APTF VIZAG: ప్రైవేటు పాఠశాలల గుర్తింపు 8 ఏళ్లకు పొడిగింపు మూడేళ్లు 20 శాతంలోపు ఉత్తీర్ణత ఉంటే మూతే. విద్యాహక్కు చట్టం నిబంధనలకు సవరణ.

ప్రైవేటు పాఠశాలల గుర్తింపు 8 ఏళ్లకు పొడిగింపు మూడేళ్లు 20 శాతంలోపు ఉత్తీర్ణత ఉంటే మూతే. విద్యాహక్కు చట్టం నిబంధనలకు సవరణ.

 ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్త ర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాహక్కు చట్టం నిబంధన లను సవరించింది. ప్రైవేటు పాఠశాలల యజమానులు, ఇటీవల ఎమ్మెల్సీలుగా గెలిచిన ఎంవీ రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఇచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. గుర్తింపు గడువును మూడు నుంచి పదేళ్లకు పొడిగించాలని ఎమ్మెల్సీలు ఇచ్చిన వినతి మేరకు 8 ఏళ్లకు పొడిగించినట్లు వెల్లడించింది. ఉత్త ర్వుల ప్రకారం.. ఏటా యాజమాన్యాలు స్వీయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రత్యేక పోర్టల్ను రూపొందించాల్సి ఉంటుంది. ఇందులో అగ్నిమాపక, శానిటరీ, ఆడిట్, తనిఖీల నివేదికలను అప్లోడ్ చేయాలి. ఏదైనా పాఠశాలలో మూడేళ్లు వరసగా 20 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత ఉంటే దాన్ని మూసివేయాలి. ఒక పాఠశాల ఐదేళ్లు వరసగా మూసేసి ఉంటే దాన్ని పునఃప్రారంభించేందుకు కొత్తగా అనుమ తులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాల అడ్మినిస్ట్రేషన్, ఆడిట్ నివేదికలను సెప్టెంబరు 30లోపు సంబంధిత అధికారులకు సమర్పించాలి. పాఠశాల భవనం ఆరు మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉంటే అగ్నిమాపకశాఖ అనుమతులు అవసరం లేదు. ఇసుక బకెట్ నీళ్ల బకెట్లాంటి వాటిని తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా అర్హత కలిగిన సిబ్బం దిని నియమించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

No comments:

Post a Comment

Featured post

JVK APP updated Latest Version 1.4.6