APTF VIZAG: AP cabinet Meeing Decissions

AP cabinet Meeing Decissions

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం లో తీసుకున్న నిర్ణయాలు. 

సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో భారీ వర్షాలు, నివర్ తుపానుపై చర్చించారు. నష్టపరిహారంపై అంచనాలను డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా పరిహారం చెల్లించాలని సీఎం తెలిపారు. 40 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. జనవరి 2021 నాటికి పరిహారం చెల్లించాలని సీఎం సూచించారు. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందజేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో  అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే వివిధ ముసాయిదా బిల్లులకు ఆమోదంపై చర్చించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణం పథకాలపైనా చర్చించారు. ఉద్యోగులకు దశల వారీగా డీఏ బకాయిల చెల్లింపులతో పాటు పలు అంశాలపై చర్చ సాగింది.

నివర్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్టుగా అధికారులు సీఎంకు తెలిపారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇటీవల కాలంలో ఇంటి పన్నును సవరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొంది.ఈ మేరకు తీసుకొచ్చిన బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 25న పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

30.20 లక్షల మందికి డీ ఫాం పట్టాలు ఇవ్వనుంది ఏపీ సర్కార్ లే ఔట్ల అభివృద్ది, ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నెల 21నుండి భూముల రీ సర్వే కు కేబినెట్ అంగీకరించింది. డిసెంబర్ 8న 2.49 లక్షల మందికి గొర్రెలు, మేకలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

పెండింగు జీతాల చెల్లింపునకు ప్రభుత్వ నిర్ణయం

మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం మంత్రి కన్నబాబు వెల్లడి

కరోనా కారణంగా పెండింగులో ఉంచిన జీతాలు చెల్లించేందుకు రాష్ర్ట మంత్రి మండలి నిర్ణయించింది.  ఉద్యోగులు, పెన్షనర్లు, వివిధ క్యాడర్లలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా  మార్చి, ఏప్రిల్ నెలల్లో కోత విధించారు. ఉద్యోగులకు సగం మేర కోత విధించారు. నాలుగో తరగతి  ఉద్యోగులకు, ఇతరులకు వేర్వేరు మొత్తాల్లో కోత విధించారు.  పెన్షనర్లకు మార్చి నెల పింఛను లో సగం కోత విధంచారు. ప్రస్తుతం  ఈ పెండింగు  మొత్తాలను డి సెంబర్ , జనవరి నెలల్లో  రెండు విడతల్లో చెల్లించేందుకు రాష్ర్ట మంత్రి మండలి శుక్రవారం  ఆమోదించింది. రాష్ర్ట వ్యవసాయశాఖ  మంత్రి కురసాల కన్నబాబు  విలేకరుల సమావేశంలో ఈ  విషయం వెల్లడించారు. ఉద్యోగుల జీతాలు రూ. 2,324 కోట్లు, పెన్షన్లు రూ.880.50 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని తెలిపారు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4