APTF VIZAG: ముగిసిన ఉద్యోగ సంఘాల సమావేశం.. ఉద్యమ బలోపేతానికి కీలక నిర్ణయాలు

ముగిసిన ఉద్యోగ సంఘాల సమావేశం.. ఉద్యమ బలోపేతానికి కీలక నిర్ణయాలు

ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీపై అవలంభిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ఉద్యమ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఇవాళ ఏపీ సీఎస్‌ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోరనున్నాయి. 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నాయి. 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండాలను సమర్పించనున్నాయి. ఈ నెల 27 నుంచి 30 వరకూ నాలుగు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ, ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్ళనున్నాయి.

1 comment:

  1. https://m.facebook.com/story.php?story_fbid=506108964284128&id=100046550854840&sfnsn=wiwspwa

    ReplyDelete

Featured post

Ap open school 10th Class and intermediate results