APTF VIZAG: కరోనా కలవరం.. కేంద్రం మార్గదర్శకాలు

కరోనా కలవరం.. కేంద్రం మార్గదర్శకాలు

కరోనా కలవరం.. కేంద్రం మార్గదర్శకాలు

దేశంలో కరోనా(Corona Virus) కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం(Center) అప్రమత్తమవుతోంది. మరోవైపు ఇన్‌ఫ్లుయెంజా(influenza) వ్యాప్తి కలవరపెడుతోంది. ఈ క్రమంలో ఎలాంటి అత్యవసరపరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల సంసిద్ధతను సమీక్షించేందుకు నిర్ణయించింది. అందుకోసం ఏప్రిల్‌ 10,11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్ నిర్వహించనుంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ సంయుక్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేశాయి. వైద్య సామాగ్రి, ఆక్సిజన్, ఔషధాల లభ్యతను అంచనా వేసేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఈ డ్రిల్స్‌లో పాల్గొనాలని పేర్కొన్నాయి. ఈ మాక్‌ డ్రిల్స్‌కు సంబంధించిన అన్ని వివరాలు మార్చి 27న జరిగే వర్చువల్ సమావేశం ద్వారా రాష్ట్రాలకు వివరించనున్నట్లు తెలిపాయి..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య భారీగా పడిపోయిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిబంధనల  ప్రకారం చూసుకుంటే చాలా తక్కువగా ఉందని ఆ మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లో పరీక్షల సంఖ్యను పెంచాలని, కొవిడ్ హాట్‌స్పాట్‌లను గుర్తించి, వైరస్‌ను కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిని ప్రస్తావిస్తూ..‘కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి మధ్య నుంచి ఈ పరిస్థితి కనిపిస్తోంది’ అని ఆ మార్గదర్శకాల్లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు గుర్తు చేశారు.

 కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడులో క్రియాశీలక కేసులు ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ వల్ల ఆసుపత్రిలో చేరికలు, మరణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ, రానున్న రోజుల్లో కేసులు పెరుగుదలను అరికట్టేందుకు అప్రమత్తతతో ఉండటం అవసరమన్నారు. ఈ కొవిడ్,ఇన్‌ఫ్లుయెంజా దాదాపు ఒకే లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం, గాలివెలుతురు సరిగా ఉండేలా చూసుకోవడం వంటి చర్యల ద్వారా వీటి వ్యాప్తిని నిరోధించవచ్చని చెప్పారు..

 గడిచిన 24 గంటల కరోనా కేసుల సంఖ్యను శనివారం ఉదయం కేంద్రం వెల్లడించింది. కొత్తగా 1,590 కేసులు వెలుగుచూశాయని తెలిపింది. 146 రోజుల్లో ఇదే అత్యధికమని తెలిపింది. క్రియాశీలక కేసులు 8, 601కు చేరాయి.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4