APTF VIZAG: April 2020

MANABADI NADU NEDU WEBSITE CHANGED


 మనబడి  నాడు-నేడు వెబ్సైట్  ను
 http://manabadi.ap.gov.in/
గా మార్పులు చేశారు.User Id , Password లో మార్పు లేదు. వెబ్సైట్ లో కూడా ఏ మార్పులు లేవు.
Click Here To NEW MANABADI NADU NEDU WEBSITE

5 DAYS SPECIAL COURSE ON E-CONTENT THROUGH WEBINARS (YOUTUBE LIVE)


AP SCERT  5 రోజులు పాటు జరిగిన వెబినార్స్ యొక్క పూర్తి వివరాలు చక్కని విశ్లేషణతో సులభంగా అర్ధం చేసుకునే రీతిలో,తెలుగులో ఒకే "పీ.డి.ఎఫ్" ఫైల్ లో..
వెబినార్స్ ను ప్రతీరోజూ  ఆసాంతం వీక్షించి, దీన్ని రూపొందించినవారు వెంకటేష్.బట్న,SGT,MPUPS, మాకన్నపురం,సోంపేట మండలం,శ్రీకాకుళం జిల్లా.
Click Here To E-CONTENT THROUGH WEBINARS (YOUTUBE LIVE)

Half Salary with one day Basic Pay for CMRF Gross Ammount

Memo Dt.27/4/2020 ప్రకారం పూర్తి జీతం తీసుకొనేవారికి మాత్రమే డిడడక్షన్స్ ఉంటాయి. అలాగే ఒకరోజు బేసిక్ కట్ చేయడం కూడా. మిగతా సగం జీతం తీసుకొనే ఉద్యోగులకు ఎటువంటి మినహాయింపులు లేకుండా గత నెల లాగే జీతాలు చెల్లింపు.
CORONA  నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు యొక్క జీతాలను 50% ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది .  మూలవేతనం కి సగం కి ఇచ్చిన తరువాత  మీ యొక్క పే కి 12 ,14.5% ,20% HRA చొప్పున ఎంత Gross Half అమౌంట్ వస్తుంది అనేది చూపించడం జరిగింది.


PM KISAN ELIGIBLE CANDIDATES LIST

పీఎం కిసాన్ పథకం కు సంబంధించిన అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన క్రమంలో కొత్తగా అర్హత సాధించిన వారితో సహా లబ్ధిదారుల వివరాలను అప్డేట్ చేసింది.ఈ జాబితాలో ఉన్న వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూపాయలు 6000 అందుతాయి.మీ పేరు ఉందా?లేదా? అనేది తెలుసుకోవడం కోసం 
ఇక్కడ క్లిక్ చేయండి.Click Here To Know Eligible Candidates List
పై లింక్ ని క్లిక్ చేసి మీ యొక్క రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం ను ఇచ్చి గెట్ డేటా ను క్లిక్ చేయగానే మీ గ్రామం లో అర్హత పొందిన వారి యొక్క వివరాలను చూపిస్తుంది.

Abhyasa - AP state education dept learning app


ఆన్‌లైన్‌ లో పాఠాలు నేర్చుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  విద్యాశాఖ  అభ్యాస అనే యాప్‌ ను రూపొందించడం జరిగింది.
యూజర్ ఐ డీ - TREASURY ID (with or without zero) 
పాస్ వర్డ్ - abc@123
SGT, SA, COMPLEX HM, CRP, MEO లు కూడా ఇందులో జాయిన్ అనవచ్చును.

📚CLEP 2 COURSE ENROLLMENT STARTED IN ABHYASA APP📚
HOW TO ENROLL CLEP 2 PROGRAMME IN ABHYASA APP
 

Step 1: Open 'ABHYASA' APP
Step 2: Click on 'COURSES'
Step 3: Select 'CLEP Phase 2 training'
Step 4: Click on 'ENROLL IN COURSE'
Step 5: Check Ongoing courses and click on CLEP phase 2 batch 'Enroll'
Step 6: Enrollment completed.Click on start to view Webinar, Reading Material, Assessment.

LIVE...Live.. SCERT E-content webinar FOR TEACHERS


Today topic: DIKSHA WORK SPACE 
APSCERT  YOUTUBE చానల్ ద్వారా ఈ కంటెంట్ పై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంది.




YouTube Channel e content

AP SCERT : Conducting Webinar to teachers on e-content creation Basic level on SCERT youtube channel from 23.04.2020 to 27.04.2020 (Webinar Time: 2 to 3 PM)
ఆసక్తి గల ఉపాద్యాయులు ఎవరైనా పాల్గొనవచ్చును.
Click Here To Download Shedule 

మీ పిల్లలకు ఏ మాధ్యమం కావాలి?Parents Selected TM or EM IN Schools

వారం రోజుల్లో తల్లిదండ్రుల  మాధ్యమ ఎంపిక ప్రక్రియ పూర్తి.ఈనెల 30లోపు పూర్తి చేసేందుకు  క్షేత్రస్థాయిలో చర్యలు.ప్రత్యేక ఫారం రూపకల్పన.ఇంటింటికీ వెళ్లి ఐచ్ఛికాలు సేకరించనున్న వాలంటీర్లు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని వచ్చే ఏడాది ఏ మాధ్యమంలో చదివించాలనుకుంటున్నారో ఎంపిక చేసుకునే ప్రక్రియను వారం రోజుల్లో ముగించాలని విద్యాశాఖ భావిస్తోంది. మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన కార్యకలాపాలపై అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈనెల 30వ తేదీలోపు తల్లిదండ్రుల నుంచి మాధ్యమ ఎంపిక ఐచ్ఛికాలను తీసుకోవడం పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.
Click Here To Download Proforma for option form
ప్రక్రియ ఇలా.
పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ నుంచి పిల్లలు, తల్లిదండ్రుల వివరాలను జిల్లాలకు పంపిస్తారు. అక్కడి నుంచి వాటిని మండల విద్యాధికారులకు అందిస్తారు. మండల స్థాయిలోని కమ్యూనిటీ రిసోర్సు పర్సన్‌లు విద్యార్థులు, తల్లిదండ్రుల డేటాతోపాటు తల్లిదండ్రుల మాధ్యమ ఎంపిక ఫారాలను వార్డు, గ్రామ సచివాలయం వాలంటీర్లకు అప్పగిస్తారు. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు మాధ్యమ ఎంపిక పత్రాలను అందించి, వారితో పూర్తి చేయించిన పత్రాలను తీసుకుంటారు.
ప్రత్యేక దరఖాస్తు ఫారం రూపకల్పన.
తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకునేందుకు ప్రత్యేక దరఖాస్తు ఫారంను రూపొందించారు. ‘‘మా కుమారుడు/కుమార్తె వచ్చే విద్యాసంవత్సరం 2020-2021లో ఈ---- తరగతి చదవబోతున్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలుగు తప్పనిసరిగా బోధిస్తూ.. ఆంగ్ల మాధ్యమం/ తెలుగు మాధ్యమం/ ఇతర భాష మాధ్యమంలో చదివించాలని కోరుకుంటున్నాం. తమ ఎంపికను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొంటూ దరఖాస్తు ఫారం చివరన తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఫారంలో పేర్కొన్న మాధ్యమాల్లో నుంచి ఒక దాన్ని ఎంపిక చేసుకునేందుకు మాధ్యమం ఎదురుగా టిక్‌ మార్కు చేయాలి. మాధ్యమ ఎంపికను ధ్రువీకరిస్తూ గ్రామ/వార్డు వాలంటీరు ఇదే దరఖాస్తు ఫారంలో సంతకం చేసేలా దీన్ని రూపొందించారు.

 ప్రస్తుతం 1-5 తరగతులు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఐచ్ఛికాలు తీసుకుంటారు. వీరు వచ్చే ఏడాది 2-6 తరగతిలో ప్రవేశాలు పొందనున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 18లక్షల మంది విద్యార్థులున్నారు.

మండల స్థాయిలోనే దరఖాస్తు ఫారాలు
దరఖాస్తు ఫారాలు, విద్యార్థుల డాటాలను మండలస్థాయిలో జిరాక్స్‌ తీసేందుకు సమగ్రశిక్ష అభియాన్‌ నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఒక్కో ఎంఈవోకు రూ.10వేలు కేటాయించారు. వాలంటీర్లు తల్లిదండ్రుల నుంచి ఐచ్ఛికాలు సేకరించిన తర్వాత సచివాలయాల వారీగా మదింపు చేసిన డాటాను మండల విద్యాధికారులకు పంపిస్తారు. ఇక్కడి నుంచి జిల్లా విద్యాధికారులకు, ప్రభుత్వానికి వెళ్తాయి. తల్లిదండ్రులు సమర్పించిన అసలు దరఖాస్తు ఫారాలను మాత్రం మండల స్థాయిలోనే ఉంచనున్నారు.
Medium of Instruction in all Government schools in the State – Parents committee resolutions – Obtaining the choice on medium of instruction from parents GO.20 DT:21.04.20
ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు తమ పిల్లలు ఏ మాధ్యమంలో చదవాలో ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థుల తల్లిదండ్రులకే ప్రభుత్వం కల్పించింది.
మాధ్యమ ఎంపిక చేసుకుని ఫారాలు సేకరించే బాధ్యత గ్రామ సచివాలయలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ.
Click Here To Download Go 

GRAMA /WARD VALANTEERS NOTIFICATIONS


ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయం లో మిగిలి ఉన్న వాలంటీర్  పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
నోటిఫికేషన్ ప్రకారం ఈరోజు నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
 TENTATIVE TIMELINE: 
➡ Notification inviting applications 20-04-2020
➡ Receipt of application 20-04-2020 to 24-04-2020
➡ Scrutiny of applications By 25-04-2020
➡ Interviews by selection committees 27.04.2020 to 29.04.2020
➡ Intimation letters to selected volunteers 27.04.2020 to 29.04.2020
➡ Positioning of volunteers 01-05-2020
CLICK HERE TO ONLINE APPLICATION ఆన్లైన్ అప్లికేషన్ కి ఇక్కడ నోక్కండి.
Click Here To Download Notification

PD Accounts నిర్వహణ మరియు School Grants withdrawl పై అవగాహన కొరకు పూర్తి వివరాలు.

P.D.ACCOUNT OPEARATION-STAGE-1


🖥 ముందుగా మీ యొక్క లాగిన్ ఐడి ద్వారా CFMS Website లోకి లాగిన్ అవ్వండి.
Click Here To LOGIN CFMS WEBSITE 

🖥 అక్కడ Expenditure Tab కింద “WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ ఉందో లేదో చెక్ చేయండి.
🖥 "WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ పై క్లిక్ చేయండి.
🖥 “+” గుర్తుపై క్లిక్ చేసి “Maker” గా(HM)ను assign చేయండి.
🖥 తర్వాత “Authorizer” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేసి “Authorizer” గా(HM)ను assign చేయండి.
🖥 తర్వాత “Applications” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేయండి.”Functions” పై క్లిక్ చేసి 29 PD Scheme Master Data Plan తర్వాత 30 Non Works Sanctions Work Flow Configuration సెలెక్ట్ చేయండి. Position దగ్గర HM ను సెలెక్ట్ చేయండి.
🖥 తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.
🖥 అప్పుడు కొత్తగా మరో 2 టైల్స్ కనబడతాయి Office Sanction Workflow Configuration. PD Scheme Master and Plan.
🖥 తర్వాత “Office Sanction Workflow Configuration” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేసి “Maker” గా(HM)ను assign చేయండి.
🖥 తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.
🖥 అప్పుడు కొత్తగా మరో టైల్ “Contingent Expenditure” కనబడుతుంది.
🖥 మీ PD Account లో ఉన్న గ్రాంట్సు వివరాలు అన్ని Check చేసుకోవడం కోసం “WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ పై క్లిక్ చేయండి. తర్వాత “Reports” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేయండి.”Functions” పై క్లిక్ చేసి *4-PD Account Statement సెలెక్ట్ చేయండి. *Position దగ్గర HM ను సెలెక్ట్ చేయండి.
🖥 తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.
🖥 అప్పుడు కొత్తగా మరో టైల్ “PD Account Statement” కనబడుతుంది.
🖥 “PD Account Statement” అనే టైల్ పై క్లిక్ చేయండి వివరాలు నింపి “Display Transactions పై క్లిక్ చేస్తే మీ పాఠశాల యొక్కPD Account లో ఉన్న గ్రాంట్సు వివరాలు అన్ని Display అవుతాయి.మీరు Print కూడా తీసుకోవచ్చు.
రెండవ Stage లో Grants Mapping ,Sanction Order తయారు చేయడం Bill Submit చేయడం గురించి తెలుసుకుంటారు.

రెండవ దశలో ముఖ్యాంశములు :

A.గ్రాంట్లను మన PD Account కు Mappingచేయుట
B.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Sanction Order తయారు చేయడం.
C.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Bill తయారు చేసి Submit చేయడం.

A.గ్రాంట్లను మన PD Account కుMappingచేయుట.:

🖥 “PD Scheme Master and Plan” అనే టైల్ పై క్లిక్ చేయండి.
🖥 మీ DDO Code మరియు PD HOA (8448001101512001002VN ) సరిపోయిందో లేదో చెక్ చేసుకొని,
🖥 “PD Scheme Master” పై క్లిక్ చేయండి.
🖥 “Select Scheme ” దగ్గర 1369-SAMGRA SIKSHA ని Select చేసి “+” గుర్తుపై క్లిక్ చేయండి.Sub Scheme Description దగ్గర “SCHOOL GRANT “ అని టైప్ చేసి Save చేయండి.
🖥 ఇప్పుడు 79120-SCHOOL GRANT పై డబుల్ క్లిక్ చేసి,తర్వాత వచ్చే స్క్రీన్ లో “+” గుర్తుపై క్లిక్ చేయండి.
🖥 తర్వాత వచ్చే స్క్రీన్ లో Activity Code లో 310 అని టైప్ చేసి 310-GRANTS-IN-AID ని సెలెక్ట్ చేసి Save చేయండి.
🖥 ఇప్పుడు 310-GRANTS-IN-AID పై డబుల్ క్లిక్ చేసి,తర్వాత వచ్చే స్క్రీన్ లో “+” గుర్తుపై క్లిక్ చేయండి.
🖥 తర్వాత వచ్చే స్క్రీన్ లో Purpose Code లో 312 అని టైప్ చేసి 312-OTHER GRANTS-IN-AIDని సెలెక్ట్ చేసి Save చేయండి.
🖥 తర్వాత Home Button పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.
🖥 “PD Scheme Master and Plan” అనే టైల్ పై క్లిక్ చేయండి.
🖥 తర్వాత “Maintain PD Scheme Plan” పై క్లిక్ చేయండి.
🖥 తర్వాత వచ్చే స్క్రీన్ లో మీ DDO Code మరియు PD HOA (8448001101512001002VN ) సరిపోయిందో లేదో చెక్ చేసుకొని,
🖥 “Maintain/Edit Plan” పై క్లిక్ చేయండి.
🖥 తర్వాత వచ్చే స్క్రీన్ లో “Select Deposit “ దగ్గర Click చేసి Grant ను సెలెక్ట్ చేయండి.అప్పుడు మీకు ఇంతకు ముందు మీరు Save చేసిన Scheme వివరాలు Display అవుతాయి, అప్పుడు మీ Grant Amount ను సున్నాఉన్న దగ్గర వేసి Save చేయండి. దీనితో మీ యొక్క పాఠశాల గ్రాంటును Maping చేయడం పూర్తి అయినది.
🖥 తర్వాత Home Button పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.

B.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Sanction Order తయారు చేయడం.:

🖥 “Contingent Expenditure” అనే టైల్ పై క్లిక్ చేయండి.
🖥 తర్వాత వచ్చే స్క్రీన్ లో “Create “పై క్లిక్ చేయండి.
🖥 తర్వాత “Non Works Sanction Orders “పై క్లిక్ చేయండి.
🖥 తర్వాత “Contingent Expenditure Sanction “పై క్లిక్ చేయండి.
🖥 తర్వాత “Org Unit “ దగ్గర మీ స్కూల్ పేరు సెలెక్ట్ చేయండి.
🖥 Type of Expenditure దగ్గర 312-OTHER GRANTS-IN-AIDని సెలెక్ట్ చేయండి.
🖥 తర్వాత Sanction Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి.
🖥 తర్వాత Subject దగ్గర మీరు దేని నిమిత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అది వ్రాయండి
🖥 తర్వాత Reference దగ్గర మీరు Proc Rc No వ్రాయండి,
🖥 HOA/DDO దగ్గర PD HOA సెలెక్ట్ చేయండి.
🖥 Department దగ్గర PUBLIC DEPOSIT సెలెక్ట్ చేయండి.
🖥 HOA దగ్గర 8448001101512001002VN సెలెక్ట్ చేయండి.
🖥 DDO Code దగ్గర మీ స్కూల్ DDO Code సెలెక్ట్ చేయండి.
🖥 Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి
🖥 PD SCHEME DETAILS దగ్గర మీరు ఇంతకుముందు Mapping చేసినప్పుడు ఇచ్చిన వివరాలు నింపండి.
🖥 Sanction Summary & Pay Out Schedule వివరాలు నింపండి.
🖥 Order దగ్గర Sanction Order Type చేసి Save చేయండి.
🖥 Work Flow దగ్గర Add New Work Flow పై క్లిక్ చేసి HM పేరు సెలెక్ట్ చేయండి.
🖥 Note and Documents post చేసి Save చేయండి,తర్వాత SEND పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.
🖥 మీ యొక్క విత్ డ్రా కు సంబంధించిన Sanction Order తయారు అయినది.

C.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Bill తయారు చేసి Submit చేయడం.:
📱 ఇక్కడి నుండి జీతం బిల్లు చేసినట్టుగానే చేయాలి.📱


🖥 “Bill Life Cycle Management” అనే టైల్ పై క్లిక్ చేయండి.
🖥 తర్వాత వచ్చే స్క్రీన్ లో “Create Bill “పై క్లిక్ చేయండి.
🖥 తర్వాత “Personal Deposit Accounts “సెలెక్ట్ చేయండి.
🖥 తర్వాత “PD Disbursement Bill “సెలెక్ట్ చేయండి.
🖥 తర్వాత Bill Subject దగ్గర “School Grant “ అని వ్రాయండి.
🖥 తర్వాత Sub Types దగ్గర “312-Other Grants-in-Aid “సెలెక్ట్ చేయండి.
🖥 తర్వాత HOA దగ్గర 8448001101512001002VN సెలెక్ట్ చేయండి.
🖥 తర్వాత Org Unit దగ్గర మీ స్కూల్ పేరు సెలెక్ట్ చేయండి.
🖥 తర్వాత Gross Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి.
🖥 తర్వాత Order Reference దగ్గర Sanction Order వివరాలు ఆటోమేటిక్ గ వస్తాయి.
🖥 DISBURSEMENT TRACKING దగ్గర Bill సెలెక్ట్ చేసి Bill No సెలెక్ట్ చేయండి.
🖥 BENEFICIARY DETAILS Code దగ్గర ఎవరికి డబ్బు చెల్లించాలో వారి CFMS ID వేయాలి.
🖥 CHECKLIST & DECLARATION పూర్తి చేయాలి.
🖥 NOTES AND DOCUMENTS Post చేసి బిల్లులు ,వౌచర్లు స్కాన్ చేసి Upload చేయాలి.
🖥 Save చేసి Send చేయాలి .
🖥 తర్వాత బిల్లు Authorizer Inbox లోకి వస్తుంది.DDO/HM Biometric వేసి Submit చేయాలి.

హౌసీ గేంషోలో పాల్గొనండి - మొబైల్ డేటాను గెలుపొందండి


Stay Safe - Stay Home. సురక్షితంగా ఉండండి - ఇంట్లోనే ఉండండి.కరోనా మహమ్మారిని తరిమికొట్టండి
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్భంగా జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.క్షణం తీరిక లేకుండా ఉరుకుల పరుగుల జీవనంలో ఇంటిపట్టునే ఉండడం కాస్తంత కష్టమనే చెప్పాలి.
లాక్ డౌన్ సందర్భంగా ఇంటికే పరిమితమైన వారికి కాస్తంత ఆటవిడుపు గా "రేడియో అల 90.8 ఎఫ్.ఎం" ఆన్‌లైన్ హౌసీ గేం షో నిర్వహిస్తుంది.
ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటలకు హౌసీ గేం షో ప్రారంభమౌతుంది.
దీనికి మీరు చేయవలసిందల్లా గూగుల్ ప్లే స్టోర్ నుండి రేడియో అల 90.8 ఎఫ్.ఎం యాప్  ను డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ కావడమే.రిజిస్టర్ మొబైల్ నంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ అయితే హౌసీ టికెట్ మీ మొబైల్ లో ప్రత్యక్షమౌతుంది.
Click Here To Download ALA 90.8 FM APP యాప్ కోసం ఇక్కడ నోక్కండి.

రిజిస్ట్రేషన్ సందర్భంగా సాంకేతిక ఇబ్బందులు ఎదురైన ఎడల 7794922345 నంబర్ కు వాట్సాప్ ద్వారా తెలియ చేసినట్లయితే మా సహాయ సిబ్బంది మీకు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది.

DOWNLOAD AROGYA SETHU ANDROID, IPHONE APP

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఆరోగ్య సేతు అప్లికేషన్ తప్పనిసరిగా తమ ఫోన్లలో ఉపయోగించవలిసిందిగా ఉత్తర్వులు విడుదల.
Strategies to encourage download of AROGYA SETU App by all State, Central Govt. Employees G.O.Rt.No.254, Dated.28.04.2020.
ఆరోగ్య సేతు ఆప్ ని ఇన్స్టాల్ చేసుకొని మీ చుట్టు పక్కల కోవిడ్ లక్షనాలతో ఉన్నవారి అలెర్ట్స్ పోందవచ్చు.
Aarogya Setu app to fight against COVID19. Please download and share it using this link.
Click Here To Download AROGYA SETHU Android App
Click Here To Download AROGYA SETHU IPHONE APP

Distribution of Dry ration upto 23rd April



Distribution of Dry Ration consisting of Rice, Eggs and Chikkis to all the School Children as per the daily entitlement of the child, to prevent the spread of COVID-19 upto 23rd April,2020. Memo.No.ESE01, Dated: 02-04-2020

Featured post

Ap open school 10th Class and intermediate results