NMMS ఉపకార వేతనాలకు ఎంపికైన వారు వివరాలు నమోదు చేయండి.గత ఫిబ్రవరిలో జరిగిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు తప్పకుండా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో నవంబరు 15 లోపు నమోదు చేసుకోవాలి. వివరాలు www.scholarships.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని, లేకపోతే కేంద్ర మానవవనరుల శాఖ ఉపకార వేతనాలు మంజూరు చేయదన్నారు. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఎంపికై, గతేడాదిలో పోర్టల్‌లో నమోదు చేసుకుని ఉపకార వేతనాలు పొందిన ప్రతి విద్యార్థి ఈ ఏడాది కూడా తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు. పాఠశాల/కళాశాల పరిధిలో విద్యార్థుల వివరాలు ఆమోదించడానికి డిసెంబరు 15, 2021, జిల్లా విద్యాశాఖాధికారి పరిధిలో వివరాలు ఆమోదించేందుకు డిసెంబరు 31, 2021 ఆఖరు తేదీగా నిర్ణయించారన్నారు. వివరాలకు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లోగాని, డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు
No comments:
Post a Comment