APTF VIZAG: బదిలీలపై యూట్యూబ్ లో కొన్ని క్లారిఫికేషన్లు ఇచ్చిన జేడీ సర్వీసెస్ రామలింగం గారు

బదిలీలపై యూట్యూబ్ లో కొన్ని క్లారిఫికేషన్లు ఇచ్చిన జేడీ సర్వీసెస్ రామలింగం గారు

1. సబ్జెక్ట్ కన్వర్షన్ పొందిన స్కూల్ అసిస్టెంట్/ PSHMలు కన్వర్షన్ పొందిన సబ్జెక్ట్ లోనే బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలి.

2. రెండు సం.లోపు రిటైర్ అయ్యే ఎయిడెడ్ నుండి వచ్చిన టీచర్ జూనియర్ గా ఉన్నపుడు, ఆయన తదుపరి జూనియర్ రీ అపార్షన్ మెంట్ లో కదలాలి.

3. స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ కోటా వినియోగించుకుని 8 సం. పూర్తి కాకపోతే హెడ్మాస్టర్ ఉన్న స్పౌజ్ సదరు కేటగిరీలో దరఖాస్తు చేసుకునే అవకాసం లేదు .

4. గత డిసెంబర్ లో తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్లు ప్రస్తుత బదిలీ దరఖాస్తులకు అప్ లోడ్ చేయవచ్చు.

5. ప్రిఫరెన్షియల్ కేటగిరీలో పేర్కొన్న 11 కేటగిరీలకు సంబంధించని వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే,  రాష్ట్ర స్థాయి మెడికల్ బోర్డు ఆమోదించిన తరువాతనే అట్టి వారిని ప్రిఫరెన్షియల్ కేటగిరీలో బదిలీ కోరుకునేిందుకు అనుమతిస్తారు.

6. ఒక పాఠశాలలో 2 సం.లోపు ఉపాధ్యాయుడు, 80% అంగ వైకల్యం కలిగిన ఉపాధ్యాయుడు ఉంటే 2 సం. లోపు రిటైర్మెంట్ వయసు కలిగిన వారే కదలవలసి ఉంటుంది.

7. ఎవరికి పాత స్టేషన్ పాయింట్స్ వర్తిస్తాయనేది క్లారిటీ ఇస్తారు.

No comments:

Post a Comment