట్ చేసి సబ్మిట్ చేయవలెను.
గమనిక: మీరు ఎంటర్ చేసిన వివరాలు ఆదారంగా మాత్రమే మీ పాఠశాల కు శానిటేషన్ కు సంబందించి అవసరం అయ్యే పరికరాలు వస్తువులు కేటాయించబడతాయి గమనించగలరు.
అమ్మ ఒడి పథకానికి సంభందించి విద్యార్థుల అర్హత ను నిర్ణయించడానికి ప్రధానోపాధ్యాయుల లాగిన్ నందు క్రింది ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి.
1) re-verification of students
2) updation of bank details
3) verification of remarks given below,
(i) more than six children
(ii) ssc exam fee not paid
(iii) zero attendance last year
జిల్లాలోని అన్ని యాజమాన్యములకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు విధిగా ది.11.02.2021 లోగా పెండింగ్ grievances స్టాండర్డ్ ఆపరేటింగ్ procedure ప్రకారం పూర్తి చేయవలెను. ఆ తరువాత అమ్మ ఒడి కి సంబంధించిన ఏ విధమైన grievances అనుమతించ బడవు.
వేతన బకాయిలకు 6% వడ్డీ చెల్లించమని సుప్రీంకోర్టు తీర్పు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన బకాయిల వడ్డీ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 12% వడ్డీతో బకాయిలు చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. విచారణ జరిపిన ధర్మాసనం.. 12% వడ్డీ అనేది బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువ అవుతుంది. వేతన బకాయిలకు వడ్డీ చెల్లించాల్సిందే. కాకపోతే ఆరు శాతం వడ్డీ సరిపోతుంది. ఈమేరకు ఏపీ ప్రభుత్వం చెల్లించాలి’’ అని సుప్రీం ఆదేశించింది. కరోనా కారణంగా గతేడాది మార్చి, ఏప్రిల్‌లో ఉద్యోగులకు సగం జీతం చెల్లించిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాల తర్వాత మిగిలిన జీతాన్ని చెల్లించింది. ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కాలానికి 12% వడ్డీ చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
విశాఖపట్నం జిల్లా లో ఎన్నికలు డ్యూటీ పడిన వారు వారి యొక్క ఐడి నెంబర్ తో పోలింగ్ స్టేషన్ వివరాలు మరియు పోలింగ్ సిబ్బంది వివరాలు తెలుసుకోవచ్చు.
Click Here To Enter your Election Order id to know the team and PS.
పంచాయతి ఎన్నికలు లో పాల్గొను సిబ్బందికి ఇచ్చే పారితోషకం యొక్క వివరాలు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులు ప్రకారం
పోస్టల్ బ్యాలెట్ కొరకు పైన తెలయపరిచిన ఫామ్ ఫిలప్ చేసి మీ ఎలక్షన్ ఆర్డర్ కాపీ ని మరియు మీ ఓటర్ ఐడి జిరాక్స్ కాపీని జత చేసి మీకు ఎక్కడైతే ఓటుహక్కు ఉంటుందో అక్కడ ఎంపీడీవో గారికి పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ అందించాలి పోస్టల్ బ్యాలెట్ పై మొబైల్ నెంబర్ వేయవలెను.
మీ యొక్క CFMS ID నెంబర్ తో మీ యొక్క PAY PARTICULARS ని నెల వారీగా తెలుసుకోవడానికి క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
Click Here To Download Your Payment Details
లింక్ ని క్లిక్ చేయగానే పైన చూపిన విధంగా పేజి ఓపెన్ అవుతుంది. అందులో మన CFMS ID ని, నెల ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఆ నెలలో మనకు ఏఏ బిల్లులు చేశారో క్రింద చూపిన విధంగా పేజి ఓపెన్ అవుతుంది.
అందులో మనకు కావలసిన బిల్ నెంబర్ ను సెలెక్ట్ చేసుకుని మీ పేమెంట్ వివరాలు తెలుసుకోవచ్చు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు లో పాల్గొను సిబ్బంది పోలింగ్ ముందు రోజు నుండి పోలింగ్ పూర్తి అయిన తరువాత చేయవలసిన పూర్తి సమాచారం.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పి వో లు మరియు ఏ పీ ఓ లు అనుసరించాల్సిన విధి విధానాలు అలాగే ఓటర్ల యొక్క పోలింగ్ స్టేషన్ లో వారి యొక్క బాధ్యతలు మరియు ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్లు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనే పూర్తి సమాచారం తెలుగులో
Valid Votes మరియు Invalid Votes ను ఏ విధంగా Identify చేయాలో పూర్తి సమాచారం క్రింద ఇచ్చిన ఫైల్ లో ఇవ్వడం జరిగింది.
1 నుంచి 10 తరగతుల విద్యార్ధులకి 3 మాస్క్ లు supply చేయుట కొరకు (స్టిచ్చింగ్ charges) ఉత్తర్వులు విడుదల.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేశారు. హైకోర్టు తరలింపు అంశంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధామనిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలించాలని ప్రతిపాదించారని గుర్తుచేశారు. హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపుల తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని, హైకోర్టు పరిపాలన బాధ్యతలు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని పేర్కొన్నారు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు.న్యాయస్థానం తరలింపు కోసం ఎలాంటి గడువూ లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. తరలింపు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్నారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలిస్తున్నారా అన్న జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కి సంబంధించి అందరు ఉపాధ్యాయులు లైవ్ వీడియో చూసిన తర్వాత క్రింద ఇచ్చిన గూగుల్ పామ్ నింపాలి.
https://forms.gle/S9BNNUzaVqdtwsmy8
Training Time 04.02.2021
The Pre and Post test Assessment tool link as follows pl fill the pre and post test proforma immediately.Pre & Post assessment tool 11 am to 4:30pm. Director,SCERT,AP
ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల మొక్క టైమ్ టేబుల్ ను విడుదల చేయడం జరిగింది.
Primary 9-00 to 3-30
UP. 9-00 to 4-00
High school 9-00 to 4-00 pm
Rc.No.151/A&I/2020 Date
నాడు- నేడు, గోరుముద్దపై అధికారులతో సీఎం సమీక్ష పూర్తి వివరాలు
ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి ‘నాడు- నేడు’ కార్యక్రమం రెండో విడతకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. ‘నాడు- నేడు’ కార్యక్రమంతోపాటు ‘గోరుముద్ద’పై క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నాడు - నేడు మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా రెండో విడత ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. రెండో విడత పనులను ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. డిసెంబర్ 31లోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేసుకున్నట్లు వివరించారు. రెండో విడత కోసం సుమారు రూ.4,446 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొదటి విడత కోసం సుమారు రూ.3,700 కోట్లు ఖర్చు చేస్తున్నదని, పాఠశాలను బాగుకు ఒక్క ఏడాదిలో ఇంత డబ్బు ఖర్చు చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
పాఠశాల పునఃప్రారంభం, విద్యార్థుల హాజరుపై అధికారుల నుంచి సీఎం జగన్ వివరాలు కోరారు. పిల్లల హాజరుపై యాప్‌ను రూపొందించారా? లేదా? అని ప్రశ్నించగా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి విద్యార్థుల హాజరుపై యాప్ ద్వారా వివరాలు సేకరిస్తామని అధికారులు బదులిచ్చారు.
విద్యార్థులు గైర్హాజరయితే వారి తల్లిదండ్రులకు సందేశం వెళ్లాలని, రెండో రోజు నేరుగా వలంటీర్‌ను పంపి వివరాలు తెలుసుకోవాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గోరుముద్దపై సమీక్ష అనంతరం ‘జగనన్న గోరుముద్ద’ కార్యక్రమంపై కూడా సీఎం జగన్ సమీక్షించారు.
గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలు చేయాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణపై కూడా సీఎం సమీక్షించారు. టాయిలెట్ల నిర్వహణకు సులభ్ ఇంటర్నేషనల్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. నిర్వహణ కోసం దాదాపు 49 వేల మంది సిబ్బంది అవసరమని, టాయిలెట్ల నిర్వహణపై ఎస్‌ఓపీ టాయిలెట్ నిర్వహణ సిబ్బందికి సులభ్ ఇంటర్నేషనల్ శిక్షణ ఇస్తుందని సీఎం జగన్ అధికారులకు వివరించారు.
ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్( ఏడు పేపర్లు) :
జూన్ 7(సోమవారం) : ఫస్ట్ లాంగ్వేజ్
జూన్ 8( మంగళవారం) : సెకండ్ లాంగ్వేజ్
జూన్ 9(బుధవారం) : ఇంగ్లీష్
జూన్ 10(గురువారం) : గణితం
జూన్ 11 (శుక్రవారం) : ఫిజికల్ సైన్స్
జూన్ 12 (శనివారం) : బయోలాజికల్ సైన్స్
జూన్ 14( సోమవారం) : సోషల్ స్టడీస్
జూన్ 15 ( మంగళవారం) : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
ఓఎస్‌ఎస్‌సీ మేయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
జూన్ 16 ( బుధవారం ) ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు(థియరీ)
Resource persons for material preparation for Orientation of New Textbooks from class 1st to 6th.Teachers who are interested to participate in the material preparation can apply now.
Click Here To Submit Google Form for Resource Person
AP Samagra Shiksha-New Education Policy-2020 -Teacher Trainings on New Text Books for smooth classroom instruction by Primary Teachers in the State under Learning Enhancement Programme (LEP) via ONLINE MODE.
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు లో సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్స్ కి కేటాయించే గుర్తులను ఎన్నికల కమీషన్ వారు విడుదల చేయడం జరిగింది.
Click Here To Submit Your NISHTHA Training Status
ఎవరైతే NISHTHA COURSE కంప్లీట్ చేశారో,ఎవరైతే 18 మాడ్యుల్ పూర్తి చేశారో , ఏ ఏ మాడ్యూల్ సర్టిఫికేట్ రాలేదో వారందరూ ఫైనల్ సర్టిఫికేట్ కోసం(NISHTHA FINAL CERTIFICATE ) క్రింది గూగుల్ ఫామ్ పూర్తి చేసి పంపవలెను.
As per message of Director SCERT,you are instructed to participate in Training on 'SCHOOL HEALTH PROGRAMME' daily through the web link from 11 AM to 5 PM on 02.02.2021 to 04.02.2021 without fail.The secretary and Director of School education will also attend this programme
AP లో ఇంటర్ మీడియేట్ పరీక్ష లకు సంబంధించి టైమ్ టేబుల్ ను విడుదల చేయడం జరిగింది. తేది 5-5-2021 నుండి ఉదయం 9 నుండి 12 వరకు పరీక్షలు జరుగును.
బడ్జెట్ హైలెట్స్.
80మిలియన్ జనాభా కు ఉచిత గ్యాస్ కనెక్షన్.
ఆత్మ నిర్భర్ భారత్ కు 21.17లక్షల కోట్లు..
100 దేశాలకు కరోనా టీకాల పంపిణీ..
ప్రధాన మంత్రి గరీభ్ కళ్యాణ లక్ష్మీ కి 2.75లక్షల కోట్లు...
ఆరోగ్య రంగానికి 64,180కోట్ల తో ఆరోగ్య రంగానికి ప్రత్యేక నిధి..
ఆత్మనిర్భర భారత్ కోసం జీడీపీ లో 13శాతం మించి ఖర్చు..
కాలం తీరిన వాహానాలు ఇక తక్కు కిందే...వ్యక్తి గత వాహానాలకు 20ఏళ్ళు ,కమర్షియల్ వాహానాలలకు 15ఏళ్ళ కాలపరిమితి...
దేశ వ్యాప్తంగా 500నగరాలలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు..
కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 35 వేల కోట్లు కేటాయింపు..
బడ్జెట్ లో ఆరోగ్యానికి పెద్ద పీట వేయడం తో లాభాల్లో ఫార్మా స్టాక్ మార్కెట్.
ఆదాయపు పన్ను చెల్లించే వారికి దక్కని ఊరట.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది . 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఐటీ రిటర్న్ దాఖలుకు మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించారు . పింఛను , వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది . కేంద్రం తాజా నిర్ణయంతో పింఛను , వడ్డీతో జీవించే వారికి ఐటీ రిటర్న్ దాఖలు నుంచి మినహాయింపు లభించింది . ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు . దీంతో పన్ను చెల్లింపు దారులను కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసింది . పన్ను వివాదాల నివారణకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు . రూ . 50 లక్షల లోపు ఆదాయం , రూ .10 లక్షల లోపు వివాదాలు ఉన్నారు నేరుగా కమిటీకి అప్పీల్ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ప్రకటించింది .