ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించేందుకు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఇసి) హైకోర్టును కోరింది. కరోనా రెండో దశపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉందని, ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తే ప్రభుత్వంపై అదనపు నిధులు వ్యయం అవుతుందని చెప్పింది. బ్యాలెట్ బ్యాక్సుల భద్రతకు చాలా వ్యయం అవుతుందని ఎస్ఐసీ కార్యదర్శి కన్నబాబు హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. టిడిపి నేత వర్ల రామయ్య, బిజెపి వేర్వేరుగా వేసిన వ్యాజ్యాల్లో ఎన్నికలపై సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. దీనిపై అప్పీల్ చేయడంతో ఎన్నికలు నిర్వహించేందుకు అడ్డంకులు తొలగి పోయాయి. ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి అంశాలను సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని డివిజన్ బెంచ్ పేర్కొనడంతో కన్నబాబు పైవిధంగా కౌంటర్ పిటిషన్ వేశారు.
No comments:
Post a Comment