APTF VIZAG: రాష్ట్ర పథక సంచాలకులు,అమరావతి వారు మూడవ తేదీన జెవికె 2 కిట్స్ పంపిణి మీద నిర్వహించిన వెబెక్స్ మీటింగ్ యొక్క ముఖ్యాం శాలు

రాష్ట్ర పథక సంచాలకులు,అమరావతి వారు మూడవ తేదీన జెవికె 2 కిట్స్ పంపిణి మీద నిర్వహించిన వెబెక్స్ మీటింగ్ యొక్క ముఖ్యాం శాలు

1. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నప్రతి విద్యార్థికి అనగా  కొత్తగా ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్స్ పొందిన  విద్యార్థులకు కూడా జె వి కె కిట్స్ 100 శాతం వెంటనే అందచేయాలని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు 

2. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో,మండల పరిధిలో  మిగిలివున్న జె వి కె కిట్స్ ను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు మరియు మండల విద్యాశాఖాధికారి ,ముందుగా అవసరమైన స్కూల్స్ కు సర్దుబాట్లు చేయవలెను ,  ఆ  తర్వాత మిగిలినవి మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా కార్యాలయమునకు పంపితే అవసరాన్ని బట్టి మండలాల మధ్య సర్దుబాటు చేయవలేనని ఆదేశించివున్నారు. అలాగే స్కూల్స్ కి తగ్గిన,మిస్ మ్యాచ్ మరియు ,డామేజ్ అయిన జె వి కె కిట్స్ వివరములు నిర్దేశిత ప్రొఫార్మ్ లో నింపి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా జిల్లా కార్యాలయమునకు పంపవలెనని తెలియచేసివున్నారు. 

3. జె వి కె కిట్స్ పంపిణి  ఆఫ్ లైన్ లో ఇప్పటికే 100 శాతం పంపిణి జరిగి ఉండాలని అలాగే యాప్ ద్వారా కూడా  బయోమెట్రిక్ అదెంటిఫికేషన్ 100 శాతం పూర్తిచేయుటకు అవసరమైన చర్యలు చేపట్టి 100 శాతం పూర్తీ చేయాలని  ఆదేశించారు 

4. బయోమెట్రిక్ డివైజెస్  పనిచేయని చోట సచివాలయ సిబ్బంది నుంచి డివైజెస్ తీసుకొని పూర్తి చేయవలెనని ఆదేశించారు 

5. జె వి కె సాంకేతిక సమస్యలు ఉంటే మండల కార్యాలయ సిబ్బంది ద్వారా నిర్దేశిత కన్సాలిడేటెడ్ ప్రొఫార్మా లో ఒకేసారి అన్ని స్కూల్ సమస్యలు పంపవలెను 

6. జె వి కె కిట్స్ పంపిణి యాప్ ద్వారా ఎంత శాతం పూర్తి చేస్తారో దాని కనుగుణంగానే  అయా మండల మరియు స్కూల్ గ్రాంట్ నిధులు ఖచ్చితముగా అంతే  శాతం మాత్రమే మంజూరు చేయబడునని హెచ్చరించారు ,గమనించగలరు.  

7. స్వచ్ఛ పక్వడ పోగ్రాం విధిగా పాఠశాలల్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సంభందిత ఫోటోలను వీడియోలు జిల్లా కార్యాలయమునకు మెయిల్ చేయాలనీ ఆదేశించారు

No comments:

Post a Comment