APTF VIZAG: ఉదయం తొమ్మిదినుంచే బ్యాంకులు ఒంటి గంట వరకులావాదేవీలు

ఉదయం తొమ్మిదినుంచే బ్యాంకులు ఒంటి గంట వరకులావాదేవీలు

పాక్షిక లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంకులుకూడా తమ పనివేళ్లలో మార్పులు చేసుకుంటున్నాయి. గురువారం నుంచి కొత్త వేళలు అమలులోకి వస్తాయి. ఉదయం తొమ్మిది గంటలకే బ్యాంకు లావాదేవీలు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతాయి. కరోనా కారణంగా కొద్ది రోజులుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేసిన బ్యాంకులు నేటి నుంచి ఒక గంట ముందుగానే తెరుచుకోనున్నాయి.

 కరోనా ఉధృతి కారణంగా గురువారం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వ్యాపార లావాదేవీలకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత అన్నీ మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగానే బ్యాంకులు కూడా త్వరగా తెరిచి ఒంటి గంటకు లావాదేవీలు పూర్తి చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు అన్ని శాఖలకు సూచనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment