APTF VIZAG: ఉద్యోగ సంఘాల నేతల బెదిరింపులకు భయపడం.హెచ్చరికలతో వారికే నష్టం: సజ్జల

ఉద్యోగ సంఘాల నేతల బెదిరింపులకు భయపడం.హెచ్చరికలతో వారికే నష్టం: సజ్జల

ఉద్యోగ సంఘాల నేతల  బెదిరింపులకు భయపడబోమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు చేస్తున్న రాజకీయ ప్రకటనలు సరికావన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఉద్యోగుల పట్ల బాధ్యత కంటే, వారికి నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. హెచ్చరికలు చేయడం వల్ల తాము వెనక్కుతగ్గమని, అలాగే ముందుకూ వెళ్లమని సజ్జల స్సష్టం చేశారు. ఇలాంటి హెచ్చరికలతో వారికే నష్టమని ఉద్యోగ సంఘాల నేతలను హెచ్చరించారు. వారం రోజుల్లో పీఆర్‌సీ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నానని చెప్పారు. సీపీఎస్‌ రద్దు, పీఆర్‌సీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ హమీల అమలును రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని, నెలరోజుల్లోనే అధ్యయనం పూర్తవుతుందని చెప్పారు. ఓటీఎస్‌ పూర్తిగా స్వచ్ఛందమని స్పష్టం చేశారు

No comments:

Post a Comment

Featured post

AP IPE MARCH-2024 Intermediate Hall Tickets Released