ఎన్నాళ్ల నుంచో యూజర్లు వేచి చూస్తున్న సదుపాయాలను వాట్సాప్ తన ప్లాట్ ఫామ్ పై అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తాజా వెర్షన్ పై ఎమోజీ రియాక్షన్స్ అందుబాటులోకి తీసుకురావడం పట్ల సంతోషంగా ఉందని వాట్సాప్ ప్రకటించింది.
వాట్సాప్ లో ఇంత వరకు యూజర్లు ఒక్క విడత 100 ఎంబీ వరకే ఫైల్స్ (ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు) పంపించుకునేందుకు అవకాశం ఉండేది. దీనివల్ల పంపించాల్సిన ఫైల్స్ ఎన్నో ఉన్నప్పుడు చాలా సమయం వృధా అయ్యేది. ఇప్పుడు ఈ పరిమితి 2 జీబీకి పెరిగింది. అంటే ఒకే విడత 2 జీబీ డేటాను మరొకరితో షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఫైల్ అప్ లోడ్ లేదా డౌన్ లోడ్ కు ఎంత సమయం పడుతుందన్నది కూడా ఆ సమయంలో చూపిస్తుంది.
ఇక వాట్సాప్ గ్రూపుల్లో మరింత మంది సభ్యులను చేర్చుకునేందుకు వీలు కల్పించింది. ఒక గ్రూపులో గరిష్ఠంగా 256 మంది సభ్యులకే ఇప్పటి వరకు అనుమతి ఉండేది. ఇంతకుమించి సభ్యులు ఉన్నప్పుడు వేరే గ్రూపు తెరవాల్సి వచ్చేది. ఇకమీదట 512 మంది సభ్యులు ఒకే గ్రూపులో చేరొచ్చు. పరిమితి రెట్టింపైంది
No comments:
Post a Comment