APTF VIZAG: AP Intermediate Revised Exams shedule

AP Intermediate Revised Exams shedule

ఏపీ ఇంటర్‌ పరీక్షలు రీ-షెడ్యూల్‌..కొత్త తేదీలు ఇవే.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్‌ పరీక్షలు రీ – షెడ్యూల్‌ అయ్యాయి. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు.

2022 ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ పరీక్షల షెడ్యూలును విడుదల చేసిందని చెప్పిన ఆయన… ఐఐటీలకు 16 ఏప్రిల్ నుంచి 21 ఏప్రిల్ వరకు పరీక్షలు కోసం ఇంటర్ పరీక్షలు వాయిదా వేశామని స్పష్టం చేశారు.

అయితే.. ఏప్రిల్ 8 నుంచి 22 వరకు చేపట్టాల్సిన పరీక్షలు నిర్వహించాలని గతంలో ఆదేశాలు ఇచ్చామన్నారు. అయితే.. వాటిని 22 ఏప్రిల్ నుంచి నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేశామని స్ఫష్టం చేశారు ఆదిమూలపు సురేష్. ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం.. ఏప్రిల్‌ మాసం 22 వ తేదీ నుంచి.. మే 12 వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరుగనున్నాయన్న మాట. దీనిని దృష్టిలో ఉంచుకుని.. పరీక్షలకు సన్నద్ధం కావాలని ఏపీ ప్రభుత్వం చెప్పింది.

No comments:

Post a Comment