ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ(విపత్తు నిర్వహణ) శాఖ.రాష్ట్రంలో కోవిడ్-19 కారణంగా మరణించిన వారి వారసులకు రూ. 50,000/-ల సహాయం
ఆంధ్రప్రదేశ్ నివాసులకు ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా రాష్ట్రంలో | కోవిడ్-19 కారణంగా మరణించిన వారి వారసులకు రూ.50,000/- (ఎక్స్ గ్రేషియా) ఆర్థిక సహాయాన్ని అందజేయాలని భారత ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ యొక్క మార్గదర్శకాల ప్రకారం నిర్ణయించడమైనది. తదనుగుణంగా కోవిడ్-19 కారణంగా మరణించిన వారి వారసులకు త్వరగా మరియు సులభంగా సహాయం అందజేయుటకు మొబైల్ హిత ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించబడినది. పోర్టల్ http://covid19.ap.gov.in/exgratia పై క్లిక్ చేయడం ద్వారా ఎక్స్ గ్రేషియా కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ పోర్టల్పై మొబైల్/ కంప్యూటర్ నుండి ఒటిపిని జనరేట్ చేయడం ద్వారా మరియు దిగువ తెలిపిన ఏదేని రుజువును అప్లోడ్ చేయడం ద్వారా దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఆర్టి-పిసిఆర్/ర్యాపిడ్ యాంటిజెన్/మాలిక్యులర్ టెస్ట్ యొక్క పాజిటివ్ టెస్ట్ రిపోర్టు
పై వాటిలో ఏదైనా ఒకటి.
కొవిడ్-19 యొక్క వైద్య చికిత్స/ రోగనిర్ధారణకు మద్దతుగా డాక్యుమెంట్ కాపీ
ఫారం-1/ ఫారం-4ఎ
పై వాటితోపాటు దిగువ సూచించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవలెను.
మరణించిన వారి మరణ ధ్రువీకరణ పత్రం యొక్క కాపి
వారసుల అఫిడవిట్
సహాయం అందుకునే వారసులు బ్యాంక్ పాస్ బుక్/క్రాస్ చెక్ (ఐఎస్ఎస్సి కోడ్ వున్న) కాపి లేదా జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద స్వయంగా (ఆఫ్లైన్) అందజేయడం ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చును.
మరణించిన వారి వారసులు దరఖాస్తుదారుకు దరఖాస్తుపై నిర్ణయం పట్ల ఏదేని ఆక్షేపణ/ఫిర్యాదు ఉన్నట్లయితే ఆన్లైన్ పోర్టల్ http://covid19.ap.gov.in/exgratia నందుగల ఫిర్యాదుల పరిష్కారం కమిటీకి దరఖాస్తు చేయవచ్చును. లేదా స్వయంగా కలెక్టరు కార్యాలయంలో దాఖలు చేయవచ్చును. ఎక్స్ షియా/పోర్టలు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుపై ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే హెల్ప్ లైన్ నెం. 104ను సంప్రదించవచ్చును.
No comments:
Post a Comment