APTF VIZAG: ఉపాధ్యాయులకు ఉచితంగా ట్యాబ్లు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు

ఉపాధ్యాయులకు ఉచితంగా ట్యాబ్లు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు


 ప్రభుత్వ పాఠశాలల్లో 6-10 తరగతులకు బోధించే సబ్జెక్టు ఉపాధ్యాయులకు అదనపు కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందిం చనున్నామని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఉపాధ్యాయులతో గురువారం నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సవరించిన కంటెంట్ను ఏప్రిల్ 30లోపు ట్యాబ్లో అప్లోడ్ చేయనున్నామని, వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు ఈ వీడియోలు చూడొచ్చని సూచిం చారు. ఇప్పటికే 3వేల బడుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్లో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఫార్మెటివ్-4 పరీక్ష లకు ముందే సిలబసన్ను పూర్తి చేయాలని సూచించారు.

No comments:

Post a Comment

Featured post

Know your transfer application status