APTF VIZAG: November 2020

The Government have deferred the payment of Salaries-Wages-Remuneration-Honorarium-Pensions for the month of March 2020 in view of the COVID19 pandemic&the circumstances as explained in detail

మార్చి,ఏప్రియల్ కి సంబంధించిన పెండింగ్ జీతాలు చెల్లింపు జీ.ఓ(GO) విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

Click Here To Download Complete GO.NO.

కోవిడ్ 19 కారణంగా వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్ 50 శాతం జీతాలను డిశంబరు, జనవరి నెలలలో చెల్లించనున్నారు. మనకు రావలసిన MARCH, APRIL నెల 50% జీతం వివరాలు 12%,14.5%,20% HRA  వారీగా పొందుపరచడం జరిగింది. 

Click Here To Download 12% HRA SALARY DETAILS

Click  Here To Download 14.5% HRA SALARY DETAILS

Click Here To Download 20% HRA SALARY DETAILS

https://drive.google.com/file/d/1bYLv1bhuJ4s206T0etg-HiTlFFEIpYxj/view?usp=sharing

NISHTHA TRAINING ON DIKSHA LINKS FOR MODULES 10,11,12.

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా మాడ్యూల్ 10,11,12 కి సంబంధించిన కోర్సు లను అందుబాటులో ఉంచడం జరిగింది. లింక్ ని క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేయగానే కోర్స్ లో జాయిన్ అవవచ్చు.

తెలుగు లో జాయిన్ అవడానికి

మాడ్యూలు 10 : సాంఘికశాస్త్ర బోధనా పద్ధతులు

Click Here To Join Module 10

మాడ్యూలు 11: భాషా బోధన

Click Here To Join Module 11

మాడ్యూలు 12 : విజ్ఞానశాస్త్రము - బోధన

Click Here To Join Module 12


ఇంగ్లీష్ లో జాయిన్ అవడానికి

MODULE 10 : AP_Pedagogy of Social Sciences

Click Here To Join Module 10

MODULE 11 : AP_Pedagogy of Languages

Click Here To Join Module 11

MODULE 12 : AP_Pedagogy of Science

Click Here To Join Module 12


 Batches are available from 01-DEC-2020

Vidya Vaaradhi -Telecast of the Video Lesons for 1 to10th classes through saptagiri Channel of Doordarshan Kendra, Vijayawada schedule from 01/12/2020 to 15/12/2020 for 11 days

దూరదర్శన్ సప్తగిరి చానెల్ లో ప్రసారమయ్యే విద్యావారధి ఆన్లైన్ వీడియో తరగతుల డిసెంబర్-2020 షెడ్యూల్ (01-12-2020 నుండి 15-12-2020 వరకు)

Click Here To Download Complete details

Nutrition Garden establishment in Schools

వ్యవసాయ శాఖకు సంబంధించిన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సహకారంతో రాష్ట్రంలో ఆవరణ కలిగిఉన్న అన్ని పాఠశాలల్లో కరివేపాకు , మునగ లతో కూడిన న్యూట్రిషనల్ గార్డెన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించిన సందర్బం లో  క్రింది ప్రొఫార్మా లో  ఆవరణ కలిగిన పాఠశాలల వివరాలను వ్యవసాయ శాఖకు అందించాలని అందరు DEO లను కోరుతూ MDM  & శానిటేషన్ రాష్ట్ర సంచాలకులు ఉత్తర్వులు జారీ చేసారు.

Click Here To Download Proforma

School MDM Rice allocation report by U. Dise Code

మన స్కూల్ కి ఏ నెల కు ఎంత రైస్ రిలీజ్ అయ్యిందో మన dise కోడ్ ఎంటర్ చేసి ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.

Click Here To A.P MDM Rice Allocation for Schools


 

Covid 19-educational institutions -furnishing of attendance of students Mapping of educational institutions -Tagging of village and ward secretaries monitoring of covid

కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా అన్ని విద్యాసంస్థలనూ మ్యాపింగ్ చేయాలని, స్థానికంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లోని  విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను ట్యాగింగ్ చేసి నమోదు చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.

Click Here To Download Proceedings 

Visakhapatnam Distict Vacency List

విశాఖపట్నం జిల్లా కు సంబంధించి అన్ని ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలో గల క్లియర్ వేకెన్సీ మరియు 8 Years వేకెన్సీ లను అందుబాటులో ఉంచారు. 

Click Here To Download Visakhapatnam  Vacency List 

COVID 19 Employees Balance 50% Salaries for The Month of March and April

కోవిడ్ 19 కారణంగా వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్ 50 శాతం జీతాలను డిశంబరు, జనవరి నెలలలో చెల్లించనున్నారు. మనకు రావలసిన MARCH, APRIL నెల 50% జీతం వివరాలు 12%,14.5%,20% HRA  వారీగా పొందుపరచడం జరిగింది. 

Click Here To Download 12% HRA SALARY DETAILS

Click  Here To Download 14.5% HRA SALARY DETAILS

Click Here To Download 20% HRA SALARY DETAILS

NISHTHA Training Module 9 Portfolio Link and Model Portfolio

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా Module 9: Pedagogy of Mathematics-గణితశాస్త్రం బోధన పై పోర్ట్ పోలియో సబ్మిట్ చేయాలి. 

Click Here To SUBMIT YOUR PORTFOLIO 9 Official Link.
మోడల్ పోర్ట్ పోలియో 9 ని అందుబాటులో కలదు. 

Demo web counciling for Teachers Transfers

బదిలీల కౌన్సెలింగ్ లో భాగంగా ముందుగా నిర్వహించే డెమో రేపు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్, పాఠశాల విద్య వారు తెలియచేయడం జరిగింది. 

Local Holidays and Optional Holidays are not exceed 4 Days

4 రోజులకు మించకుండా local/optional holidays దమాషా ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చని circular విడుదల

Teacher Grievance tab inserted in transfers website for any complaints - A Teacher can submit maximum of 3 grievances

ఉపాధ్యాయ టీచర్స్ ట్రాన్స్ఫర్ వెబ్సైట్ నందు గ్రీవెన్స్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది.మీ ట్రెజరీ ఐడి మరియు పాస్వర్డ్ తో గ్రీవెన్స్ ను సబ్మిట్ చేయవచ్చు.

Click Here To Transfers Application Grievance

NISHTHA Training Model Portfolio 9 for Module 9

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా మాడ్యూల్ 9 కి సంబంధించి మోడల్ పోర్ట్ పోలియో 9 ను అందుబాటులో ఉంచడం జరిగింది. 

Click Here To Download Model Portfolio 9

Transfers Transfers useful information For Roll Particulars and Staff Particulars

మనకు కావలిసిన పాఠశాల యొక్క online లో ఇప్పటివరకు నమోదు అయిన రోల్  particulars తరగతి వారీగా ఇక్కడ సుళువుగా ఒక్క క్లిక్ తో చూసుకోవచ్చు.

Click Here To Download Your School Roll Particulars

పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారో, వారి పేర్లతో సహా క్రింది లింక్ లో చూడవచ్చు.

Click Here To Know Staff Particulars in School


IMMS ( INTEGRATED MONITORING SYSTEM FOR MIDDAY MEALS and SANITATION) ,MDM NEW WEBSITE

జగనన్న గోరుముద్ద MDM మరియు SANITATION వివరాలను,IMMS APP ను నూతన వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. 
Click Here To NEW MDM and SANITATION WEBSITE
పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం మరియు సానిటేషన్ లను మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం IMMS అను నూతన APP Version 1.0.5 Dt 2-2-2021 ను అందుబాటులో తీసుకురావడం జరిగింది.
Click Here To Download Latest IMMS APPv1.0.2
Click Here To Download IMMS APP VERSION 1.0
ఈ APP ను ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఒక యూజర్ మాన్యువల్ రూపొందించారు.
Click Here To Download IMMS USER MANUAL 
మధ్యాహ్న భోజన పథకం కి సంబంధించిన యూజర్ మాన్యువల్ రూపొందించడం జరిగింది.
Click Here To Download MDM User Manual
సానిటేషన్  కి సంబంధించిన యూజర్ మాన్యువల్ రూపొందించడం జరిగింది.
Click Here To Download SANITATION USER MANUAL
IMMS  APP ను ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఒక వీడియో రూపొందించారు.

ప్రస్తుతం నివర్ తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సందర్భంగా తుఫానుల గురించి తెలుసుకుందాం.

తుఫానుల గురించి సవివరంగా తెలుసుకుందాం.

వాతావరణం:- భూమిని ఆవరించి ఉన్న వాయు పొరను వాతావరణం అంటారు.

ఉపరితల ఆవర్తనం:- భూమిపై నుండి అర కిలోమీటరు నుండి కిలోమీటరు ఎత్తుకు పైన తిరిగే గాలులను ఉపరితల ఆవర్తనం అంటారు.

వాతావరణ పీడనం:- ఒక ప్రదేశంలో వాయురాశి  "వాతావరణ పీడనం" అంటారు.

అధిక పీడనం:- పెద్ద మొత్తంలోగాలులు ఒకచోట గుమికూడి ఉండడాన్ని "అధిక పీడనం"  అంటారు. 

అల్ప పీడనం:- గాలి అధికంగా వేడెక్కి పైకి లేచిన చోట పల్చగా ఉంటుంది. ఈ స్థితిని "అల్పపీడనం" అంటారు. అల్ప పీడనం ఏర్పడిన ప్రదేశంలో చల్లని గాలులు వచ్చి చేరతాయి. ఆ ప్రాంతంలో సుడులు ఏర్పడతాయి. ఈ సుడుల వల్ల గాలులు వేగంగా పరిభ్రమిస్తూ చల్లబడి పెద్దపెద్ద మేఘాలు ఏర్పడతాయి. అందువలన అల్ప పీడన ప్రాంతంలో అధిక వర్షాలు కురుస్తాయి.

వాయు గుండం:- అల్పపీడన ప్రాంతాలలో గాలుల ప్రభావం అధికమైతే దానిని "వాయుగుండం" అంటారు.

తుఫాను:- వాయుగుండం బలపడితే  "తుపాను" ఏర్పడుతుంది.

గమనిక:- అల్ప పీడనాలు సముద్రంలో కాని, భూమిపై కానీ ఏర్పడవచ్చు. అయితే తుఫానులు మాత్రం సముద్రాలలోనే ఏర్పడుతాయి. అల్పపీడనం ఏర్పడిన సముద్ర ఉపరితలం వద్ద  గాలులు సుడులు తిరిగి పెద్దవిగా మారి వాయుగుండాలు ఏర్పడతాయి. వాయుగుండం బలపడి తుఫానులుగామారతాయి.

చక్రవాతం:- అల్ప పీడనం చుట్టూ అతి వేగంగా తిరిగే గాలులను "చక్రవాతం " అంటారు.

👉 చక్రవాతాలు  ప్రపంచంలో  21℅ ప్రాంతాలలో అధిక నష్టాన్ని కలిగిస్తాయి. 

👉 1970 నుండి ఉపగ్రహాల ద్వారా చక్రవాతాల వల్ల కలిగే నష్టాన్ని, ఆయా ప్రాంతాలను గుర్తిస్తున్నారు. మెక్సికో, అమెరికా, చైనా, ఫిలిప్పీన్స్, అత్యధికంగా చక్రవాతాలకు గురవుతున్న దేశాలు.

చక్రవాతాల వల్ల నష్టపోయే దేశాలలో మాత్రం బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంది.

👉 చక్రవాతాన్ని "సైక్లోన్" అంటారు. సైక్లోన్ అనేపదం కైక్లోన్ అనే గ్రీకు భాషా పదం నుండి వచ్చింది. కైక్లోన్ అనగా తిరుగుతున్న నీరు లేదా చుట్టుకున్న పాము అని అర్థం.

వేగం ఆధారంగా సైక్లోన్ల వర్గీకరణ

👉 గాలి వేగం గంటకు 31 కి.మీల కంటే తక్కువగా ఉంటే అల్పపీడన ద్రోణి

👉 గాలివేగం గంటకు 31-50 కిమీల మధ్య ఉంటే వాయుగుండం

👉  గాలి వేగం గంటకు 51-61 కిమీ‌ల వరకు మధ్య ఉంటే తీవ్ర వాయు గుండం

👉 గాలి వేగం 62-88 కి.మీల మధ్య ఉంటే తుపాను

👉 గాలి వేగం 89-118 కిమీల మధ్య ఉంటే తీవ్ర తుఫాను

👉 గాలి వేగం 119-221 కిమిల మధ్య ఉంటే అత్యంత తీవ్ర తుఫాను

👉 గాలి వేగం గంటకు 221 కిమీలు ఆ పైన ఉంటే సూపర్ సైక్లోన్

ప్రపంచంలో ప్రతి సంవత్సరం సగటున 97 తుఫానులు సంభవిస్తున్నాయి. వీటి ఉధృతి మే-నవంబరు నెలల మధ్య ఉంటుంది. వీటి ఉధృతిని బట్టి వివిధ ప్రాంతాలు/దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు.

👉 దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహా సముద్రం  -- సైక్లోన్

👉 ఉత్తర అట్లాంటిక్, మధ్య ఉత్తర పసిఫిక్, తూర్పు ఉత్తర పసిఫిక్ మహాసముద్రం -- హరికేన్లు

👉 వాయువ్య పసిఫిక్‌ మహాసముద్రం -- టైఫూన్లు

👉 అమెరికా అట్లాంటిక్ మహాసముద్రం -- టోర్నడో లు.

👉 ఆస్ట్రేలేషియా -- విల్లీ విల్లీ

👉 ఇండోనేషియా దీవులు -- బాగ్నాస్

👉 అంటార్కిటికా మంచు తుఫాన్లు -- బ్లిజార్డ్స్.

తుఫానులకు పేర్లు పెట్టే సాంప్రదాయం

👉 2000 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్‌ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్  మరియు వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. పేర్లు పెట్టడం 2004 నుండి మొదలైంది.

గమనిక: అట్లాంటిక్ మహాసముద్రం లో తుఫానులకు  పేర్లు పెట్టే సంప్రదాయం 1953 లోనే ప్రారంభించారు.

👉 ఈ గ్రూపులో ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్,పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్, దేశాలున్నాయి. 2018 లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యు.ఏ.ఈ, యెమన్ దేశాలు కూడా చేరాయి. ఈ ఏడాది 13 దేశాలు ఒక్కో దేశం 13 పేర్లను సూచించాయి. (అనగా 169 పెర్లు)

👉  ఈ ప్యానెల్ సభ్యులు ప్రతిపాదించిన పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు.  బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్

👉 ఈ ఏడాదిలో బంగ్లాదేశ్ సూచించిన నిసర్గ, ఇండియా సూచించిన గతి తుపాన్ల పేర్లు వాడారు. 2020 నవంబరు లో ఏర్పడిన తుఫానుకు నివర్ తుపానుగా ఇరాన్ నామకరణం చేసింది. 

👉 తరువాత వచ్చే తుపానులకు వరుస క్రమంలో వివిధ దేశాలు సిద్ధంగా ఉంచిన పేర్లు

మాల్దీవులు -- బురేవి

మయన్మార్ -- టౌక్టాయి

ఒమన్ -- యాస్

పాకిస్తాన్ -- గులాబ్.

JAGANANNA GORUMUDDA DRY RATION CHIKKI SUPPLY DETAILS

'జగనన్న గోరుముద్ద' డ్రై రేషన్ పంపిణీ కార్యక్రమంలో చిక్కీల పంపిణీ సక్రమంగా జరిగియుండలేదని APSSAAT ( Andhra Pradesh Society  fir Social Audit Accountability and Transparency ) వారి సామాజిక తనిఖీ ద్వారా కనుగొనినందున పాఠశాలల్లో నిర్వహించు రికార్డులను & ఫేజ్ 5 కు సంబంధించిన (12.06.2020 నుండి 31.08.2020 వరకు ) చిక్కీ బిల్స్ ను సంపూర్ణంగా MEOలతో క్రాస్ చెక్ చేయించి సదరు బిల్స్ ని రీ సబ్మిట్ చేయించాలనీ.

బిల్స్ లో ఏవైనా లోపాలు  ఉన్నయెడల వానికి  సంబంధించిన వారే బాధ్యత వహించేలా క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించాలని, అందరు DEO లను కోరుతూ MDM & శానిటేషన్ రాష్ట్ర సంచాలకులు మెమో జారీ 

Download Transfer Application with New points

బదిలీలకు స్టేషన్ పాయింట్లు పెంచుతూ సాఫ్ట్వేర్ మార్పు
స్టేషన్ పాయింట్లు పని చేసిన మొత్తం కాలానికి పెంపు
సర్వీస్ పాయింట్లు గరిష్ఠంగా 16.5 కి పెంపు
బదిలీల సాఫ్ట్వేర్ లో తాజా సవరణల ప్రకారం మార్పులు చేశారు.
Click Here To Download Application సర్వర్ 1                                           
Click Here To Download Application సర్వర్2                            
 ఉపాధ్యాయ సంఘాలతో కమీషనర్ చర్చల్లో భాగంగా స్టేషన్, సర్వీస్ పాయింట్లు పెంచడానికి ఒప్పుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు, సవరణ షెడ్యూల్ కూడా విడుదల అయ్యాయి.
దీనితో బదిలీల సాఫ్ట్వేర్ లో మార్పులు చేశారు. ఈ మార్పులు కేవలం డిఈఓ, ఎం.ఈ.ఓ లాగిన్ లలో అప్లైడ్ టీచర్స్ లిస్ట్ లో మాత్రమే కనబడుతున్నాయి. (ఉపాధ్యాయులు తమ అప్పి కేషన్ ను
డౌన్లోడ్ చేసి సరి చూసుకోగలరు - ఇంకా అపి కేషన్ లో అప్ డేట్ అవ్వలేదు).
షెడ్యూల్ లో భాగంగా 28,29 తేదీలలో డిఈఓ కార్యాలయం ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తులను ఆన్లైన్ లో వెరిఫై చేయాల్సి ఉంది.

AP cabinet Meeing Decissions

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం లో తీసుకున్న నిర్ణయాలు. 

సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో భారీ వర్షాలు, నివర్ తుపానుపై చర్చించారు. నష్టపరిహారంపై అంచనాలను డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా పరిహారం చెల్లించాలని సీఎం తెలిపారు. 40 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. జనవరి 2021 నాటికి పరిహారం చెల్లించాలని సీఎం సూచించారు. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందజేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో  అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే వివిధ ముసాయిదా బిల్లులకు ఆమోదంపై చర్చించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణం పథకాలపైనా చర్చించారు. ఉద్యోగులకు దశల వారీగా డీఏ బకాయిల చెల్లింపులతో పాటు పలు అంశాలపై చర్చ సాగింది.

నివర్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్టుగా అధికారులు సీఎంకు తెలిపారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇటీవల కాలంలో ఇంటి పన్నును సవరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొంది.ఈ మేరకు తీసుకొచ్చిన బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 25న పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

30.20 లక్షల మందికి డీ ఫాం పట్టాలు ఇవ్వనుంది ఏపీ సర్కార్ లే ఔట్ల అభివృద్ది, ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నెల 21నుండి భూముల రీ సర్వే కు కేబినెట్ అంగీకరించింది. డిసెంబర్ 8న 2.49 లక్షల మందికి గొర్రెలు, మేకలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

పెండింగు జీతాల చెల్లింపునకు ప్రభుత్వ నిర్ణయం

మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం మంత్రి కన్నబాబు వెల్లడి

కరోనా కారణంగా పెండింగులో ఉంచిన జీతాలు చెల్లించేందుకు రాష్ర్ట మంత్రి మండలి నిర్ణయించింది.  ఉద్యోగులు, పెన్షనర్లు, వివిధ క్యాడర్లలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా  మార్చి, ఏప్రిల్ నెలల్లో కోత విధించారు. ఉద్యోగులకు సగం మేర కోత విధించారు. నాలుగో తరగతి  ఉద్యోగులకు, ఇతరులకు వేర్వేరు మొత్తాల్లో కోత విధించారు.  పెన్షనర్లకు మార్చి నెల పింఛను లో సగం కోత విధంచారు. ప్రస్తుతం  ఈ పెండింగు  మొత్తాలను డి సెంబర్ , జనవరి నెలల్లో  రెండు విడతల్లో చెల్లించేందుకు రాష్ర్ట మంత్రి మండలి శుక్రవారం  ఆమోదించింది. రాష్ర్ట వ్యవసాయశాఖ  మంత్రి కురసాల కన్నబాబు  విలేకరుల సమావేశంలో ఈ  విషయం వెల్లడించారు. ఉద్యోగుల జీతాలు రూ. 2,324 కోట్లు, పెన్షన్లు రూ.880.50 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని తెలిపారు.

Two cyclones Ready to hit

డిసెంబర్‌ 2న 'బురేవి'.. 5న 'టకేటి'

 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.

డిసెంబర్‌ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. డిసెంబర్‌2న  'బురేవి తుఫాన్' తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ పై  దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు  అంచనా వేస్తున్నారు.

డిసెంబర్ 5న   మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో 'టకేటి తుఫాన్' ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్‌ 7న డిసెంబరు 7 తేదీ దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్  తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Transfers 2020 Cse ask upgraded post details

ట్రాన్స్ఫర్లు లో అప్గ్రేడెడ్ PET మరియు SA  Languages  ఖాళీలు చూపించమని కొన్ని సంఘాలు అడిగిన దరిమిలా  2009 నుంచి 2018 వరకు ఎంతమంది ప్రోమోట్ అయ్యారు , మరియు DEO పూల్ లో ఉన్న వారి వివరాలు అడిగిన పాఠశాల విద్యా శాఖా వారి ఉత్తర్వులు Click Here To Download Proceedings

RGUKT CET exam which is scheduled on 28th November is postponed for one week due to Nihar Cyclone and it is rescheduled on 5th December.

రేపు జరగవలసిన IIIT ప్రవేశ పరీక్ష తుఫాన్ కారణంగా డిశంబరు 5 కు వాయిదా వేయడం జరిగింది.



NISHTHA Training Module 9 live Video

NISHTHA శిక్షణా కార్యక్రమం లో భాగంగా ఈ రోజు మాడ్యూల్ 9 Pedagogy of Mathematics- గణితశాస్త్రం బోధన పై 6 pm to 7.30 pm లైవ్ వీడియో.క్రింది లింక్ ని క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేసి వీడియో ను చూడవచ్చు. 

https://youtu.be/U-F7jQcbGJk



Employees Smart Health Cards Edit Your Details In EHS Website

ఉద్యోగులందరికి  SMART HEALTH CARDS ప్రింట్ చేసి ఇవ్వనున్నారు, దీనికి సంభందించి ప్రతి ఒక్క ఉద్యోగి EHS కార్డ్ వివరాలను EDIT చేసుకోవాల్సి ఉంటుంది,

మన పేరు, జెండర్,మొబైల్ నెంబర్, బ్లడ్ గ్రూప్, అడ్రస్, DESIGNATION, మన లేటెస్ట్ ఫోటో అప్డేట్ చేయాలి. వివరాలు స్మార్ట్ హెల్త్ కార్డ్ లోకి వస్తాయి.

Click Here To Login EHS Website


Click Here To Login Employees EHS Website

లాగిన్ అయి మన యొక్క వివరాలను ఏవిదంగా నింపాలి అనే విషయాలను క్రింది పైల్ లో చూడగలరు. 

Distribution of Dry Ration to all Eligible Students for the Month of Sep & Oct certain instructions issued

సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలకు సంబంధించి డ్రై రేషన్ పంపిణీ గురించి తాజా ఉత్తర్వులు.

AP 10th Class Exam Papers Reduced to 6 Papers

10 వ తరగతి పరీక్ష పత్రాలు తగ్గింపు

◼AP లో పదవ తరగతి పరీక్ష పత్రాలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. 11 ప్రశ్నపత్రాలను ఆరుకి తగ్గిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

◼ఈ చర్యలు విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకుఉపకరిస్తాయని, 6 పేపర్ల విధానం వల్ల 360 ప్రశ్నలు 197 కు తగ్గుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

◼ఈ 6ప్రశ్నపత్రాలు వందేసి మార్కులకు ఉంటాయని, పేపర్ల తగ్గింపు ఈ విద్యా సంవత్సరానికి మాత్రమేపరిమితమని తెలిపింది.

NISHTHA Training Portfolio Submission status

NISHTHA Training మీరు సబ్మిట్ చేసిన పోర్ట్ ఫోలియోలు 1 నుండి 8 వరకు సబ్మిట్ అయ్యాయో లేదో దీక్ష DASHBOARD  ద్వారా మీ మొబైల్ నెంబర్ సహాయంతో స్టేటస్ చెక్ చేసుకోగలరు.

Click Here To Know Your Status


CSE Clarification About Reversion Teachers

 ఒక పాఠశాలలో ఎస్జిటి గా పనిచేస్తూ ఎస్.ఎ/పి ఎస్ హెచ్ ఎం గా ప్రమోషన్ పొంది  తిరిగి ఎస్ జి టి గా అదే పాఠశాలకు  రివర్షన్ పొంది  వారి స్టేషన్ సర్వీసును మొదటినుంచి లెక్కించాలని సిఎస్సి వారి ఉత్తర్వులు.

We love Reading 3 వ తరగతి నుండి 9 వ తరగతి విద్యార్థులలో ఫౌండేషన్ రీడింగ్ అక్షరాస్యత నైపుణ్యాలను ప్రోత్సహించడానికి "వుయ్ లవ్ రీడింగ్" (చదవదం మాకిష్టం) అనే ప్రత్యేక ప్రచారాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ విషయంలో GO RT No. 220 జారీ చేయబడింది

ఈ మిషన్ మోడ్ ప్రచారంలో పిల్లలందరికీ పాఠశాల, ఇల్లు మరియు గ్రామంలో ఆనందకరమైన వాతావరణంలో చదవడానికి వివిధ మార్గాలు అందించబడతాయి.

పాధ్యాయులు, తల్లిదండ్రులు, యువత, రిటైర్డ్ వ్యక్తులు, విద్యావేత్తలు, ఎన్జీఓఎస్ తదితరులు ఈ ప్రచారాన్ని నిర్వహించడానికి ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది.

"we లవ్ రీడింగ్" ప్రచారం నాలుగు దశల్లో అమలు చేయబడుతుంది.

1. ప్రిపరేటరీ స్టేజ్ నవంబర్ 2020, డిసెంబర్ 2020, జనవరి 2021.

2. ఫౌండేషన్ స్టేజ్ - ఫిబ్రవరి 2021, మార్చి 2021, ఏప్రిల్ 2021.

3. అధునాతన దశ - మే 2021, జూన్ 2021, జూలై 2021.

4. వాలెడిక్టరీ స్టేజ్ ఆగస్టు 2021, సెప్టెంబర్ 2021, అక్టోబర్ 2021, నవంబర్ 2021.

ప్రిపరేటరీ దశ

సమాజంలోని అన్ని స్థాయిలకు చదవడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం.  విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు నిర్వాహకులు.  విద్యార్థుల పఠన సామర్థ్యం ఆధారంగా 4 స్థాయిలుగా బేస్‌లైన్ అసెస్‌మెంట్ మరియు విభజన నిర్వహించడం.  పాఠశాల లైబ్రరీలో అందుబాటులో ఉన్న పుస్తకాలతో అన్ని తరగతి గదుల్లో తరగతి గది లైబ్రరీ / రీడింగ్ కార్నర్ ఏర్పాటు.  బుక్ బ్యాంక్ కోసం పుస్తకాల సేకరణ కోసం ర్యాలీలు నిర్వహించడం మరియు పఠనంపై అవగాహన తీసుకురావడం.  కమ్యూనిటీ రీడింగ్ సెంటర్లు మరియు కమ్యూనిటీ రీడింగ్ వాలంటీర్లను సెలవుదినాల్లో మరియు పాఠశాల సమయము తరువాత ప్రచారం చేయటానికి గుర్తించడం.  లైబ్రరీ పుస్తక పఠనం కోసం ప్రతిరోజూ ఒక వ్యవధిని ప్రత్యేకంగా నిర్వహించండి.  నెలవారీ అంచనా, నెల నిర్దిష్ట కార్యక్రమాలు (రీడింగ్ మేళా, రీడింగ్ ఫెస్ట్స్, రీడింగ్ బజ్) జనవరి 2021 చివరి వారంలో నిర్వహించబడతాయి. అన్ని సన్నాహక కార్యకలాపాలు నవంబర్ 2020 నుండి జనవరి 2021 వరకు పూర్తి కావాలి.

2. ఫౌండేషన్ స్టేజ్- ఇది  విద్యార్థులలో పఠన అలవాటు, పఠన సామర్థ్యాన్ని ప్రోత్సహించడంలో కీలకమైన దశ.  లైబ్రరీ బుక్ రీడింగ్ కోసం ప్రత్యేకమైన పఠన కాలాలను కేటాయించాలి.  కాబట్టి లైబ్రరీ పుస్తక పఠనం కోసం ప్రత్యేకంగా ఒక కాలాన్ని కొనసాగించాలి.  విద్యార్థులు ప్రత్యామ్నాయ రోజుల్లో తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలి.  పాఠశాల / కమ్యూనిటీ రీడింగ్ సెంటర్ / గ్రామంలో మాస్ రీడింగ్, క్లాస్‌రూమ్ రీడింగ్, పబ్లిక్ రీడింగ్ కార్యకలాపాలు నిర్వహించబడతాయి, తరువాత వారి పనితీరును అంచనా వేయడానికి విద్యార్థులకు పఠన పోటీలు ఉంటాయి.  కమ్యూనిటీ రీడింగ్ సెంటర్ సజావుగా పనిచేయడానికి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కమ్యూనిటీ రీడింగ్ వాలంటీర్‌ను కనుగొని ట్యాగ్ చేయాలి.  నెలవారీ అంచనా, నెల నిర్దిష్ట కార్యక్రమాలు (రీడింగ్ మేళా, రీడింగ్ ఫెస్ట్స్, రీడింగ్ బజ్) ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 2021 చివరి వారంలో నిర్వహించబడతాయి. పాఠశాలలు పూర్తి రోజు 2 కాలానికి పనిచేస్తే లైబ్రరీ పుస్తక పఠనం కోసం కేటాయించాలి  GO RT No. 220 లో పేర్కొనబడింది. అన్ని పునాది దశ కార్యకలాపాలు ఫిబ్రవరి 2021 నుండి 2021 ఏప్రిల్ వరకు పూర్తి కావాలి. పునాది దశ చివరిలో విద్యార్థులు సొంతంగా కథ పుస్తకాలను చదవగలగాలి.

3. అధునాతన దశ.  ఈ దశ ఒకే సమయంలో చదవడం మరియు గ్రహించడంపై దృష్టి పెడుతుంది.  తెలియని పదాల అర్థాన్ని అర్థం చేసుకోవడానికి నిఘంటువును ఉపయోగించడం.  ఈ దశ చివరిలో, విద్యార్థులు సరళంగా చదవగలరు మరియు దాని అర్ధాన్ని అర్థం చేసుకోవాలి.  కమ్యూనిటీ రీడింగ్ వాలంటీర్లు ఈ దశలో కీలక పాత్ర పోషిస్తారు.

4. వాలెడిక్టరీ స్టేజ్- డైలీ 2 పుస్తక పఠన కాలాలను ఈ దశలో కొనసాగించాలి.  నవంబర్ 2021 నెలలో ఎండ్ లైన్ అసెస్‌మెంట్ యొక్క ప్రవర్తన. విద్యార్థులందరూ సరైన అవగాహనతో సొంతంగా చదవగలుగుతున్నారని చూడటానికి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు బాధ్యత వహిస్తారు.  అప్ గ్రేడర్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలి, విద్యార్థుల పనితీరును 3 వ పార్టీ అంచనా వేస్తుంది.  డేటా అనలిటిక్స్ ఆధారంగా ప్రచారం యొక్క స్థిరమైన మోడ్‌లో రూపకల్పన చేయబడుతుంది.

కరోనాకు కళ్లెం.. కేంద్రం కొత్త నిబంధనలు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వైరస్‌ వ్యాప్తికి కళ్లెం వేయడమే లక్ష్యంగా డిసెంబర్‌ 1నుంచి 31 వరకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాల్సిన కొవిడ్‌ నిబంధనలను బుధవారం ప్రకటించింది. గత కొన్ని వారాలుగా కొత్త కేసులు పెరుగుతున్న కొన్ని రాష్ట్రాల్లో దృష్టి కేంద్రీకరించి వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించింది. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల లాక్‌డౌన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరి అని కేంద్రం స్పష్టంచేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, ఈ బాధ్యత పోలీసులు, జిల్లా యాంత్రాంగానిదేనని తెలిపింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా రాత్రిపూట కర్ఫ్యూ వంటి నిబంధనలు రాష్ట్రాలు విధించుకోవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది.

మాస్క్‌లు ధరించకపోతే జరిమానా.

వైద్య అత్యవసర పరిస్థితులలో తప్ప, మరియు అవసరమైన వస్తువులు మరియు సేవల సరఫరాను నిర్వహించడం మినహా, ఈ మండలాల్లో లేదా వెలుపల ప్రజల కదలిక లేదని నిర్ధారించడానికి కఠినమైన  నియంత్రణ ఉండాలి. మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి అంశాలపై చైతన్యం కలిగించాలి. కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారికి తగిన జరిమానా విధించాలి.

స్విమ్మింగ్‌ పూల్స్‌లో వాళ్లకే అనుమతి!

కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చింది. అంతర్జాతీయ ప్రయాణికులను కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారం అనుమతించాలని తెలిపింది. 50శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చు. క్రీడాకారుల శిక్షణ నిమిత్తం మాత్రమే స్విమ్మింగ్‌ పూల్స్‌కు అనుమతి. సామాజిక, ఆధ్యాత్మిక, క్రీడా/ వినోద/ విద్య/సాంస్కృతి/ మతపరమైన కార్యక్రమాలకు 50శాతం సామర్థ్యంతో హాలులోకి అనుమతించాలి. ఇతర కార్యక్రమాలకు 200 మందికి మించరాదు. రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఆరోగ్య సేతు యాప్‌ వాడకాన్ని ప్రోత్సహించాలి.

Revised Shedule For Teacher Transfers

టీచర్ల బదిలీల Revised Schedule  GOMS NO 59. 24-11-2020. లో ముఖ్యమైన తేదీలు

బదిలీ దరఖాస్తుల పరిశీలన: Nov28-29

పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన: Nov 30-DEC 2

అభ్యంతరాలు సబ్మిట్ చేయడం: DEC 3-4

జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట: DEC 5-7

 పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన: DEC 8--Dec10

Click Here To Download Complete Guidelines

 వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు:-Dec11 to 15

బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన:Dec16--21

బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ:Dec 22-23

బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట ; Dec 24

How to Submit HR Data in Treasury Website

AP BUDGET PORTAL లో EMPLOYEES అందరి HR డేటాను ఎంటర్ చేసే పూర్తి విధానం. HR DATA ను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే ఈ నెల శాలరీ బిల్ సబ్మిట్ అవుతుందని TREASURY సైట్ లో DISPLAY చేయడం జరిగింది. కావున ఈ HR డేటా సబ్మిట్ చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

https://youtu.be/WcV9DevU8f0


Jagananna vidya kanuka varotsavalu

జగనన్న " విద్యాకానుక " వారోత్సవాలు నేటి (25.11.2020) షెడ్యూల్

విద్యార్థులు బూట్లు వేసుకునే విధానం , సాక్సులు ఉతుక్కోవడం వంటి వాటిపై అవగాహన కల్పించడం.

బూట్ల కొలతల్లో ఇబ్బందులుంటే సరిదిద్దడం.

Jaganna Thodu: రేపే జగనన్న తోడు పథకం ప్రారంభం.. అర్హులు వీరే.. జిల్లాల వారీగా వివరాలు.

వీధి వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టింది. 

రాష్ట్రంలోని లక్షల మంది చిరు, వీధి వ్యాపారులు, హాకర్స్‌కు బ్యాంకుల ద్వారా వారికి రూ. 10 వేల వరకు సున్నావడ్డీ రుణాలను అందించే ప్రక్రియకు నాంది పలికారు. రేపు సుమారు రూ.1000 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను చిరు వ్యాపారులకు, సంప్రదాయ వృత్తిదారులకు సీఎం జగన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో బటన్‌ నొక్కి లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. ఈ పథకం కోసం ఇప్పటి వరకు దాదాపు పది లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకంను వర్తింప చేసేందుకు దరఖాస్తు ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జగనన్నతోడు పథకానికి అర్హులు వీరే.

గ్రామాలు, పట్టణాల్లో సుమారు అయిదు అడుగుల పొడవు, అయిదు అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాప్‌లు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌ల పైన, పబ్లిక్, ప్రైవేటు స్థలాల్లో తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, ఆహారపదార్ధాలు, చేనేత, హస్తకళా వస్తువులు అమ్ముకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నవారు, నెత్తిమీద గంపలో వస్తువులు మోస్తూ, అమ్ముకునే పేదవారు ఈ పథకం ద్వారా సాయం పొందొచ్చు. సైకిల్, మోటార్ సైకిళ్లు, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారు.. సంప్రదాయ వృత్తిదారులైన లేసు తయారీదారులు, కళంకారీ కళాకారులు, ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీదారులు, తోలు బొమ్మల తయారీదారులు, కుండలు, బొబ్బిలి వీణలు, ఇత్తడి సామగ్రి తయారీదారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు అర్హులు. ఈ పథకం ద్వారా సాయం పొందాలంటే సదరు వ్యాపారి వయస్సు పద్దెనిమిది ఏళ్లు నిండి వుండాలి. ఆధార్, ఓటర్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డు కలిగి వుండాలి. సంప్రదాయ ముడిపదార్ధాలతో లేస్ వర్క్‌, కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలు, బొబ్బొలి వీణలు, కంచు కళాకృతులు రూపొందించే చేతివృత్తి కళాకారులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియ ఇలా.

గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారులను గుర్తించేందుకు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో గుర్తించిన లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద సామాజిక తనిఖీ కోసం ప్రదర్శిస్తున్నారు. అన్ని అర్హతలు వున్న వ్యక్తులు ఈ జాబితాలో తమ పేరు లేనిపక్షంలో వెంటనే సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి అర్హులై ఉండి బ్యాంకు ఖాతా లేనివారికి కొత్తగా పొదుపు ఖాతా ప్రారంభించేలా వాలంటీర్ల ద్వారా తోడ్పాటును అందిస్తారు. అర్హులైన వారి దరఖాస్తులను గ్రామీణ ప్రాంతంలో ఎంపిడిఓ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్‌ ద్వారా సంబంధిత బ్యాంకులకు పంపుతారు.

బ్యాంకులతో సమన్వయం కోసం ప్రత్యేక పోర్టల్.

బ్యాంకులతో సమన్వయం చేసుకోవడం, పటిష్టంగా ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. బ్యాంకులు తమకు అందిన దరఖాస్తులను పరిశీలించి, లబ్ధిదారుడి అవసరాన్ని బట్టి రూ.పదివేల వరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. బ్యాంకులో లోన్‌ అకౌంట్‌ను తెరిచిన లబ్దిదారుడికి మూడు నుంచి నాలుగు రోజుల్లో రుణం మొత్తాన్ని జమ చేస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ కార్డులను అందిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, సెర్ఫ్, మెప్మాలు సమన్వయంతో ఈ పథకం అమలును పర్యవేక్షిస్తాయి. లబ్ధిదారుడు తాను తీసుకున్న రుణంను వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించిన తరువాత, సదరు వడ్డీని ప్రభుత్వం లబ్ధిదారుడికి రియాంబర్స్‌ చేస్తుంది.

జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు చూసుకుంటే

అనంతపురం జిల్లాలో 66150 మంది, చిత్తూరు 74994, తూర్పు గోదావరి 90979, గుంటూరు 97530, కృష్ణా 53870, గుంటూరు 97530, ప్రకాశం 75416, నెల్లూరు 60867, శ్రీకాకుళం 42238, విశాఖ 87527, విజయనగరం జిల్లాలో 41269 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు.

NISHTHA Training Portfolio 8 Link

Module 8: Course 8: Environmental Studies - పరిసరాల విజ్ఞానం,SUBMIT YOUR PORTFOLIO (పోర్ట్ ఫోలియో కృత్యము సమర్పించండి )

LINK TO SUBMIT PORTFOLIO ON MODULE-8 OF NISHTHA, AP TRANINGS.

Click Here To Submit Portfolio 8

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా  మాడ్యూల్ 8  పోర్ట్ పోలియో లను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మోడల్ పోర్ట్ పోలియో 8 ను అందుబాటులో ఉంచడం జరిగింది. 

AP TRANSFERS 2020 Andhra Pradesh Teachers (Regulation of Transfers) Rules – Amendments Orders

Teachers Transfers amendment GO rlsd GO.Ms.No.59 dt24.11.2020

Click Here To Download Go no 59

Go no 59 ముఖ్యాంశాలు

స్టేషన్ పాయింట్ల పై సీలింగ్ ఎత్తివేత. 

టోటల్ సర్వీస్  పాయింట్ల గరిష్ట పరిమితి 16.5పాయింట్ల కు పెంపు.(33y)

ప్రధానోపాధ్యాయులకు 1-10 20 నాటికి ఐదు సంవత్సరములు పూర్తి అయితేనే తప్పనిసరి ట్రాన్స్ఫర్

Model Portfolio 8 For NISHTHA Training

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా  మాడ్యూల్ 8  పోర్ట్ పోలియో లను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మోడల్ పోర్ట్ పోలియో 8 ను అందుబాటులో ఉంచడం జరిగింది. 

Click Here To Download Model Portfolio 8

SBI WhatsApp Payment Registration Process & Fund Transfer Process

వాట్సాప్ ద్వారా మన Account నుండి  వేరే వారి Account కు నగదు ఏ విధంగా పంపాలో స్క్రీన్ షాట్ ద్వారా వివరించడం జరిగింది. దీని కోసం ముందుగా మన వాట్సాప్  మొబైల్ నెంబర్ మన Account తో లింక్ అయి ఉండాలి. 

మన వాట్సాప్ ని ఓపెన్ చేసి మూడు డాట్స్ పై క్లిక్ చేసి పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. తరువాత add Payment Method పై క్లిక్ చేయాలి.తరువాత మన బ్యాంక్ వివరాలు ఎంటర్ చేయాలి. 

➢ఇలా ఎంటర్ చేసిన తరువాత పిన్ నెంబరు జనరేట్ చేసుకోవాలి. 

➢Minor & Jointly Operated accounts are not eligible.

➢One time 6 digit PIN will be generated during registration process for new UPI customers.

AP Samagra Shiksha – SIEMAT – Constitution Day Celebrations on 26th November, 2020 – Reading of Preamble at 11.00 a.m. by Hon’ble Prime Minister on 26th November, 2020 – participation of students and other stakeholders

నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి గారి సందేశాన్ని అందరు విద్యార్థులు వినేలా చూడాలని ఉత్తర్వులు.

G.O.Rt.No.229 ,Dt.23-11-2020 Re-opening of Schools - protocols to be followed in all schools functioning under all managements for the academic year 2020-21 Modification Orders ISSUED

Ap లోని 1నుండి 5 తరగతి మరియు 6,7 తరగతుల ను ఎప్పటి నుండి ప్రారంభం చేయాలి అనే వివరాలతో జీవో నెంబర్ 229 విడుదల చేయడం జరిగింది. 

పాఠశాలల్లో వివిధ తరగతుల పునఃప్రారంభం పై సవరణ ఉత్తర్వులు సంఖ్య: 229.తేది: 23-11-2020 జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు

నవంబరు-23 నుండి 8 వ.తరగతి.

డిసెంబరు-14 నుండి 6,7 తరగతులు (తరువాత పరిస్థితులు అంచనా బట్టి)

జనవరి సంక్రాంతి తరువాత 1 నుండి 5 తరగతులు (తరువాత పరిస్థితులు అంచనా బట్టి)

Ap DEECET 2020 MERIT LIST AND NOT QUALIFIED LIST

APDEECET-2020 మెరిట్ లిస్ట్ మరయు నాట్ క్వాలిపైడ్ లిస్టు లను మీడియం వారీగా అందుబాటులో ఉంచారు. 

Click Here To Download Merit List

NISHTHA Training దీక్షా ఆన్లైన్ శిక్షణ Complaint ఫారం

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా  కోర్సు పూర్తి కాకపోయినా,సర్టిఫికెట్ జనరేట్ & Download కాకపోయినా,Pdf missing అని వచ్చిన ,వీడియోస్ ప్లే కాకపోయినా,Portfolio సమస్యలు,ఇంకా ఏమైనా సమస్య ఉన్న,ఈ క్రింది లింక్ ద్వారా Complaint చేయండి

Click Here To Complaint Form for Errors in DIKSHA APP 

AP.Rc.No.Spl/CMO-JVK/2020, Date:3,11.2020. "JAGANANNA VIDYA KANUKA WEEK DAY CELEBRATIONS" District level observer

నవంబర్ 23 నుండి 28 తేదీల్లో జరిగే జగనన్న విద్యా కానుక ఉత్సవాలకు జిల్లాల వారీగా పరిశీలకులను నియమిస్తూ ఆదేశాలు జారీ

Merging of all schools functions under Panchayat Raj Department existing in the limits of Municipal Corporation, Municipality, Nagar Panchayat into the Municipal Managements Presently not feasible at this juncture - Instructions issued Memo. No. ESE02-36/93/2020-GS&GR-CSE Dated:22/11/2020

ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపల్ పరిధిలో ఉన్న పంచాయతీరాజ్ పాఠశాలలను మున్సిపల్ యాజమాన్యం లో విలీనం సాధ్యం కాదని  పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇచ్చిన ఉత్తర్వులు.

Conduct of Fire Mock Drill/ Demonstration in Schools by Fire Officers on 25th November,2020 – Certain Instructions Reg. Proc. Rc. No.ESE02-11/143/2020-SCERT Dated: 16-11-2020.

నవంబర్ 25, 2020 న పాఠశాలల్లో ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ.

Click Here To Download Proceedings 

JAGANANNA VIDYA KANUKA VAROTSAVALU DAY WISE SHEDULE

ఈ రోజు 24-11-2020 జగనన్న విద్యాకానుక వారోత్సవాలు షెడ్యూల్ 

👫విద్యార్థులు యూనిఫారం కుట్టించు కున్నారో లేదో పరిశీలించడం.

👬కుట్టు కూలి ఖర్చులు నేరుగా తల్లుల ఖాతాకు ప్రభుత్వం వేస్తున్న విషయాన్ని తెలపడం.

👬యూనిఫామ్ కొలతలు గురించి,దుస్తులు  కుట్టించుకోవడంలో తీసుకోవడంలో జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించడం.

 23.11.2020 నిర్వహించవలసిన జగనన్న విద్యాకానుక వారోత్సవాలు - షెడ్యూల్  

👫విద్యార్థులకు, తల్లిదండ్రులకు జగనన్న విద్యాకానుక గురించి అవగాహన కల్పించడం.

👫ప్రతి విద్యార్థికి స్థూడెంట్ కిట్ అందిందా లేదా పరిశీలించడం.

 👫బయోమెట్రిక్ అథంటికేషన్ తనిఖీ

ఏపీలో సూళ్లకు కొత్త టైం టేబుల్‌ 8, 9 తరగతులకు రోజు విడిచి రోజు స్కూలు,10వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ హాజరు కావాలి.మధ్యాహ్నం తర్వాత ఆన్‌లైన్‌లో బోధన.

అన్ని రకాల కోవిడ్‌ జాగ్రత్తలతో ఎస్సీఈఆర్టీ నూతన విధివిధానాలు

విద్యార్థుల నుంచి మెరుగైన రీతిలో స్పందన కనిపిస్తుండడంతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతుండడంతో విద్యా శాఖ కోవిడ్‌ నుంచి రక్షణ చర్యలను చేపడుతూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నెల 2వ తేదీ నుంచి 9, 10 తరగతుల విద్యార్థులు స్కూళ్లకు హాజరవుతుండగా, సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.

 8, 9 తరగతుల విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులను చేపట్టనున్నారు. 

10వ తరగతి విద్యార్థులు ప్రతి రోజూ హాజరు కావలసి ఉంటుంది.

 ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తాజా టైమ్‌ టేబుల్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ మేరకు 9వ తరగతి విద్యార్థులు సోమ, బుధ, శుక్రవారాల్లో.. 

8వ తరగతి విద్యార్థులు మంగళ, గురు, శనివారాల్లో పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయి. మధ్యాహ్న భోజనం అనంతరం 1.30 గంటలకు ఇళ్లకు పంపిస్తారు. అనంతరం ఆన్‌లైన్‌ తరగతులు ఉంటాయి. 

ఎస్సీఈఆర్టీ తాజా టైం టేబుల్‌

– ఉదయం 9.30 నుంచి 9.45 వరకు: ప్రార్థన, కోవిడ్‌–19 ప్రతిజ్ఞ (తరగతి గదిలో). సాధారణ సమావేశం నిషిద్ధం.

– 9.45 నుంచి 10.25 వరకు : మొదటి పీరియడ్‌

– 10.25 నుంచి 10.35 వరకు : ఆనంద వేదిక / భౌతిక దూరాన్ని పాటిస్తూ పాఠశాల ఆవరణలో నడవడం, చేతులు కడుక్కోవడం / మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం

– 10.35 నుంచి 11.15 వరకు : రెండవ పీరియడ్‌

– 11.15 నుంచి 11.20 వరకు : మంచినీటి విరామం (వాటర్‌ బెల్‌)

– 11.20 నుంచి 12.00 వరకు : మూడవ పీరియడ్‌

– 12.00 నుంచి 12.10 వరకు : ఆనంద వేదిక (కథలు చెప్పడం / చిత్రలేఖనం / పాఠ్యాంశాలకు సంబంధించిన నాటకీకరణ / చేతులు కడుక్కోవడం / ప్రాణాయామం, మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం.

– 12.10 నుంచి 12.50 వరకు : 10వ తరగతి విద్యార్థులకు నాల్గవ పీరియడ్, 8/9వ తరగతి విద్యార్థులకు భోజన విరామం 

– 12.50 నుంచి 1.30 వరకు : 8/9వ తరగతి విద్యార్థులకు నాల్గవ పీరియడ్, 10వ తరగతి విద్యార్థులకు భోజన విరామం

– 1.30 : విద్యార్థులు ఇంటికి వెళ్లుట

– 1.30 నుంచి 2 వరకు :  ఉపాధ్యాయుల భోజన విరామం

– 2.00 నుంచి 2.15 వరకు : ఆన్‌లైన్‌ బోధన, విద్యార్థులకు వాట్సప్‌ ద్వారా సమాచారం అందించేందుకు ఉపాధ్యాయుల సమావేశం.

– 2.15 నుంచి 4.00 వరకు : వాట్సప్‌ / దూరదర్శన్‌ / దీక్షా / అభ్యాస యాప్‌ / యూట్యూబ్‌ / ఫోన్‌ ద్వారా సామూహిక సంభాషణ, విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇవ్వడం వంటి ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ, పర్యవేక్షణ. 

– 4.00 నుంచి 4.15 వరకు : మరుసటి రోజుకు ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం.

Rice supply for white card holders by trucks in AP

రేషన్ డోర్ డెలివరీ ట్రక్ ల కోసం అప్లై చేయడానికి  అర్హతలు మరియు కావలిసిన సర్టిఫికెట్స్ 

1.21- 45 వయస్సు గలవారు 

2..కుటుంబ ఆదాయం 10, 000

 (పదివేలు) మించరాదు 

3. ఇంట్లో గవర్నమెంట్ employ ఉండకూడదు 

4.నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు 

5. ఇంట్లో ఇన్కమ్  టాక్స్ కట్టేవారు ఉండకూడదు. 

6.కనీసం 7 వ తరగతి చదవాలి(సర్టిఫికెట్  కావాలి )

7.LMV(లైట్ మోటర్ వెహికల్ ) డ్రైవింగ్ లైసెన్సు కావాలి 

8.క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి 

9.గడిచిన 5 సంవత్సరాలలో ప్రభుత్వ లోన్ ద్వారా వారు ఎటువంటి వాహనాలు  తీసుకుని ఉండరాదు.

10.అప్లై చేసేవారికి బ్యాంకు అకౌంట్ ఉండాలి 

11. 20.11.2020 నుండి 27.11.2020 వరకూ సచివాలయం ద్వారా  apply చేసుకోవాలి. 27.11.2020 లాస్ట్ డేట్. 

మరిన్ని వివరాలు కోసం  సచివాలయం లో  సంప్రదించగలరు.

Survey on Online Learning in Govt. Schools in Visakhapatnam district.

Visakhapatnam Distict All the teachers are requested to fill the google form & submit. Govt. DIET, Bheemunipatnam, Vissakhapatnam.

Click Here To Submit Data in Google Form

Watch live training programme on NISHTHA Course Module 8 Scheduled for today (22-11-2020) at 6 pm to 7.30 pm.

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి Environmental Studies( పరిసరాల విజ్ఞానం) పై లైవ్ వీడియో.

JUST CLICK AND WACH

https://youtu.be/vUTTdFRa-M4




పాఠశాల ల ప్రారంభం పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారి వివరణ

23 నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు.

క్రమేణా ఉన్నత పాఠశాలల్లో అన్ని  తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు. 

ఈనెల 23 సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే ఈనెల 2 నుంచి 9, 10 తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న సంగతి విదితమే. విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా ఉండటం తో పాటు హాజరు శాతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 8వ తరగతి విద్యార్థులకు కూడా పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించటం జరిగింది. 8, 9 తరగతుల విద్యార్థులు రోజుమార్చి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉండగా 10 వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మూడు తరగతుల విద్యార్థులకు బోధన జరుపుతూ డిసెంబర్ 14 నుంచి  6, 7 తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. 14వ తేదీ తరువాత అప్పటి పరిస్థితి సమీక్షించుకుని 1-5 తరగతులపై నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.  ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 వరకు జరుగుతున్న పాఠశాలలు చలికాలం కారణంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని మంత్రి సురేష్ తెలిపారు. 

RGUKT CET-2020-IIIT Admission Test Hall Tickets Available

 RGUKT CET-2020 Entrance Test  to be held on 28.11.2020 from 11.00 AM to 1.00PM.Hall Tickets Are Available.

Click Here To Download Hall Tickets

NISHTHA ట్రైనింగ్ పోర్టుఫోలియో సబ్మిషన్ లింక్స్ 1 to 7

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా  ఇప్పటి వరకు పూర్తి చేసిన  మాడ్యూల్ 1 నుండి 7 వరకు పోర్ట్ పోలియోలు 1 నుండి 7 వరకు గూగుల్ పామ్  క్రింద ఇవ్వబడ్డవి.

Click Here Submit PORTFOLIO 1 for MODULE 1


Click Here Submit PORTFOLIO 2 for MODULE 2

 

Click Here Submit PORTFOLIO 3 for MODULE-3


Click Here Submit PORTFOLIO 4 for MODULE-4


Click Here Submit PORTFOLIO 5 for MODULE-5


Click Here Submit PORTFOLIO 6 for MODULE-6


Click Here Submit PORTFOLIO 7 for MODULE -7



The A.P. State Roads Fee (Determination of Rates and Collection) Rules, 2020, Fresh Rules TRANSPORT, ROADS & BUILDINGS (R.V) DEPARTMENT G.O.MS.No. 22 Dated: 19-11-2020.

Government of Andhra Pradesh has been issued orders for implementation of Andhra Pradesh State Roads (Collection of Fees from any person for the use of Section of State Roads / Permanent Bridge / Temporary Bridge on A.P. State Roads) Rules, 2007.

Click Here To Download Go. Ms. No. 22

Revised guidelines for casual leaves

Revised Order on Leaves:- సెలవులు పై వివరణ ఇచ్చిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్.

C.L's 2.5

Sp CLs 1

Women's  CLs 1

NISHTHA ON DIKSHA LINKS FOR MODULES 7,8,9.

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా మాడ్యూల్ 7,8,9 లకు సంబంధించిన కోర్సు జాయిన్ డైరెక్టు లింకులు.క్రింది లింక్ పై క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేసి కోర్సు లో జాయిన్ అవచ్చును. 

Telugu Course :

మాడ్యూలు 7 (పాఠశాల ఆధారిత మదింపు.)

Click Here To Join Course in Telugu Module 7 

మాడ్యూలు 8 (పరిసరాల విజ్ఞానం - బోధన)

Click Here To Join Course in Telugu Module 8 

మాడ్యూలు 9 (గణిత బోధన - సహిత విద్య - చట్టబద్ధ విధాన చట్రం)

Click Here To Join Course in Telugu Module 9 

English Course :

MODULE 7 (AP_School Based Assessment)

Click Here To Join Course in English  Module 7 

MODULE 8 (AP_Pedagogy of Environmental Studies )

Click Here To Join Course in English  Module 8 

MODULE 9 (AP_Pedagogy of Mathematics)

Click Here To Join Course in English  Module 9 

నిష్ట  ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా  ఇప్పటి వరకు పూర్తి చేసిన  మాడ్యూల్ 1 నుండి 7 వరకు పోర్ట్ పోలియోలు 1 నుండి 7 వరకు గూగుల్ పామ్  క్రింద ఇవ్వబడ్డవి.

https://www.aptfvizag.com/2020/11/nishtha-1-to-7.html?m=1

Featured post

AP 10th class public exams result released today