APTF VIZAG: ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ పనీ చెప్పం. వారంలో విద్యా కానుక కిట్ల పంపిణీ. మూడో తరగతి నుండి తప్పనిసరి సబ్జెక్ట్ టీచర్లు

ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ పనీ చెప్పం. వారంలో విద్యా కానుక కిట్ల పంపిణీ. మూడో తరగతి నుండి తప్పనిసరి సబ్జెక్ట్ టీచర్లు

 ఇక ఉపాధ్యా యులు బోధన తప్ప అదనపు పని ఏదీ చెప్పబోమని రాష్ట్ర విద్యాశా ఖా మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే ఉపాధ్యా యులకు భారంగా ఉన్న వివిధ యాప్ల ను తొలగించినట్లు చెప్పారు. త్వర లోనే స్టాపు అన్ని పాఠశాలల్లో మినిస్టీరియల్ కూడా నియమిస్తామని, ఇక ఉపాధ్యాయు లపై పూర్తి స్థాయి భారం తగ్గుతుందని చెప్పా రు. నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశా లల్లో వాచ్మెన్లను నియమిం చినట్లు తెలిపారు. విద్యాకా నుక కిట్లను 78 శాతం మందికి పంపిణీ చేశామని, మిగిలిన వారికి వారంలోపు పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 86 వేల మంది టీచర్లు బదిలీలు దరఖాస్తు చేసుకోగా 58వేలమందికి బదిలీలు చేసినట్లు చెప్పారు. వీరిలో 98.3 శాతం మంది బదిలీ అయిన స్థానాల్లో చేరిపోయా రని చెప్పారు. సోమవారం మంత్రి బొత్స, విద్యాశాఖ అధికారులతో కలిసి టీచర్ల సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకోస్తున్న సంస్కర ణలను, విధి విధానాలను టీచర్ల సంఘాలకు వివరించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ మూడో తరగతి నుండి సబ్జెక్ట్ టీచర్లను తప్పనిసరి చేసినట్లు చెప్పారు. బదిలీల తర్వాత ఎక్కడైనా సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉంటే వారిని భర్తీ చేస్తామన్నారు. 90 లోపు పిల్లలున్న అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లను పెట్టలేమని, వారి పిల్లలకు మంచి విద్య కావాలనుకుంటే తల్లితండ్రులు చొరవ చూపి వారి పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్, అశ్రమ పాఠశాలల్లో చేర్చిం చాలని సలహానిచ్చారు. రాష్ట్రంలో 3 వేల ఏకోపాధ్యా య పాఠశాలలు ఉన్నాయని, ఈ స్కూళ్లు నిరంతరం నడిచేందుకు ప్రతి మండలం లో ముగ్గురు టీచర్లను రిజర్వలో ఉంచుతున్నామని చెప్పారు. డిజిటల్ విద్యను అందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని, వచ్చే డిసెంబర్ నాటికి మొత్తం 60వేల క్లాస్ట్రూమ్లో ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టాలనేది తమప్రభుత్వ నిర్ణయమని మంత్రి బొత్స తెలిపారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today