APTF VIZAG: మీ పిల్లలకు ఏ మాధ్యమం కావాలి?Parents Selected TM or EM IN Schools

మీ పిల్లలకు ఏ మాధ్యమం కావాలి?Parents Selected TM or EM IN Schools

వారం రోజుల్లో తల్లిదండ్రుల  మాధ్యమ ఎంపిక ప్రక్రియ పూర్తి.ఈనెల 30లోపు పూర్తి చేసేందుకు  క్షేత్రస్థాయిలో చర్యలు.ప్రత్యేక ఫారం రూపకల్పన.ఇంటింటికీ వెళ్లి ఐచ్ఛికాలు సేకరించనున్న వాలంటీర్లు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని వచ్చే ఏడాది ఏ మాధ్యమంలో చదివించాలనుకుంటున్నారో ఎంపిక చేసుకునే ప్రక్రియను వారం రోజుల్లో ముగించాలని విద్యాశాఖ భావిస్తోంది. మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన కార్యకలాపాలపై అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈనెల 30వ తేదీలోపు తల్లిదండ్రుల నుంచి మాధ్యమ ఎంపిక ఐచ్ఛికాలను తీసుకోవడం పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.
Click Here To Download Proforma for option form
ప్రక్రియ ఇలా.
పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ నుంచి పిల్లలు, తల్లిదండ్రుల వివరాలను జిల్లాలకు పంపిస్తారు. అక్కడి నుంచి వాటిని మండల విద్యాధికారులకు అందిస్తారు. మండల స్థాయిలోని కమ్యూనిటీ రిసోర్సు పర్సన్‌లు విద్యార్థులు, తల్లిదండ్రుల డేటాతోపాటు తల్లిదండ్రుల మాధ్యమ ఎంపిక ఫారాలను వార్డు, గ్రామ సచివాలయం వాలంటీర్లకు అప్పగిస్తారు. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు మాధ్యమ ఎంపిక పత్రాలను అందించి, వారితో పూర్తి చేయించిన పత్రాలను తీసుకుంటారు.
ప్రత్యేక దరఖాస్తు ఫారం రూపకల్పన.
తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకునేందుకు ప్రత్యేక దరఖాస్తు ఫారంను రూపొందించారు. ‘‘మా కుమారుడు/కుమార్తె వచ్చే విద్యాసంవత్సరం 2020-2021లో ఈ---- తరగతి చదవబోతున్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలుగు తప్పనిసరిగా బోధిస్తూ.. ఆంగ్ల మాధ్యమం/ తెలుగు మాధ్యమం/ ఇతర భాష మాధ్యమంలో చదివించాలని కోరుకుంటున్నాం. తమ ఎంపికను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొంటూ దరఖాస్తు ఫారం చివరన తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఫారంలో పేర్కొన్న మాధ్యమాల్లో నుంచి ఒక దాన్ని ఎంపిక చేసుకునేందుకు మాధ్యమం ఎదురుగా టిక్‌ మార్కు చేయాలి. మాధ్యమ ఎంపికను ధ్రువీకరిస్తూ గ్రామ/వార్డు వాలంటీరు ఇదే దరఖాస్తు ఫారంలో సంతకం చేసేలా దీన్ని రూపొందించారు.

 ప్రస్తుతం 1-5 తరగతులు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఐచ్ఛికాలు తీసుకుంటారు. వీరు వచ్చే ఏడాది 2-6 తరగతిలో ప్రవేశాలు పొందనున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 18లక్షల మంది విద్యార్థులున్నారు.

మండల స్థాయిలోనే దరఖాస్తు ఫారాలు
దరఖాస్తు ఫారాలు, విద్యార్థుల డాటాలను మండలస్థాయిలో జిరాక్స్‌ తీసేందుకు సమగ్రశిక్ష అభియాన్‌ నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఒక్కో ఎంఈవోకు రూ.10వేలు కేటాయించారు. వాలంటీర్లు తల్లిదండ్రుల నుంచి ఐచ్ఛికాలు సేకరించిన తర్వాత సచివాలయాల వారీగా మదింపు చేసిన డాటాను మండల విద్యాధికారులకు పంపిస్తారు. ఇక్కడి నుంచి జిల్లా విద్యాధికారులకు, ప్రభుత్వానికి వెళ్తాయి. తల్లిదండ్రులు సమర్పించిన అసలు దరఖాస్తు ఫారాలను మాత్రం మండల స్థాయిలోనే ఉంచనున్నారు.
Medium of Instruction in all Government schools in the State – Parents committee resolutions – Obtaining the choice on medium of instruction from parents GO.20 DT:21.04.20
ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు తమ పిల్లలు ఏ మాధ్యమంలో చదవాలో ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థుల తల్లిదండ్రులకే ప్రభుత్వం కల్పించింది.
మాధ్యమ ఎంపిక చేసుకుని ఫారాలు సేకరించే బాధ్యత గ్రామ సచివాలయలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ.
Click Here To Download Go 

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today