APTF VIZAG: People are not wearing Mask 100 Rupees Fine Announced By Honorable CM

People are not wearing Mask 100 Rupees Fine Announced By Honorable CM

మాస్క్‌ ధరించకపోతే జరిమానా అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం
అమరావతి: మాస్క్‌ ధరించకపోతే జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకోవాలని.. లేనిపక్షంలో రూ.100 జరిమానా విధించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ పరిస్థితులపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
1నుంచి 9 తరగతులకు సెలవులు ప్రకటించామని.. హాస్టళ్లు, కోచింగ్‌ సెంటర్లు సైతం మూసివేయాలన్నారు. ఫంక్షన్‌ హాళ్లలో రెండు కుర్చీల మధ్య ఆరు అడుగుల దూరం.. థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని జగన్‌ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results