APTF VIZAG: 1 నుంచి 7వ తరగతి వరకు సీబీఎస్‌ఈ.2021-22 నుంచి కొత్త విధానం.‘నాడు-నేడు’ సమీక్షలో సీఎం జగన్‌.పనులు మార్చి చివరికి పూర్తవ్వాలి.. మొదటిదశ ‘నాడు-నేడు’కిదే డెడ్‌లైన్‌

1 నుంచి 7వ తరగతి వరకు సీబీఎస్‌ఈ.2021-22 నుంచి కొత్త విధానం.‘నాడు-నేడు’ సమీక్షలో సీఎం జగన్‌.పనులు మార్చి చివరికి పూర్తవ్వాలి.. మొదటిదశ ‘నాడు-నేడు’కిదే డెడ్‌లైన్‌

పనుల నాణ్యతలో రాజీపడొద్దు.. ‘విద్యా కానుక’ కిట్‌లో ఇంగ్లీషు డిక్షనరీ

ఆయాలు, అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ.. 390 స్కూళ్లకు పక్కా భవనాలు

మొదటి దశ ‘నాడు-నేడు’ పనులు మార్చి నెలాఖ రు కల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎ్‌సజగన్‌ అధికారులను ఆదేశించారు. స్కూళ్లు కలర్‌ఫుల్‌గా, మంచి డిజైన్లతో ఉండాలనీ, ఇంటీరియర్‌ కూడా బాగుండాలనీ సూచించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘నాడు-నేడు’ పనులపై విద్యాశాఖ అధికారుల తో ముఖ్యమంత్రి సమీక్షించారు. ‘నాడు-నేడు’ కింద మౌలిక సదుపాయాలను మార్చిన స్కూళ్ల ఫొటోలను పరిశీలించారు.  రెండోదశ ‘నాడు-నేడు’ పనులను జగన్‌ సమీక్షిస్తూ.. వి ద్యార్థులకు ఏర్పాటు చేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలనీ, ఎత్తు కూడా చూసుకోవాలనీ స్పష్టం చేశారు. పనుల్లో ఎక్కడా నాణ్యతా లో పం రాకూడదని ఆదేశాలు జారీచేశారు. ప్రభు త్వ పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థి తి ఎక్కడా ఉండకూడదనీ, ఎక్కడైతే భవనాలు లేవో అక్కడ ఖచ్చితంగా నిర్మించాలన్నారు. ప క్కా భవనాలు లేని 390 పాఠశాలలకు వాటి నిర్మాణానికి సీఎం ఆదేశాలిచ్చారు. ‘విద్యా కానుక’ కిట్‌లో ఈసారి ఇంగ్లీషు- తెలుగు డిక్షన రీ తప్పనిసరిగా చేర్చాలని సీఎం ఆదేశించారు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాల నాణ్యతతో పోటీగా ప్రభుత్వం ఇచ్చే పాఠ్యపుస్తకాలు ఉం డాలన్నారు. ‘విద్యా కానుక’లో ఏది చూసినా కూడా క్వాలిటీ ఉండాలని, ఎక్కడా రాజీ పడొద్ద ని సీఎం స్పష్టం చేశారు.

టీచర్లకూ డిక్షనరీలు ఇవ్వాలనీ, ‘అమ్మ ఒడి’ కింద ఆప్షన్‌ తీసుకున్న విద్యార్థులకు ఇచ్చే లాప్‌టా్‌పల క్వాలిటీ, సర్వీస్‌ ముఖ్యమని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతపై సీఎం సమీక్షించారు. ఇప్పటికే 27 వేల మంది ఆయాలను నియమించినట్లు అధికారులు తెలిపారు. మార్చి మొదటి వారం లో వీరందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పరిపరాలు శుభ్రంగా ఉంచే లిక్విడ్లను అన్నీ స్కూళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు సీఎంకు వివరించారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి తల్లులు, ఎడ్యుకేషన్‌ సెక్రెటరీలు, వలంటీర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ నడుస్తోందని అధికారులు చెప్పగా.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మార్చి 15కల్లా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

2021-22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎ్‌స ఈ విధానం అమలు చేయాలని, ఆ తర్వాత నుంచి ఒక్కో తరగతి పెంచుకొంటూ 2024 విద్యా సంవత్సరానికల్లా 1 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులు ఈ విధానంలోకి రావాలన్నా రు. ఈ మేరకు అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇ వ్వాలనీ, చిన్నారులకు బోధన ఎలా చేయాలన్నదానిపై ఈ శిక్షణ ఉండాలన్నారు. ప్రతి రెండు నెలలకోసారి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలని  చెప్పారు. పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారా? లేదా ? అన్నదానితో సంబంధం లేకుండా వారు ఎం తవరకు శిక్షణ కార్యక్రమాల ద్వారా అప్‌గ్రేడ్‌ అయ్యారో పరిశీలించాలన్నార

No comments:

Post a Comment