APTF VIZAG: ప్రస్తుతం నివర్ తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సందర్భంగా తుఫానుల గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం నివర్ తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సందర్భంగా తుఫానుల గురించి తెలుసుకుందాం.

తుఫానుల గురించి సవివరంగా తెలుసుకుందాం.

వాతావరణం:- భూమిని ఆవరించి ఉన్న వాయు పొరను వాతావరణం అంటారు.

ఉపరితల ఆవర్తనం:- భూమిపై నుండి అర కిలోమీటరు నుండి కిలోమీటరు ఎత్తుకు పైన తిరిగే గాలులను ఉపరితల ఆవర్తనం అంటారు.

వాతావరణ పీడనం:- ఒక ప్రదేశంలో వాయురాశి  "వాతావరణ పీడనం" అంటారు.

అధిక పీడనం:- పెద్ద మొత్తంలోగాలులు ఒకచోట గుమికూడి ఉండడాన్ని "అధిక పీడనం"  అంటారు. 

అల్ప పీడనం:- గాలి అధికంగా వేడెక్కి పైకి లేచిన చోట పల్చగా ఉంటుంది. ఈ స్థితిని "అల్పపీడనం" అంటారు. అల్ప పీడనం ఏర్పడిన ప్రదేశంలో చల్లని గాలులు వచ్చి చేరతాయి. ఆ ప్రాంతంలో సుడులు ఏర్పడతాయి. ఈ సుడుల వల్ల గాలులు వేగంగా పరిభ్రమిస్తూ చల్లబడి పెద్దపెద్ద మేఘాలు ఏర్పడతాయి. అందువలన అల్ప పీడన ప్రాంతంలో అధిక వర్షాలు కురుస్తాయి.

వాయు గుండం:- అల్పపీడన ప్రాంతాలలో గాలుల ప్రభావం అధికమైతే దానిని "వాయుగుండం" అంటారు.

తుఫాను:- వాయుగుండం బలపడితే  "తుపాను" ఏర్పడుతుంది.

గమనిక:- అల్ప పీడనాలు సముద్రంలో కాని, భూమిపై కానీ ఏర్పడవచ్చు. అయితే తుఫానులు మాత్రం సముద్రాలలోనే ఏర్పడుతాయి. అల్పపీడనం ఏర్పడిన సముద్ర ఉపరితలం వద్ద  గాలులు సుడులు తిరిగి పెద్దవిగా మారి వాయుగుండాలు ఏర్పడతాయి. వాయుగుండం బలపడి తుఫానులుగామారతాయి.

చక్రవాతం:- అల్ప పీడనం చుట్టూ అతి వేగంగా తిరిగే గాలులను "చక్రవాతం " అంటారు.

👉 చక్రవాతాలు  ప్రపంచంలో  21℅ ప్రాంతాలలో అధిక నష్టాన్ని కలిగిస్తాయి. 

👉 1970 నుండి ఉపగ్రహాల ద్వారా చక్రవాతాల వల్ల కలిగే నష్టాన్ని, ఆయా ప్రాంతాలను గుర్తిస్తున్నారు. మెక్సికో, అమెరికా, చైనా, ఫిలిప్పీన్స్, అత్యధికంగా చక్రవాతాలకు గురవుతున్న దేశాలు.

చక్రవాతాల వల్ల నష్టపోయే దేశాలలో మాత్రం బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంది.

👉 చక్రవాతాన్ని "సైక్లోన్" అంటారు. సైక్లోన్ అనేపదం కైక్లోన్ అనే గ్రీకు భాషా పదం నుండి వచ్చింది. కైక్లోన్ అనగా తిరుగుతున్న నీరు లేదా చుట్టుకున్న పాము అని అర్థం.

వేగం ఆధారంగా సైక్లోన్ల వర్గీకరణ

👉 గాలి వేగం గంటకు 31 కి.మీల కంటే తక్కువగా ఉంటే అల్పపీడన ద్రోణి

👉 గాలివేగం గంటకు 31-50 కిమీల మధ్య ఉంటే వాయుగుండం

👉  గాలి వేగం గంటకు 51-61 కిమీ‌ల వరకు మధ్య ఉంటే తీవ్ర వాయు గుండం

👉 గాలి వేగం 62-88 కి.మీల మధ్య ఉంటే తుపాను

👉 గాలి వేగం 89-118 కిమీల మధ్య ఉంటే తీవ్ర తుఫాను

👉 గాలి వేగం 119-221 కిమిల మధ్య ఉంటే అత్యంత తీవ్ర తుఫాను

👉 గాలి వేగం గంటకు 221 కిమీలు ఆ పైన ఉంటే సూపర్ సైక్లోన్

ప్రపంచంలో ప్రతి సంవత్సరం సగటున 97 తుఫానులు సంభవిస్తున్నాయి. వీటి ఉధృతి మే-నవంబరు నెలల మధ్య ఉంటుంది. వీటి ఉధృతిని బట్టి వివిధ ప్రాంతాలు/దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు.

👉 దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహా సముద్రం  -- సైక్లోన్

👉 ఉత్తర అట్లాంటిక్, మధ్య ఉత్తర పసిఫిక్, తూర్పు ఉత్తర పసిఫిక్ మహాసముద్రం -- హరికేన్లు

👉 వాయువ్య పసిఫిక్‌ మహాసముద్రం -- టైఫూన్లు

👉 అమెరికా అట్లాంటిక్ మహాసముద్రం -- టోర్నడో లు.

👉 ఆస్ట్రేలేషియా -- విల్లీ విల్లీ

👉 ఇండోనేషియా దీవులు -- బాగ్నాస్

👉 అంటార్కిటికా మంచు తుఫాన్లు -- బ్లిజార్డ్స్.

తుఫానులకు పేర్లు పెట్టే సాంప్రదాయం

👉 2000 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్‌ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్  మరియు వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. పేర్లు పెట్టడం 2004 నుండి మొదలైంది.

గమనిక: అట్లాంటిక్ మహాసముద్రం లో తుఫానులకు  పేర్లు పెట్టే సంప్రదాయం 1953 లోనే ప్రారంభించారు.

👉 ఈ గ్రూపులో ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్,పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్, దేశాలున్నాయి. 2018 లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యు.ఏ.ఈ, యెమన్ దేశాలు కూడా చేరాయి. ఈ ఏడాది 13 దేశాలు ఒక్కో దేశం 13 పేర్లను సూచించాయి. (అనగా 169 పెర్లు)

👉  ఈ ప్యానెల్ సభ్యులు ప్రతిపాదించిన పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు.  బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్

👉 ఈ ఏడాదిలో బంగ్లాదేశ్ సూచించిన నిసర్గ, ఇండియా సూచించిన గతి తుపాన్ల పేర్లు వాడారు. 2020 నవంబరు లో ఏర్పడిన తుఫానుకు నివర్ తుపానుగా ఇరాన్ నామకరణం చేసింది. 

👉 తరువాత వచ్చే తుపానులకు వరుస క్రమంలో వివిధ దేశాలు సిద్ధంగా ఉంచిన పేర్లు

మాల్దీవులు -- బురేవి

మయన్మార్ -- టౌక్టాయి

ఒమన్ -- యాస్

పాకిస్తాన్ -- గులాబ్.

No comments:

Post a Comment