6 వారాల్లోగా ఉద్యోగమివ్వాలి.కారుణ్య నియామకంలో హైకోర్టు కీలక తీర్పు
ఆరు వారాల్లోగా కారుణ్య నియామక ఉద్యోగమివ్వాలని ఓ కేసులో హైకోర్టు తెలిపింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి కనబడటం లేదని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయానికి ఆ ఉద్యోగికి ఏడేళ్ల సర్వీస్ మిగిలుంటేనే ఆయన వారసులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందేందుకు అర్హులనే చట్ట నిబంధన రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ మేరకు ఇటీవల జస్టిస్ బి.దేవానంద్ తీర్పు చెప్పారు.
ఆ నిబంధన మేరకు ఏడేళ్ల సర్వీస్ మిగిలి లేదనే కారణంతో కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద విద్యుత్ శాఖ ఉద్యోగం ఇవ్వకపోవడాన్ని శ్రీనివాసరావు దాఖలు చేసిన రిట్లో ఈ తీర్పు వెలువడింది. పిటిషనర్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని ఆరు వారాల్లోగా అర్హతకు తగిన పోస్టులో నియమించాలని ఆ శాఖను ఆదేశించారు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ సెంటర్ లో అటెండర్ గా చేసే టి.సుబ్బారావు 2001ఆగస్టు 26 నుంచి కనిపించడం లేదని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆచూకీ తెలియలేదని, ఆ తర్వాత ఏడాది అక్టోబరులో పోలీసులు తేల్చారు. దీంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఆయన కొడుకు శ్రీనివాసరావు దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు నాటికి సుబ్బారావుకు ఏడేళ్ల సర్వీస్ మిగిలి లేదని, 1999లో రాష్ట్రం ఇచ్చిన జిఓ 378 ప్రకారం ఆయన దరఖాస్తును విద్యుత్ శాఖ తోసిపుచ్చింది. ఆ జిఓ రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని 2012లో శ్రీనివాసరావు హైకోర్టులో రిట్ వేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ... ఒక ఉద్యోగి మరణిస్తే ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం కారుణ్య నియామకం అవుతుంది. ఇది వెంటనే చేసే ప్రభుత్వం తప్పిపోయిన ఉద్యోగి చనిపోయినట్లుగా నిర్ధారించేందుకు ఏడేళ్లు సమయం కావాలని జిఓ చెప్పడం వివక్షే అవుతుంది. ఇంటి పెద్ద అయిన ఉద్యోగి కనబడకుండా పోతే మానవీయ కోణంలో సానుభూతితో సమస్యను చూడకుండా ఏడేళ్ల ఆంక్ష విధించడం చట్ట వ్యతిరేకం, ఆ కుటుంబ మానసిక క్షోభను ప్రభుత్వం పరిగణించకుండా జిఓ ఇచ్చింది. జిఓ ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు తీర్పులో పేర్కొంది.
No comments:
Post a Comment