వైరస్ వల్ల తాజాగా 14 మరణాలు నమోదు
3.39 శాతానికి చేరిన రోజువారీ పాజిటివిటీ రేటు
భారత్ లో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కొన్ని రోజులుగా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది.
తాజాగా గత 24 గంటల్లో 6,050 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం ప్రకటింది.
నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13 శాతం పెరిగాయి.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వైరస్ వల్ల తాజాగా మరో 14 మరణాలు నమోదయ్యాయి.
దాంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,943కి చేరుకుంది.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉండగా, వారం వారీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
కరోన కేసుల వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర అప్రమత్తం అయింది.
కోవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
కరోనా వ్యాప్తిపై కేంద్రం క్రమం తప్పకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది.
ప్రధాని మోదీ దీనిపై అన్ని రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు.
నేడు ఆరోగ్య మంత్రి మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు’ అని ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు..
No comments:
Post a Comment