ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు ముఖ ఆధారిత హాజరు గురువారం నుంచి అమలు కానుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా కొన్ని కళాశాలల్లో అమలు చేసిన ఉన్నత విద్యాశాఖ గురువారం నుంచి రాష్ట్రమంతా అమలు చేయనుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల ఫోటోలు తీసే ప్రక్రియ పూర్తయిందని ఇంజనీరింగ్, పిజి కళాశాలల్లో అమలు కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. నూతన పద్ధతిలో తరగతి గదిలో ఉన్న విద్యార్థులను విడివిడిగా కాకుండా ఒకేసారి ఫొటో తీయనున్నారు. ఉదయం కళాశాలకు వచ్చినప్పుడు ఒకసారి, తిరిగి ఇంటికెళ్లే సమయంలో మరోసారి విద్యార్థులను లెక్చరర్ ఫోటోలు తీస్తారు. ఈ ఫోటో తీసిన సమయంలో విద్యార్థుల పేర్లు, వారి సమాచారం, హాజరును సాఫ్ట్వేర్ ఆటోమెటిక్గా తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ విధానం అమలు చేసే దశలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వీటిని సరిచేస్తామని చెబుతున్నారు. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని కళాశాలలు ఫీజు రీయంబర్స్మెంట్ కోసం విద్యార్థులు రాకపోయినా హాజరు వేయిస్తున్నాయని వీటిని అరికట్టేందుకే ఈ యాప్ను తీసుకొస్తున్నామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
No comments:
Post a Comment