ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షలపై నెలాఖరున స్పష్టత ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు వి.చినవీరభద్రుడు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జీఎంసీ బాలయోగి సైన్స్ పార్కును ఆయన బుధవారం సందర్శించి విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా ఉపాధ్యాయులు సహకారం అందించాల్సింది పోయి రాద్ధాంతాలు చేయడం సహేతుకం కాదన్నారు.
సీబీఎస్‌ఈ విధానం అమలులో భాగంగా 80% ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్, 20% ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను పాఠ్యపుస్తకాల్లో పొందుపరుస్తామని చెప్పారు. ‘మనబడి నాడు-నేడు’ పథకం రెండోదశలో 16,400 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment