బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సులకు సంబంధించి ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈసెట్-2023) వాయిదా పడింది. మే 5న నిర్వహించవలసిన ఈ పరీక్షను జూన్ 20కు వాయిదా వేసినట్లు ఏపీ ఈసెట్ చైర్మన్, జేఎన్టీయూకే ఉపకులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు వెల్లడించారు. పాలిటెక్నిక్ ఆఖరి సంవత్సరం పరీక్షలు పూర్తికాకపోవడంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు అభ్యర్ధన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలను
https://cets.apsche.ap.gov.in/ECET
వెబ్సైట్లో తెలుసుకోవచ్చని, సందేహాలకు 85004 04562 నంబరులో సంప్రదించాలని కన్వీనర్ ఆచార్య ఎ.కృష్ణమోహన్ తెలిపారు.
No comments:
Post a Comment