జగనన్న విద్యా దీవెన పథకం కింద జనవరి- మార్చి త్రైమాసికానికి సంబంధించిన నిధులు రూ.703 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరగనున్న కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా 9.95 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల డబ్బును జమ చేయ నున్నారని తెలిపింది. 'పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుం బంలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. ఇప్పటి వరకు 26,98,728 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10,636.67 కోట్లు జమ చేశాం' అని ప్రభుత్వం వెల్లడించింది.
No comments:
Post a Comment