వేతన బకాయిలకు 6% వడ్డీ చెల్లించమని సుప్రీంకోర్టు తీర్పు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన బకాయిల వడ్డీ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 12% వడ్డీతో బకాయిలు చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. విచారణ జరిపిన ధర్మాసనం.. 12% వడ్డీ అనేది బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువ అవుతుంది. వేతన బకాయిలకు వడ్డీ చెల్లించాల్సిందే. కాకపోతే ఆరు శాతం వడ్డీ సరిపోతుంది. ఈమేరకు ఏపీ ప్రభుత్వం చెల్లించాలి’’ అని సుప్రీం ఆదేశించింది. కరోనా కారణంగా గతేడాది మార్చి, ఏప్రిల్‌లో ఉద్యోగులకు సగం జీతం చెల్లించిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాల తర్వాత మిగిలిన జీతాన్ని చెల్లించింది. ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కాలానికి 12% వడ్డీ చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment