APTF VIZAG: 2డీజీ ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్ Medicine Released

2డీజీ ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్ Medicine Released

★ కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన ‘2డీజీ(2-డియాక్సీ డి-గ్లూకోజ్‌)’ ఔషధం విడుదలైంది. 

★ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తొలి బ్యాచ్‌ 2డీజీ సాచెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు అందించారు.

★ ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. 2డీజీ ఔషధంతో కొవిడ్‌ రికవరీ సమయం తగ్గడంతో పాటు ఆక్సిజన్‌ అవసరం కూడా తగ్గుంతుందని అన్నారు. 

★ తొలి విడతలో  10వేల సాచెట్లను అందుబాటులోకి తెచ్చారు. మే 27, 28 తేదీల్లో రెండో విడతలో భాగంగా మరిన్ని సాచెట్లను విడుదల చేస్తామని,

★ జూన్‌ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ తెలిపింది. 

★ కరోనా కట్టడి కోసం డీఆర్‌డీవో ఏడాది పాటు శ్రమించి ఈ ఔషధాన్ని తీసుకొచ్చింది. గతంలో దీన్ని క్యాన్సర్‌ కోసం తయారుచేశారు.

No comments:

Post a Comment