APTF VIZAG: పాఠం చెబుతుండగా గుండెపోటు కుర్చీలోనే కన్నుమూసిన ఉపాధ్యాయుడు

పాఠం చెబుతుండగా గుండెపోటు కుర్చీలోనే కన్నుమూసిన ఉపాధ్యాయుడు

 ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తున్నారు... పిల్లలంతా ఆసక్తిగా, శ్రద్ధగా వింటున్నారు... అంతలో ఒక్కసారిగా పాఠం ఆగింది... ఉపాధ్యాయుడు గుండెపోటుతో కూర్చున్న కుర్చీలోనే ఒరిగిపోయారు. ఈ హృదయ విదారక ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో చోటుచేసుకుంది. ఎ.వి.బాబు(45) మూడేళ్లుగా వాకావారిపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం పిల్లలకు తరగతి గదిలో పాఠం చెబుతుండగా గుండెపోటుకు గురై కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలు వదిలారు. నిశ్చేష్టులైన విద్యార్థులు విషయాన్ని ఇతర ఉపాధ్యాయులకు చెప్పారు. పాఠశాల పక్కన ఉన్న ఆరోగ్య ఉపకేంద్రం వైద్యసిబ్బంది చేరుకుని ఎ.వి.బాబును పరీక్షించారు. మరోపక్క 108కి సమాచారం అందించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు సిబ్బంది నిర్ధరించారు. ఎ.వి.బాబు స్వగ్రామం జె.పంగులూరు. 2002లో ఉపాధ్యాయుడిగా చేరారు. భార్య రాజామణి కొండమంజులూరులో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఉపాధ్యాయుడు తమ కళ్లముందే చనిపోవడంతో విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4