APTF VIZAG: మాతృభాషలో చదువే భేష్! రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన

మాతృభాషలో చదువే భేష్! రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన

రాష్ట్రాలు హిందీ లేదా ప్రాంతీయ భాషల్లో సాంకేతిక, వైద్య, న్యాయ విద్యను ప్రోత్సహించాలని, తద్వారా ఇంగ్లీషు మాట్లాడని విద్యా ర్థుల ప్రతిభను దేశం వినియో గించుకోవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. ఓ జాతీ య మీడియాకు ఇచ్చిన ఇంట ర్వ్యూ లో మాట్లాడుతూ, హిందీ లేదా ప్రాంతీయ భాషలలో, విద్యార్ధులు తమమాతృ భాషలో చదివితే వారు సులభంగా అసలైన ఆలోచనా విధానాన్ని < అభివృద్ధి చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇది పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది అని తెలిపారు. "సాంకేతిక విద్య, వైద్య విద్య, న్యాయ విద్య అన్నీ హిందీ మరియు ప్రాంతీయ భాషలలో బోధించబడాలి. ఈ మూడు విద్యా రంగాలకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రాంతీయ భాషల్లోకి సరిగ్గా అను వదించడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి" అని షా అన్నారు. మాతృభాషలో విద్యాభ్యాసం సులభం, వేగవంతమైనదని సూచిం చారు. ఇది ఉన్నత విద్యలో దేశంలోని ప్రతిభను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో మనం దేశంలోని ప్రతిభలో 5 శాతం మాత్రమే ఉపయో గించగలము. అయితే మాతృభాష విద్యావిధానంతో 100శాతం ప్రతిభను సద్వినియోగం చేసుకో వచ్చు. అలాగని తానేమీ ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని అన్నారు. చరిత్ర గురించి మాట్లాడుతూ, వాస్తవాలను ప్రజలముందు ఉంచా లన్నారు. వక్రీకరణలను నిశితంగా అధ్యయనం చేసి, వాస్తవాలను వెల్లడిం చాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశ విద్యార్థులు మన వాస్తవ చరిత్రను పరిశోధించాలన్నారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results