APTF VIZAG: ఆంధ్రప్రదేశ్ ఆదర్శపాఠశాలలో 2021 - 22 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలోనికిప్రవేశం కొరకు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ఆదర్శపాఠశాలలో 2021 - 22 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలోనికిప్రవేశం కొరకు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు )లో 2021 - 22 విద్యా సంవత్సరంనకు 6వ తరగతిలో విద్యార్థులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ఆ ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్యమం ఆంగ్లంలో ఉంటుంది.

Click Here To Apply Online

ప్రవేశ అర్హతలు :

వయస్సు : OC/BC కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2009 మరియు 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి.

SC/ST కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2007 మరియు 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి.

సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరవధికంగా 2019 - 20 మరియు 2020 - 21 విద్యా సంవత్సరంలు చదివి ఉండాలి.

2020-21 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.

దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారపత్రం కొరకు www.cse.ap.gov.in

apms.ap.gov.in చూడగలరు.

దరఖాస్తు చేయు విధానం.

అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించి సంతృప్తి చెందినతర్వాత తేది : 16.04.2021 నుండి 15.05.2021 వరకు net banking/Credit/Debit cards ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తర్వాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించడం జరుగుతుంది.

ఆ జనరల్ నెంబరు ఆధారంగా ఏదేని ఇంటర్నెట్ కేంద్రంలో.

apms.ap.gov.in (online) లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకోవడానికి రుసుము :

OC/BC రూ.100

SC/ST రూ.50

ప్రవేశములు లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4